home remedies for cough health tips telugu
home remedies for cough health tips telugu

Cough : ఇది వర్షాకాలం సీజన్. ఈ సమయంలో ఎక్కువగా వైరస్ లు వ్యాప్తి చెందుతుంటాయి. అవే సీజనల్ వ్యాధులు. వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేది దగ్గు, జలుబు. నిజానికి.. ప్రస్తుతం మనమంతా కరోనాతో అల్లాడుతున్నాం. ఈ కరోనా సమయంలో.. వచ్చే దగ్గు, జలుబు.. కరోనా వల్ల వచ్చిందా? లేక సాధారణంగా సీజన్ మారడం వల్ల వచ్చిందా? అనేది తెలుసుకోవాలి. లేకపోతే.. లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. నిజానికి.. సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబును వంటింటి చిట్కాలు ఉపయోగించి తరిమికొట్టొచ్చు. దాని కోసం ఆసుపత్రులకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అసలే కరోనా రోజులు. ఈ సమయంలో బయటికి వెళ్లడం కన్నా.. దగ్గు, జలుబును ఇంట్లోనే ఉండి.. ఈ ఆయుర్వేద చిట్కాలను ఫాలో అయి తగ్గించుకోవచ్చు.

home remedies for cough health tips telugu
home remedies for cough health tips telugu

Cough : తేనె మంచి ఔషధం

మనకు ఆయుర్వేదంలో ఉండే మంచి ఔషధం తేనె. తేనెను తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. తేనె.. దగ్గుకు కూడా మంచి ఆయుర్వేద మందులా పనిచేస్తుంది. దగ్గు బాగా వస్తుంటే.. ఒక స్పూన్ తేనెను తీసుకొని.. దాన్ని అలాగే తినేయాలి. అలా చేస్తే.. గొంతులో ఉండే మంటను అది వెంటనే తగ్గిస్తుంది. దాని వల్ల.. దగ్గు వెంటనే తగ్గుతుంది. తేనెను అలాగే తీసుకోకపోతే.. తేనెకు కాస్త నిమ్మరసం కలిపి అయినా తీసుకోవచ్చు. దాంతో దగ్గు వల్ల కాస్త ఉపశమనం లభిస్తుంది.

ఒకవేళ దగ్గు చాలా రోజుల నుంచి వస్తుంటే.. ఉదయం పూటే లేవగానే.. పరిగడుపున తమలపాకును తీసుకొని.. తమలపాకుపై తేనెను పూసి.. దాన్ని తినేయండి. అలా కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే దగ్గు మటుమాయం అవుతుంది.

దగ్గు వెంటనే తగ్గాలంటే.. కొన్ని నల్ల మిరియాలను తీసుకోండి. వాటిలో కాసింత తేనె కలపండి. ఆ మిశ్రమంలో కాసిన్ని వేడి నీళ్లు పోసి.. దానిపై మూత పెట్టి.. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తాగేయండి. అప్పుడు అద్భుతంగా ఉంటుంది. వెంటనే దగ్గు తగ్గిపోతుంది.

దగ్గు విపరీతంగా వేధిస్తుంటే.. అల్లం టీ బెస్ట్ ఔషధం. ఉద్యోగం చేసేవాళ్లు అయినా.. బయట తిరిగే వాళ్లు అయినా.. దగ్గు కోసం అల్లం టీని తాగొచ్చు. అల్లం టీని తాగితే దగ్గు నుంచి కాస్త అయినా ఉపశమనం లభిస్తుంది.

వాము తెలుసు కదా మీకు. ఒక స్పూన్ వాము తీసుకొని.. దానికి కాసింత పసుపు కలిపి.. ఒక కప్పు నీటిని తీసుకొని.. వేడి చేసి.. బాగా వేడి చేసి.. చల్లారాక.. కాసింత తేనె కలుపుకొని తాగండి. ఇలా కనీసం ఓ వారం రోజులు చేయండి. దగ్గు మళ్లీ జన్మలో రాదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 20, 2021 at 9:21 ఉద.