Health Tips: మెదడు వాపు వ్యాధి దోమల దోమ కాటు వల్ల వ్యాపిస్తుంది. ఈ వ్యాధిని మొదటిసారిగా 1871లో జపాన్ దేశంలో గుర్తించారు. అక్కడినుంచి ప్రపంచమంతా పాకి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంది. ముఖ్యంగా పిల్లలు ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. అసలు ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో చూద్దాం. దీన్ని ఇంగ్లీషులో ఎన్కెఫలైసిట్ అంటారు.
ఇది ఎక్కువగా పందులు, ఎలకలు, పక్షుల్లో నిక్షిప్తమై ఉంటుంది. దోమలు ఆ ఎలుకలను గాని పందులను గాని కుట్టిన తరువాత మనిషిని కుడితే ఆ వ్యక్తికి మెదడు వ్యాపు సంక్రమిస్తుంది. దోమకుట్టిన ప్రతి వ్యక్తికి ఈ వ్యాధి రాదు. నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారి ఈ వ్యాధికి గురవుతారు. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి జ్వరం రావడం,శ్వాస తీసుకోవటానికి ఇబ్బంది పడటం తరచూ అపస్మారక స్థితిలోకి వెళ్ళటం.
మలమూత్ర విసర్జనపై నియంత్రణ ఉండకపోవటం జరుగుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే మరణాలు కూడా సంభవిస్తాయి. ఏడాది నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. వ్యాధి వచ్చి తగ్గినప్పటికీ దాని తీవ్రత జీవితకాలం వెంటాడుతుంది అదే జబ్బు యొక్క భయంకర లక్షణం. రోగ నిర్ధారణ అయిన తరువాత రోగి పరిస్థితిని బట్టి డాక్టర్లు మందులు ఇస్తారు. న్యూరాలజిస్టుల పర్యవేక్షణలో మాత్రమే ట్రీట్మెంట్ జరుగుతుంది.
మెదడు వ్యాపు వ్యాధి రాకుండా టీకా ఉంది. ఈ టీకాను ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వేసుకోవాలి. ఈ టీకాను అన్ని దశలలోనూ తీసుకున్న వారికి మాత్రమే వ్యాధి నుంచి రక్షణ ఉంటుంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పిల్లలకు సకాలంలో టీకాలు వేయించడం, ఇంట్లో, ఇంటి బయట కూడా దోమలు లేకుండా చూసుకోవాలి వీటివల్ల వ్యాధికి బారిన పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
Health Tips:
సరైన పోషకాహారం తీసుకోవటం వల్ల కూడా ఈ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు ఎందుకంటే ఇమ్యూనిటీ ఉంటే ఈ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చు. దోమలు ముఖ్యంగా నీటి కుంటలు చెమ్మ ఉన్న దగ్గర ఉంటాయి అందుకని పరిసరాలని, ఇంటిని ఎప్పుడూ పొడిగా ఉండేలాగా చూసుకోండి. వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కన్నా రాకుండా జాగ్రత్త పడడం మేలు.