heavy sleeping leads weight loss
heavy sleeping leads weight loss

Weight Loss : ప్రస్తుత జనరేషన్ లో నిద్ర అంటేనే కరువు అయిపోయింది. ఎప్పుడో రాత్రి 12 దాటాక చాలామంది నిద్రపోతున్నారు. స్మార్ట్ ఫోన్ వల్ల యువత ఎక్కువగా నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్ ను చూసి.. ఆ తర్వాత నిద్రపోదామంటే.. నిద్ర రాక… చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిజానికి.. స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్లనే నిద్ర లేమి వస్తుందట. స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే కాంతి నిద్రను డిస్టర్బ్ చేస్తుంది. మనిషి రోజూ కనీసం 8 గంటలు నిద్రపోతేనే ఆరోగ్యంగా ఉంటాడు. లేదంటే అన్నీ అనారోగ్య సమస్యలే.

heavy sleeping leads weight loss
heavy sleeping leads weight loss

నిద్ర సరిగ్గా పోకపోతే వచ్చే మరో సమస్య బరువు పెరగడం. నిద్ర లేమితో బాధపడుతున్నవాళ్లే అధికంగా బరువు పెరుగుతారట. బరువు తగ్గేందుకు ఎన్ని వ్యాయామాలు చేసినా.. సరిగ్గా నిద్రపోకపోతే.. బరువు తగ్గే సమస్యే ఉండదంటున్నారు నిపుణులు. నిద్రకు, బరువుకు సంబంధం ఉందని.. ఇటీవల చేసిన ఓ పరిశోధనలో వెల్లడైనట్టు తెలుస్తోంది.

Weight Loss : నిత్యం తగినంత నిద్ర ఉంటే.. ఖచ్చితంగా బరువు తగ్గుతారట

బరువు తగ్గాలంటే చాలా మంది చాలా కష్టపడుతుంటారు. తిండి మానేస్తారు. ఫుల్ కసరత్తులు చేస్తుంటారు. వ్యాయామాలు చేస్తారు. కానీ.. తగినంత నిద్రపోరు. అయితే.. బరువు తగ్గాలనుకున్నవాళ్లు ముందు చేయాల్సిన పని.. హ్యాపీగా.. హాయిగా తగినంత నిద్రపోవడం. నిత్యం.. ప్రతి రోజు.. సరిపోయేంత నిద్రపోతే బరువు తగ్గుతారట. ఇది పలు అధ్యాయనాల్లో రుజువైందట. రాత్రి పూట తక్కువగా నిద్రపోయేవాళ్లు అకారణంగా బరువు పెరుగుతున్నారట. రాత్రి పూట తగినంత నిద్రపోయేవారు.. కసరత్తులు చేయకున్నా కూడా బరువు తగ్గుతున్నారట.

తగినంత నిద్రపోవడం వల్ల.. నిద్రలో ఆకలిని కలిగించే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. నిద్రలేమి సమస్య ఉంటే.. ఈ హార్మోన్ల ఉత్పత్తిలో సమస్యలు వస్తాయి అన్నమాట. షుగర్ లాంటి వ్యాధి ఉన్నవాళ్లు ఖచ్చితంగా తగినంత నిద్ర పోవాల్సిందే. లేదంటే లేనిపోని సమస్యలు రావడంతో వాటు.. వాళ్లు త్వరగా బరువు పెరుగుతారట. అందుకే.. ఎన్ని టెన్షన్స్ ఉన్నా.. ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా.. హాయిగా రాత్రిపూట నిద్రపోండి. ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 30, 2021 at 6:43 సా.