Health Tips: ఈ మధ్యకాలంలో చాలా మందికి ఆహార జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. సరైనా ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొలోరెక్టల్ క్యాన్సర్ కు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి తీసుకునే ఆహార పదార్థాలలో కొన్ని మార్పులు ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది. ఇంతకు అవేంటో చూద్దాం.
ఇంట్లో వండిన పదార్థాలను తీసుకోవటం: ఎంత ఆకలిగా ఉన్నా కూడా ఇంట్లో పదార్థాలను తీసుకోవటానికి ఇష్టపడాలి. స్వయంగా ఇంట్లో తయారు చేసిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. చాలావరకు తాజా కూరగాయలను తీసుకోవడానికి ఆసక్తి చూపించాలి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ బాగుంటుంది.
ఫైబర్ ఆహార పదార్థాలు: చాలా వరకు తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండేటట్టు చూసుకోవాలి. దీనివల్ల కడుపు ఎప్పటికప్పుడు క్లియర్ అవుతూ ఉంటుంది. చాలావరకు ఫైబర్లు పండ్లు, కూరగాయలలో ఉంటాయి కాబట్టి ఇవి తీసుకోవటానికి ఆసక్తి చూపించాలి. దీని వల్ల జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది.
ఒత్తిడి లేకుండా చూసుకోవాలి: ఈ మధ్యకాలంలో తీరికలేని సమయం గడుపుతున్న వాళ్లంతా ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడిగా ఉండటం వల్ల, ఆందోళన చెందడం వల్ల జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది. దీనివల్ల ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది. కాబట్టి ఒత్తిడికి దూరంగా ఉండాలి అంటే సరైన నిద్ర అవసరం. తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు నడవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉంటుంది.
Health Tips:
ఆహారాన్ని మెత్తగా నమలాలి: చాలామంది ఆహారాన్ని ఎక్కువసేపు నమ్మలేకుండా తొందరగా మింగేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. పైగా జీర్ణవ్యవస్థకూడా సక్రమంగా పనిచేయదు. కాబట్టి ఆహారాన్ని మెత్తగా నమలడానికి ప్రయత్నించండి. ఇక ఇవే కాకుండా గోరువెచ్చని నీళ్లలోనిమ్మరసం కలిపి తాగటం వల్ల కూడా జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. అంతేకాకుండా సోంప్, జీలకర్ర కూడా జీర్ణవ్యవస్థకు బాగా సహాయపడుతుంది.