how to wear and remove face mask
how to wear and remove face mask

Face Mask : ప్రస్తుత తరుణంలో ఫేస్ మాస్క్ కంపల్సరీ అయిపోయింది. కరోనా కంటే ముందు అసలు మాస్క్ అంటేనే చాలామందికి తెలియదు. వైద్య సిబ్బందికి తప్పితే మాస్క్ వేసుకునే అవసరం ఎవ్వరికీ రాలేదు. కానీ.. గత సంవత్సరం నుంచి మనమంతా ప్రతి రోజూ బయటికి వెళ్లిన ప్రతిసారీ మాస్క్ వేసుకుంటున్నాం. ముఖానికి మాస్క్ లేకుంటే బయటికే వెళ్లలేకపోతున్నాం. ఇక నుంచి ఫేస్ మాస్క్ మన జీవితంలో భాగం కానుంది. ఎందుకంటే.. ఇది ఒక్క కరోనా వైరస్ నియంత్రణకే కాదు… అన్ని రకాల వైరస్ లను మన దరికి చేరనీయకుండా కాపాడే కవచం. కరోనా కంటే ముందు.. ఏదైనా వైరస్ సోకినవాళ్లు.. జలుబు, దగ్గు ఉన్నవాళ్లు మాస్కులు ధరించేవాళ్లు. వాళ్లను చూసి మనం ఆశ్చర్యపోయేవాళ్లం. కానీ… ఇప్పుడు మాస్క్ లేకుండా బయట తిరిగే వాళ్లను విచిత్రంగా చూస్తున్నాం.

how to wear and remove face mask
how to wear and remove face mask

చాలామందికి ఫేస్ మాస్క్ ను ఎలా ధరించాలో తెలియదు. అసలు మాస్కుల్లో ఎన్ని రకాలు ఉంటాయి.. ఏ మాస్క్ ను ఎప్పుడు ధరించాలో కూడా తెలియదు. ఏదైనా ఒక వైరస్ ను మనకు రాకుండా కాపాడుకోవడం కోసం మనం మాస్క్ ను వాడుతుంటాం. వాటిలో చాలా రకాల మాస్కులు ఉంటాయి. డెంటల్ మాస్క్, ఐసోలేషన్ మాస్క్, లేజర్ మాస్క్, ప్రొసీజర్ మాస్క్, సర్జికల్ మాస్క్. ఇలా… రకరకాల మాస్కులు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. కొన్ని మాస్కులు చెవులకు తగిలించుకునేలా ఉంటాయి. మరికొన్ని వెనుక కట్టుకునేలా నాడలతో ఉంటాయి. ఎలా ఉన్నా… ప్రస్తుతం తరుణంలో మాస్క్ వేసుకోవడం మాత్రం అనివార్యం.

Face Mask : ఫేస్ మాస్క్ వేసుకుంటే ఏమౌతుంది?

ఒకవేళ మీరు ఎటైనా బయటికి వెళ్లినప్పుడు ఫేస్ మాస్క్ వేసుకుంటే… బయట గాలి ద్వారా, లాలాజలం ద్వారా, దగ్గు ద్వారా, తుమ్ము ద్వారా, తుప్పిర్ల ద్వారా సంభవించే ఎన్నో రకాల వ్యాధులను అరికట్టవచ్చు. ముఖ్యంగా మాస్క్ అనేది మూతి, ముక్కు… ఈ రెండింటిని కవర్ చేసేందుకు ఉపయోగించేది. ఎందుకంటే.. ఏ వైరస్ అయినా శరీరంలో ప్రవేశించేది ఈ రెండు మార్గాల ద్వారానే.

ఒకవేళ మీకు అనారోగ్యంగా ఉన్నా.. జలుబు చేసినా.. దగ్గు ఉన్నా.. లేదా ఏవైనా ఇతర వైరస్ సోకినా.. బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ ను ధరించాలి. అనారోగ్యంగా ఉన్నవాళ్లు ధరించడం వల్ల… బయటికి వెళ్లినప్పుడు వాళ్ల నుంచి మరొకరికి ఆ వ్యాధులు సోకే ప్రమాదం తప్పుతుంది.

Face Mask : మాస్క్ ఎలా ధరించాలి?

అయితే.. చాలామందికి మాస్క్ ఎలా ధరించాలో తెలియదు. ఏదో తమకు తోచిన విధంగా దాన్ని పెట్టుకుంటారు. కానీ.. మాస్క్ ధరించడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది. డిస్పోజబుల్ మాస్కులు అయితే… వాటిని ఒక్కసారి మాత్రమే వాడాల్సి ఉంటుంది. కొన్ని మాస్కులను మళ్లీ పిండుకొని కొన్ని రోజుల పాటు వాడుకోవచ్చు.

మాస్క్ ను ధరించడానికి ముందు చేతులను హ్యాండ్ శానిటైజర్ కానీ… సబ్బుతో కానీ శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే… చేతులను కడుక్కోకుండా మాస్క్ ను ధరిస్తే… చేతుల్లో ఉన్న బ్యాక్టీరియా మాస్క్ కు వ్యాపిస్తుంది. అది ఇంకా డేంజర్. అందుకే.. ముందు చేతులను శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మాస్క్ ను ధరించాలి. మాస్క్ కు ఎలాంటి రంధ్రాలు కానీ.. చిరిగిపోయి కానీ ఉండకూడదు.

కొన్ని మాస్క్ లు చెవులకు పెట్టుకునేలా ఉంటాయి. మరికొన్ని నాడలతో వెనుక భాగంలో కట్టుకోవాలి. ఏ మాస్క్ అయినా సరే… ముక్కు, నోరు.. రెండూ కవర్ కావాలి. అలా ధరిస్తేనే మాస్క్ వేసుకున్నందుకు ప్రయోజనం ఉంటుంది.

Face Mask : మాస్క్ ను ఎలా తీసేయాలి?

మాస్క్ ధరించడమే కాదు… దాన్ని తీసే విధానం కూడా తెలుసుకోవాలి. మాస్క్ ను తీయడానికి ముందు… సబ్బుతో చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మాస్క్ ముందు భాగాన్ని అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే బయట తిరిగినప్పుడు వైరస్ కానీ.. బ్యాక్టీరియా కానీ.. మాస్క్ ముందు భాగంలో వచ్చి చేరుతుంది. అందుకే… ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్ ముందు భాగాన్ని ముట్టుకోకుండా.. చెవుల దగ్గర నుంచి దాని నాడను పట్టుకొని తీసి వెంటనే చెత్తబుట్టలో పడేయాలి. ఒకవేళ నాడలతో కట్టే మాస్క్ అయితే ముందు కింది నాడను విప్పి… ఆ తర్వాత పైనుంచి మాస్క్ ను నాడను పట్టుకొని తీసేయాలి. ఆ తర్వాత మరోసారి చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 24, 2021 at 1:00 సా.