Health Tips: అప్పుడే వేసవికాలం వచ్చేసింది. ఇప్పుడే ఎండలు ఇలా మండిపోతుంటే నడివేసవిలో ఎలా ఉంటుందో అని కంగారు పడుతున్నారు జనాలు. ఎండ, ఎండతో పాటు వచ్చే వ్యాధులతో చాలా జాగ్రత్తగా ఉండమంటున్నారు వైద్యులు. మిగతా సీజన్లో వచ్చే వ్యాధులు ఒక రకం అయితే వేసవిలో వచ్చే వ్యాధులు మరొక రకం.
వేసవిలో వచ్చే డిహైడ్రేషన్, హైపర్ దేర్మియా, కామెర్లు, అతిసారం వీటితో పాటు తరచుగా తగిలే వడదెబ్బ, పేత లాంటివి ముఖ్యమైనవి. అయితే ఇవి మనకి సంక్రమించినప్పుడు భయపడకుండా సరైన జాగ్రత్తలు పాటిస్తూ వీటినుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అది ఎలాగో చూద్దాం. వేసవిలో సాధారణంగా అందరికీ వచ్చే ఎఫెక్ట్ వడదెబ్బ. బయట ఉష్ణోగ్రతలతో పాటు శరీరంలో ఉండే ఉష్ణోగ్రత కూడా పెరగడంతో చేసే వ్యవస్థ విఫలమైతే డిహైడ్రేషన్ వస్తుంది.
ముందుగా ఇది ఎందుకు వస్తుందో చూద్దాం. అత్యంత వేడి ప్రదేశాల్లో తిరగటం వల్ల సరియైన మోతాదులో నీరు తాగకపోవడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అశ్రద్ధ చేస్తే ఇది చాలా ప్రమాదం కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో సులభంగానే దీని నుంచి తేరుకోవచ్చు. కొబ్బరి నీళ్లు తాగడం గ్లూకోజ్, ఎలక్ట్రోల్ పౌడర్ వంటివి తాగడం వల్ల వడదెబ్బ కొట్టిన ఒంటికి ఉపశమనం కలుగుతుంది. ఆ తర్వాత కూడా అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సంప్రదించడం మంచిది ఎందుకంటే నిర్లక్ష్యం చేయడం వల్ల మూత్రపిండాలు కాలేయం లాంటివి దెబ్బతిని ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది.
కొన్ని రకాల మందులు కూడా వడదెబ్బకి కారణం అవుతాయి. కాళ్లు చేతులు నొప్పులు, శరీరం తిమ్మిరి పట్టడం, తలనొప్పి ఉన్నట్లు ఉండి స్పృహ కోల్పోవడం వంటివి వడదెబ్బ లక్షణాలు. అలా జరిగిన వ్యక్తికి తక్షణమే తడిబట్టతో ఒళ్లంతా చల్లబరిచి నీళ్లు తాగించి వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. మనం మరీ ముఖ్యంగా ఎదుర్కొనే అతి ప్రధానమైన సమస్య చెమట పొక్కులు. మన శరీరం నుంచి విడుదలయ్యే చెమట వల్ల చెమట పొక్కులతో పాటు మరిన్ని చర్మవ్యాధులు సంక్రమిస్తాయి.
సోరియాసిస్ వంటి వ్యాధి ఉన్నవాళ్లకి ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి. మరోవైపు రేకుల ఇల్లు, అపార్ట్మెంట్ పై అంతస్తులో ఉండేవారు ఇల్లులు చాలా వేడిగా ఉంటాయి. వాటికి మనుషులు తట్టుకున్నా, శరీరం తట్టుకోలేదు అప్పుడు హైపర్ థెర్మియాకు గురై గుండెపోటు వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని మీ ఇంట్లో వాతావరణ పరిస్థితులు మరి వేడిగా లేకుండా చూసుకోవాలి.
ఇంటి పైకప్పుని ఎప్పటికప్పుడు నీటితో తడపడం, డాబా మీద పచ్చని ఆకులు వేయటం ఇలాంటి వాటి ద్వారా వేడిని నియంత్రించవచ్చు. ఇదే సీజన్లో వచ్చే మరొక వ్యాధి టైఫాయిడ్. వేసవిలో జ్వరం వస్తే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. దానితోపాటు తలనొప్పి నీరసం ఉంటే అస్సలు అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. ఇల్లు అపరిశుభ్రంగా ఉండడం వల్ల టైఫాయిడ్ తో పాటు అధికారం కూడా వ్యాపిస్తుంది. వీటితోపాటు కామెర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వీలైనంత శుభ్రంగా మన ఇంటిని ఉంచుకోవాలి.
వీటితోపాటు రైనో, పర ఇన్ ఫ్లూయంజా కరోనా వంటి వైరస్లు మరింత ప్రమాదకరంగా మారుతాయి. ఇవి మిగతా శ్రీశైలంలో వచ్చే వైరస్ల కన్నా ప్రమాదకరమైనవి. నాలా ఇన్ఫెక్షన్లు కూడా వేసవిలోనే ఎక్కువగా వస్తాయి. ఇటువంటి సమయాల్లో బయట ఎక్కడపడితే అక్కడ నీరు తాగడం తిండి తినడం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు పండ్ల రసాలు గాని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మరీ ముఖ్యంగా గర్భిణీలు వారిపై అధిక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఒంట్లో నీటి శాతం తగ్గిపోకుండా ఎప్పటికప్పుడు ద్రవపదార్థాలు తీసుకోవాలి.
Health Tips:
లేకపోతే పిండం చుట్టూ ఉండే ఉమ్మనీరు తగ్గిపోయి శిశువు చనిపోయే ప్రమాదం ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కువగా ఉండే సమయాల్లో ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కళ్ళ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించండి ఎందుకంటే నేరుగా ఎండ కళ్ళలోకి వెళ్తే కంట్లో తేమ ఆవిరైపోతుంది. అలాగే కంటి చర్మం కూడా పొడిబారిపోతుంది. బయటికి వెళ్ళవలసి వస్తే కచ్చితంగా సన్ గ్లాసెస్ పెట్టుకోండి. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తూ, అవసరమైతే వైద్యుని సలహాలు తీసుకుంటూ సమ్మర్ ని ఎంజాయ్ చేయమంటున్నారు నిపుణులు.