managing blood sugar levels with these healthy food
managing blood sugar levels with these healthy food

Diabetes : డయాబెటిస్.. షుగర్.. మధుమేహం.. ఏ పేరుతో పలికినా రోగం మాత్రం అదే. షుగర్ వ్యాధి ప్రస్తుతం అందరినీ వేధిస్తోంది. ఆ వ్యాధి ఎప్పుడు వస్తుందో తెలియదు. వయస్సుతో పనిలేకుండా షుగర్ అందరికీ వస్తోంది. దీంతో అందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే.. డయాబెటిస్ ఒక్కసారి వచ్చిందంటే మళ్లీ దాన్ని నయం చేయడం చాలా కష్టం. షుగర్ వ్యాధి వచ్చిన వాళ్లు జీవితాంతం మెడిసన్ వాడుతూనే ఉండాలి. అందుకే.. షుగర్ వచ్చిందంటేనే భయపడతారు.

managing blood sugar levels with these healthy food
managing blood sugar levels with these healthy food

అయితే.. షుగర్ వ్యాధి వస్తే.. ఇక జీవితాంతం మెడిసిన్ వాడుతూనే ఉండాలి అనేది అపోహ మాత్రమే. ఎందుకంటే.. షుగర్ వచ్చినా కూడా సరైన ఆహారం తీసుకుంటే.. ఆహార నియమాలు పాటిస్తే.. షుగర్ ను తరిమికొట్టొచ్చు. షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. దాని కోసం మనం చేయాల్సింది ఏంటంటే.. రక్తంలో షుగర్ లేవల్స్ ను కంట్రోల్ లో ఉంచే ఆహారాన్ని తీసుకోవడం.

Diabetes : ఏ ఆహారం తీసుకుంటే షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి?

బీన్స్, పప్పులు, చిక్కుడు కాయలు లాంటి వాటిని ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. బీన్స్ లాంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే.. వాటిలో తక్కువ గ్లైసెమిక్ ఆహారం ఉంటుంది. దాని వల్ల.. రక్తంలోని గ్లూకోజ్ లేవల్స్ అదుపులో ఉంటాయి.

రోజుకో ఆపిల్ పండు తినండి.. డాక్టర్ కు దూరంగా ఉండండి అని పెద్దలు చెబుతుంటారు. అది నిజమే. ఎందుకంటే.. ఆపిల్ పండులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల.. రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

బాదంపప్పును కూడా ఎక్కువగా తీసుకుంటే.. రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఎందుకంటే.. ఇందులో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. అలాగే.. బాదాంలో ఉండే ఫైబర్, మంచి కొలెస్టరాల్.. రక్తంలో షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేస్తాయి.

చాలామందికి ఆకు కూరలంటే పడదు. కానీ.. షుగర్ ఉన్నవాళ్లు ఖచ్చితంగా పాలకూరను తినాలి. అందులో మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. బచ్చలికూరను నిత్యం తీసుకుంటే రక్తంలో షుగర్ లేవల్స్ ఖచ్చితంగా నార్మల్ గా ఉంటాయి. అలాగే.. ఓట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఓట్స్ తింటే గుండె ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే.. షుగర్ లేవల్స్ కూడా కంట్రోల్ లో ఉంటాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 6, 2021 at 8:46 సా.