Health Tips: ప్రస్తుతం చలికాలం ఉంది కాబట్టి ప్రజలు చలితో గడగడ వణుకుతున్నారు. దీంతో ఎంత చలి మంటలు కాల్చినప్పటికీ కూడా, వేడి వేడి పదార్థాలు తిన్నప్పటికీ కూడా చలి తీవ్రత మాత్రం శరీరాన్ని వదల లేక పోతుంది. అయితే ఇవి కాకుండా చలికాలంలో వెచ్చగా ఉండటానికి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల వల్ల చలికాలంలో వచ్చే కాళ్ల పగుళ్ల సమస్యలు, దురద వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇంతకూ అవేంటంటే..
వేరుశనగ: వేరుశెనగలోఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, మైక్రో – మేక్రో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి వెచ్చగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో వేరుశెనగ తినడం చాలా మంచిది.
పాలు, అంజీరా: ఇక పాలు, అంజీరా శరీరానికి బాగా సహాయపడతాయి. ఇవి నిత్యం తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అయితే రోజు కప్పు పాలల్లో మూడు అంజీరాలను వేసి మరిగించి తాగటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
బెల్లం: బెల్లం కూడా శరీరానికి బాగా సహాయపడుతుంది. ఇది నిత్యం తీసుకోవడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. అంతేకాకుండా రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది.
ఉసిరి: చలికాలంలో దొరికే ఉసిరి శరీరానికి బాగా శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్ సి ఉండటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరి వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు దరి చేరవు. ఇక ఇది చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది.
Health Tips:
జామకాయ: ఇక జామకాయ లో ఉండే ఆరోగ్య గుణాలు అందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. జామను తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇందులో కూడా విటమిన్ ఏ, సి ఉండటంవల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.