Moringa Juice : మీకు మునగ కాయ చెట్టు తెలుసు కదా. మునగ కాయ చెట్టు మొత్తం ఆయుర్వేదమే. మునగకాయ చెట్టును ఎక్కడ చూసినా ఆయుర్వేద గుణాలనే కలిగి ఉంటుంది. మునక్కాయ చెట్టు కాయలు, మునక్కాయ ఆకులు.. ఇలా మునక్కాయ చెట్టంతా ఆయుర్వేదంతో నిండిపోయి ఉంటుంది. మునక్కాయను తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలుసు కానీ.. మునగ ఆకు వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా?

నిత్యం మునగాకును తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. మునగాకును మీరు కూడా వెంటనే తెచ్చుకొని మరీ తినేస్తారు. మునగాకును చాలామంది కూరల్లో కూడా వేసుకొని తింటారు. దాన్నే కూరగా వండుకొని తింటారు. కొందరు దాన్ని జ్యూస్ చేసుకొని తాగుతారు. ఎలా తాగినా.. ఏం చేసినా.. మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Moringa Juice : మునగాకు జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
మునగాకులో ఎన్ని పోషకాలు ఉంటాయో తెలుసా? విటమిన్ ఏ, బీ2, బీ6, ప్రొటీన్స్, ఐరన్, మెగ్నీషియం.. లాంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. మునగాకులో ఉండే కాల్షియం, ఐరన్.. ఎముకలకు చాలా బలం చేకూర్చుతుంది. మునగాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను నిర్మూలిస్తాయి. అలాగే.. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. క్యాన్సర్ కు కారణమయ్యే కణాలను నశింపజేస్తాయి. అలాగే.. దీంట్లో ఉండే బీటా కెరోటిన్.. క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
ఇక.. ప్రస్తుతం అందరినీ వేధిస్తున్న షుగర్ లేవల్స్ ను కంట్రోల్ చేసుకోవాలనుకుంటే… మునగాకును ఎండబెట్టి పొడి చేసుకొని.. రోజూ ఉదయం ఆ పొడిని తీసుకుంటే.. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తంలో షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అందుకే.. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా.. ముందు మునగాకును జ్యూస్ గా చేసుకొని తాగండి. ఓ నెల రోజుల పాటు నిత్యం మునగాకు జ్యూస్ ను తీసుకోండి. మీరు వద్దన్నా.. మీ శరీరంలో ఒక్క సమస్య కూడా ఉండదు.