is fish good or bad for diabetes health tips telugu
is fish good or bad for diabetes health tips telugu

Diabetes : షుగర్ లేదా డయాబెటిస్.. పేరు ఏదైనా.. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. షుగర్ వ్యాధి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వయసులో వస్తోంది. అయితే.. ఈ జనరేషన్ లో షుగర్ వ్యాధికి వయసుతో పనిలేదు. ఏ వయసులోని వారికైనా షుగర్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. షుగర్ వ్యాధి అంత డేంజర్. ఒక్కసారి షుగర్ వ్యాధి వచ్చిందంటే.. ఇక షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం ఎన్నో పాట్లు పడాల్సి వస్తుంది. జీవన విధానాన్ని మార్చుకోవాలి. ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాలి.

is fish good or bad for diabetes health tips telugu
is fish good or bad for diabetes health tips telugu

షుగర్ వచ్చిన వాళ్లకు.. సపరేట్ గా ఆహారపు నియమాలను డాక్టర్లు చెబుతుంటారు. అది తినండి.. ఇది తినండి.. అది తినకండి.. ఇది తినకండి.. అంటూ పెద్ద లిస్టు ఇస్తారు. దాన్ని బట్టి.. ఆహారపు నియమాలను మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. షుగర్ వచ్చిన వాళ్లు చేపలు తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని చాలామంది చెబుతుంటారు. షుగర్ వచ్చిన వాళ్లకు చేపలు తినాలంటూ సలహాలు కూడా ఇస్తుంటారు. కానీ.. అసలు నిజంగా షుగర్ వచ్చిన వాళ్లు చేపలు తినొచ్చా? తినొద్దా? అసలు నిపుణులు ఏమంటున్నారు? ఏ చేపలు తినాలి? ఏ చేపలు తినొద్దు? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Diabetes : ఏ చేపలు తింటే మంచిది? ఏ చేపలు తినకూడదు?

నిజానికి.. చేపలు తింటే మధుమేహం తగ్గుతుంది.. అనేది ఇప్పటి వరకు నిరూపితం కాలేదట. కాకపోతే.. కొన్ని రకాల చేపలను తింటే మాత్రం.. కొందరిలో మధుమేహం కంట్రోల్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. మధుమేహం నివారణకు అన్ని చేపలు దోహదపడవట. ఉదాహరణకు కొవ్వు ఎక్కువగా ఉండే.. సాల్మాన్ చేపలు తింటే మధుమేహం ముప్పు పెరుగుతుందట. వీటితో పాటు మరికొన్ని చేపల్లో పర్యావరణాన్ని కలుషితం చేసే కారకాలు ఎక్కువగా ఉంటాయట. వీటిని తినడం వల్ల.. షుగర్ వ్యాధి ముప్పు ఇంకాస్త పెరుగుతుంది తప్పితే తగ్గదు.. అని నిపుణులు చెబుతున్నారు. అయితే.. కొన్ని రకాల సముద్ర చేపల వల్ల మాత్రం మధుమేహం ముప్పు అంతగా ఉండదని.. అయితే.. చేపలు తింటే మధుమేహం తగ్గుతుంది.. అనేది మాత్రం అపోహ మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 18, 2021 at 11:05 ఉద.