Oil Skin: ఆయిల్ స్కిన్ వారి బాధ వర్ణణాతీతం. ఎందుకంటే ఎన్ని సార్లు ముఖం శుభ్రం చేసుకున్నా, మేకప్ వేసుకున్నా ప్రయోజనం ఉండదు. తిరిగి కొద్దిసేపటికే స్కిన్ ఆయిలీగా కనబడుతుంది. అంతే కాదు ఆయిల్ స్కిన్ కలవారికి ముఖంలో మొటిమలు మచ్చల సమస్య అధికంగా ఉంటుంది. చాలా మంది జిడ్డు ముఖంతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. నిజంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా జిడ్డు కారుతూనే ఉంటుంది. అయితే అటువంటి వాళ్ళు ఈ చిట్కాలను పాటిస్తే ఆయిల్‌ స్కిన్‌కి గుడ్ బై చెప్పవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే ముఖంలో గ్లో మరింత ఎక్కువ అవుతుంది. అదే కాకుండా జిడ్డు కారడం వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి. మరి ఆలస్యం ఎందుకు నిపుణులు చెప్తున్న ఈ సింపుల్ చిట్కాలను చూసేద్దాం.

ఆయిల్‌ స్కిన్‌కి కారణాలనేకం:

వంశపారంపర్యం, డైటరీ చాయిస్, ఎక్కువ స్ట్రెస్, హార్మోనుల్లో మార్పులు, పబ్బరిటి వంటి కారణాల వల్ల ఆయిల్ స్కిన్ ఏర్పడుతుంది. జిడ్డు సమస్యకు కారణం ఏదైనా ..జిడ్డు సమస్య ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. అలాగని ఖరీదైన సౌందర్య సాధనాలే వాడాలని లేదు. ఇంట్లో దొరికే సహజ పదార్థాలతోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

కొన్ని చిట్కాలు:

  • చర్మాన్ని ఎక్స్‌ఫోలియేషన్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీనిని చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. అదే విధంగా రంధ్రాలు కూడా పూడుకుంటాయి. రెగ్యులర్‌గా ఎక్స్‌ఫోలియేషన్ మంచిది. దీని వల్ల దుమ్ము, దూళి వంటివి ముఖం నుండి తొలగిపోతాయి. మీరు స్క్రబ్‌ని ఉపయోగించినా సరే పర్వాలేదు. ఇది కూడా దుమ్ము, ధూళి వంటి వాటిని తొలగిస్తుంది. కాబట్టి ఎక్స్‌ఫోలియేషన్ లేదా స్క్రబ్‌ని వాడడం అస్సలు మర్చిపోకండి.

ఎక్స్‌ఫోలియేషన్ అంటే ఏమిటంటే… డెడ్ స్కిన్‌ని తొలగించడం. ప్రతి రోజు కూడా డెడ్ స్కిన్‌ని తొలగించడం చాలా ముఖ్యం. చర్మనిపుణులు ఈ టెక్నిక్‌ని తప్పక పాటించాలి అని చెప్తున్నారు.

  • అదే విధంగా మీ ముఖాన్ని మృదువైన క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోండి. అయితే ఆ క్లెన్సర్ కచ్చితంగా మీకు పడేది అయి ఉండాలి. ఒకవేళ మీ స్కిన్ టోన్‌కి పడని వాటిని ఉపయోగించారు అంటే తప్పకుండా సమస్యలు వస్తాయి. జిడ్డు చర్మంతో బాధ పడే వాళ్ళు ఎక్కువగా జెల్ ఉండే పదార్థాలు వాడితే మంచిది. క్రీమ్ ఉండే పదార్థాలు వాడడం వల్ల సమస్య మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా పాటించినట్లయితే మార్పు మీకే కనపడుతుంది. ఇలా దీనితో బెనిఫిట్స్ పొందవచ్చు.
  • నిమ్మరసం, మినరల్‌ వాటర్‌ని సమపాళ్లలో తీసుకుని అందులో దూదిని ముంచి ముఖాన్ని తుడుచుకోవాలి. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకుని నూనె లేని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
  • పాలు ఆయిల్ ఫ్రీ క్లెన్సర్. ఇది ఆయిల్ స్కిన్ ను సాప్ట్ గా మార్చుతుంది. పాలలో ఉండే ఆల్ఫాహైడ్రాక్సీ యాసిడ్ చర్మాన్ని ఎక్సఫ్లోయేట్ చేస్తుంది. చర్మంలో పిహెచ్ ను బ్యాలెన్స్ చేస్తుంది. పాలలో కొంచెం గందం నూనెల లేదా బాదం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి, అందులో కాటన్ డిప్ చేసి ముఖానికి అప్లై చేసి, మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మంచి నిద్రకూడా పడుతుంది. ఉదయం చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 11, 2021 at 12:25 ఉద.