heavy drinking of coffee disadvantages telugu
heavy drinking of coffee disadvantages telugu

Coffee : బాగా తలనొప్పిగా ఉంది. కాస్త బయటికెళ్లి ఓ కప్పు కాఫీ తాగొద్దాం పదా.. అంటూ ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినా ముందు మాట్లాడుకునే మాట ఇది. ఫ్రెండ్సే కాదు.. తెలిసిన వాళ్లు, బంధువులు.. ఇలా ఎవ్వరైనా ఇద్దరు కలిస్తే చాలు.. ముందు టీ కొట్టుకు వెళ్లాల్సిందే. ఓ కప్పు కాఫీ తాగాల్సిందే. ఎవరైనా ఇంటికి వచ్చినా చాలు.. వాళ్లకు చేసే మొదటి మర్యాద కాఫీ. కాఫీ తాగుతారా బాబు.. ఏం తీసుకుంటారు? అంటూ మొదటగా ఎక్కడికి వెళ్లినా అడిగే ప్రశ్న ఇదే. కాఫీ.. మన జీవితంలో అంతలా భాగం అయిపోయింది అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే.. రోజుకు ఒకటి రెండు కప్పులు అయితే పర్వాలేదు. నో టెన్షన్. కానీ.. కొందరైతే అదే పని. గంటకో కాఫీ. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు. గంటకో కాఫీ తాగుతూ కాలక్షేపం చేస్తుంటారు. అలా రోజులో ఎన్ని కప్పులు పడితే అన్ని కప్పుల కాఫీ తాగొచ్చా? అలా.. తాగితే ఆరోగ్యం చెడిపోదా? అసలు.. రోజుకు ఎన్ని కప్పుల వరకు కాఫీ తాగాలి? అసలు కాఫీ తాగాలా? వద్దా? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానమే ఈ కథనం.

heavy drinking of coffee disadvantages telugu
heavy drinking of coffee disadvantages telugu

నిజానికి కాఫీలో కెఫైన్ అనే పదార్థం ఉంటుంది. అది శరీరానికి మోతాదు స్థాయిలో అందితే ఏం కాదు. కానీ.. ఎక్కువ శాతం కెఫైన్ అందితే మాత్రం కోరి సమస్యలు తెచ్చుకున్నట్టే. ఇటివలే.. వాషింగ్టన్ లో రీసెర్చర్స్ చేసిన అధ్యయనంలో కాఫీ గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజూ మోతాదుకు మించి కాఫీ తాగితే ఏమౌతుందో వాళ్లు కళ్లకు కట్టినట్టు వివరించారు.

Coffee : కాఫీ ఎక్కువగా తాగితే కంటి చూపు పోతుందట

కాఫీలో కెఫైన్ ఎక్కువగా ఉంటుందని తెలుసు కదా. కెఫైన్ శరీరంలో ఎక్కువైందంటే.. గ్లాకోమా అనే వ్యాధి వస్తుందట. గ్లాకోమా ఎక్కువైతే జన్యుపరమైన సమస్యలు రావడంతో పాటు.. కంటి చూపు మందగిస్తుందట. అంటే.. కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికైనా గ్లాకోమా సమస్య ఉంటుందో అటువంటి వాళ్లు కాఫీకి కూడా దూరంగా ఉంటే బెటర్ అంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే.. గ్లాకోమా సమస్య ఉంటే.. కాఫీ ఎక్కువగా తాగితే.. కంటి సమస్యలు తొందరగా వచ్చే ప్రమాదం ఉందట.

కాఫీ ప్రియులకు ఈ పరిశోధన నిజంగా చేదు వార్తే అని చెప్పాలి. నిజానికి చాలామంది కాఫీని యాక్టివ్ అవ్వడం కోసం తాగుతుంటారు. తలనొప్పి తగ్గేందుకు తాగుతుంటారు. కాకపోతే.. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. రోజులో ఒకటి లేదా రెండు కప్పులు అంతే. అంతకు మించి కాఫీని నిత్యం తీసుకుంటే మాత్రం భవిష్యత్తులో కంటి సంబంధ సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 7, 2021 at 7:34 సా.