how to overcome bald head with great food
how to overcome bald head with great food

Bald Head : బట్ట తల.. ప్రస్తుతం మగవాళ్లను వేధిస్తున్న అతి పెద్ద సమస్య ఇది. వయసుతో పనిలేకుండా చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బట్ట తల ప్రతి మగాడిని వేధిస్తోంది. ఎప్పుడు బట్ట తల వస్తుందోనని తెగ టెన్షన్ పడుతుంటారు కొందరు మగాళ్లు. పెళ్లి కాని యువకుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. వాళ్ల టెన్షన్ మామూలుగా ఉండదు. పెళ్లి కాకుండానే బట్ట తల వస్తే.. ఎక్కడ పెళ్లి కాదోనని తెగ ఆందోళన చెందుతుంటారు. బట్ట తల ఉన్న మగాడిని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు కదా. అందుకే.. బట్ట తల అంటేనే మగాళ్లు దడుసుకుంటున్నారు. మెంటల్ టెన్షన్ తో చచ్చిపోతున్నారు. అటువంటి వాళ్ల కోసమే ఈ కథనం.

how to overcome bald head with great food
how to overcome bald head with great food

మీకు బట్ట తల వచ్చినా.. బట్ట తల వస్తుందని భయపడినా కూడా మీరు చేయాల్సిన పని ఒక్కటే. మీ ఆహారపు అలవాట్లను మార్చుకోవడం. మీ జీవన విధానాన్ని మార్చుకోవడం. ఆ పని చేస్తే చాలు. మీ బట్ట తల వచ్చినా దాన్ని తొందరలోనే పోగొట్టుకోవచ్చు. బట్ట తల రానివాళ్లు కూడా భవిష్యత్తులో బట్టతల రాకుండా ముందు జాగ్రత్త పడొచ్చు. అందుకే.. మీరు చేయాల్సింది మీ ఫుడ్ ను మార్చుకోవాలి. ఇప్పుడు మేం చెప్పే ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే.. మీకు జన్మలో కూడా బట్టతల రాదు.

Bald Head : సండే లేదా మండే.. రోజూ తినండి గుడ్డు

మీరు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా.. మీకు బట్టతల రావొద్దంటే ముందు మీరు చేయాల్సింది రోజూ గుడ్డు తినడం. గుడ్డులో ఉన్న పోషకాలు మరే దాంట్లో ఉండవు. కోడి గుడ్డులో ఉండే ప్రొటీన్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా జుట్టుకు. జుట్టు రాలిపోతున్నా.. జుట్టు రాలిపోతుందనే భయం ఉన్నా.. మీరు చేయాల్సింది ఒక్కటే. కోడి గుడ్డును నిత్యం తీసుకోవడం. అది కూడా ఉడికించిన గుడ్డును తినడం. దాని వల్ల.. జుట్టు బలోపేతం అవుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టుకు ఉండే కుదుళ్లను బలంగా తయారు చేసే గుణం గుడ్డులో ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. సండే లేదా మండే.. రోజూ తినండి గుడ్డు.

అసలు జుట్టు ఎందుకు రాలిపోతుందో? ఎందుకు బట్ట తల వస్తుందో మీకు తెలుసా? విటమిన్స్ లోపం వల్ల. అవును.. శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్స్ శరీరానికి అందకపోతే అంతే.. జుట్టు రాలిపోతుంటుంది. తద్వారా బట్ట తల వస్తుంది. అంటే మీరు చేయాల్సింది శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్ ను అందించడమే. దాని కోసం మీరు చేయాల్సింది పండ్లు, కూరగాయలను తినడం. వాటిని ఎక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా బెర్రీలను, చిలగడ దుంపలను, అవకాడో, సోయాబీన్ ను ఎక్కువ తినండి. అన్ని కూరగాయలను తినండి. ముఖ్యంగా ఆకుకూరలు అయిన పాలకూర, తోటకూరను ఎక్కువగా తీసుకుంటే.. మీరు వద్దన్నా జుట్టు వత్తుగా అవుతుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది.

జుట్టు రాగానే కాదు.. దాన్ని మళ్లీ రాలిపోకుండా కూడా నిలుపుకోవాలి కదా. అందుకోసం మీరు కొన్ని పదార్థాలను అస్సలు ముట్టుకోవద్దు. దాంట్లో మొదటిది చక్కెర. దీన్ని తినడం ఎంత తగ్గిస్తే అంత మంచిది. చక్కెరలో గ్లయిసెమిక్ అనే పదార్థం ఉంటుంది. దాని వల్ల జుట్టు రాలే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చక్కెర బదులు తీపి కోసం బెల్లం వాడండి. అలాగే.. మద్యాపానం తాగడం కూడా జుట్టుకు ప్రమాదకరం. ఆల్కాహాల్ శరీరంలో ఉండే ప్రొటీన్లను బలహీన పరచడం వల్ల.. జుట్టు రాలుతుంటుంది. అందుకే.. ఆల్కాహాల్ కు దూరంగా ఉండండి. ఇక అసలు ముఖ్యమైనది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్. వీటి జోలికి జన్మలో కూడా పోకండి. ఫాస్ట్ ఫుడ్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు బయట ఫుడ్ ను మానేసి.. ఇంట్లోనే ఎక్కువ ప్రొటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోండి. మీకు వద్దన్నా కూడా జుట్టు పెరుగుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 8, 2021 at 8:18 సా.