Helath Tips: 24 గంటల కడుపు నొప్పిగా అందరికీ సుపరిచితమైన ఈ అపెండిసైటిస్ అంటే అందరికీ భయమే. ఎందుకంటే ఏ నిమిషంలో ఏ ప్రమాదాన్ని తీసుకువస్తుందో అని. దీనిని అంతా త్వరగా గుర్తించలేం. చికిత్స కూడా చాలా త్వరగా జరగాలి. లేదంటే ప్రాణాల మీదకి వస్తుంది. అందుకే అపెండిసైటిస్ అంటే అందరికీ అంత భయం. అపెండిక్స్ అనేది పెద్దపేగులో మొదటి భాగం.
శరీర భాగాల్లో దీనికి అంత ప్రాధాన్యత లేకపోవడం వలన పెద్ద పేగు కి అతుక్కుపోయి ఉన్న చిన్న తిత్తిలాగా తయారైంది. సాధారణంగా 8 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. లోపలికి ఏవైనా పదార్థాలు వెళ్తుంటే పేగులు సైజు పెరుగుతుంది. కానీ ఈ అపెండిక్స్ ప్రత్యేక కోణంలో ఉంది ఉండటం వల్ల దీనిలోకి ఎలాంటి పదార్థాలు వెళ్ళవు. వెళ్లినప్పుడే అసలు సమస్య ప్రారంభమవుతుంది.
అపెండిసైటిస్ అనేది కడుపు నొప్పితో ఆరంభం అవుతుంది. తర్వాత జ్వరము, ఆకలి లేకపోవడం వంటివి వీటి ప్రధాన లక్షణాలు. జ్వరం వచ్చినప్పుడు కచ్చితంగా 104 డిగ్రీల జ్వరం ఉంటుంది. మధ్యలో తరగడం.. పెరగడం అంటూ ఉండదు. అపెండిక్స్ నొప్పి బొడ్డు దగ్గర అదే కడుపు నొప్పిక అపెండిక్స్ కి డిఫరెన్స్. నొప్పితో పాటు మలబద్ధకం, గ్యాస్, తిమ్మిర్లు వంటివి వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించాలి.
చికిత్స చాలా త్వరగా జరగాలి లేదంటే చనిపోయే ప్రమాదం ఉంది అందుకే దీన్ని 24 గంటల కడుపునొప్పి అంటారు. వైద్యులు కూడా దీన్ని సులభంగా గుర్తించలేరు ఎందుకంటే ఇది పేగుల ఇన్ఫెక్షన్, క్రామ్ వ్యాధి గాల్బ్లాడర్ సమస్యలకు దగ్గరగా ఉంటుంది. అందుకే సమస్యని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ సిటి స్కాన్ వంటి టెస్టులు చేయిస్తారు వైద్యుడు.
ఈ సమస్యతో బాధపడేవారి మూత్రంలో ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు బ్యాక్టీరియా కనిపిస్తాయి. అపెండిక్స్ లో మొదలయ్యే ఇన్ఫెక్షన్ యూరిన్ బ్లాడర్ విస్తరించే ప్రమాదం కూడా ఉంది. తీవ్రమైన నొప్పికి సర్జరీ చేయకపోతే వెంటనే ఆపెండిక్స్ పగిలిపోయి అందులోని పదార్థాలు ఉదరంలోకి చేరుతాయి ఫలితంగా పెరిటోనైటిస్ అనే సమస్య మొదలవుతుంది. అలాంటి సందర్భంలో సర్జరీ అత్యవసరమవుతుంది.
Helath Tips:
అపెండిక్స్ ని తొలగించడం మీద భిన్నభిప్రాయాలు ఉన్నాయి. ఈ అవయవం వల్ల శరీరానికి అంతగా ఉపయోగం ఏమీ ఉండదు అని కొందరు అంటారు మరికొందరు మాత్రం శక్తి పెంచేందుకు ఉపయోగపడుతుంది అంటారు. అయితే దీనిని తొలగించిన పెద్దగా సమస్యలేవీ ఉండవంటున్నారు నిపుణులు. ఆపెండిసైటిస్ రాకుండా మార్గాలు ఏవి లేవు.