multisystem inflammatory syndrome mis in children
multisystem inflammatory syndrome mis in children

MIS –C : మీకు Multisystem inflammatory syndrome అంటే తెలుసా? అసలు ఆ పేరే ఎప్పుడూ వినలేదు అంటారా? కానీ.. ఇప్పుడు అది covid 19 కన్నా చాలా డేంజర్ గా తయారైంది. కరోనా వచ్చినా కూడా పెద్దగా సమస్య ఉండదు. జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి ఉంటాయి కానీ.. మల్టీసిస్టమ్ ఇన్ ఫ్లమేటరీ సిండ్రోమ్ సోకితే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది పిల్లల్లో సోకుతోంది. కరోనా సోకినట్టే ఈ వ్యాధి కూడా ఎక్కువగా ప్రబలుతోంది. పిల్లలకు ఈ వ్యాధి సోకితే.. వాళ్ల శరీరంలోని కొన్న అవయవాలు దెబ్బతింటున్నాయని డాక్టర్ల పరిశోధనలో వెల్లడైంది. అవయవాలు దెబ్బతినడంతో పాటు.. కొన్ని అవయవాలు ఎరుపు రంగులోకి మారుతాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ…ఇలా అన్ని అవయవాలు ఎరుపురంగుకి మారుతాయట.

multisystem inflammatory syndrome mis in children
multisystem inflammatory syndrome mis in children

నిజానికి.. MIS-C అనేది ఒక వ్యాధి కాదు. అది ఒక సిండ్రోమ్. కరోనా లాగానే ఇది కొత్త సిండ్రోమ్. అందుకే దీని గురించి ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. ఇప్పటికే యూఎస్ లో కొన్ని ప్రాంతాల్లో పిల్లలు ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్నారు. వాళ్లను టెస్ట్ చేసి.. పరిస్థితి అంచనా వేస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్లు. పిల్లలతో పాటు.. కొందరు యువత కూడా ఈ సిండ్రోమ్ బారిన పడుతున్నారట. దాన్ని MIS – A అని అంటున్నారు. అయితే.. కరోనా బారిన పడి కోలుకున్న యువతలో మాత్రమే ఈ సిండ్రోమ్ లక్షణాలు ఉన్నట్టు తెలుస్తోంది.

MIS –C : ఈ లక్షణాలు ఉంటే సిండ్రోమ్ ఉన్నట్టే లెక్క

ఒక రోజు మొత్తం తీవ్రంగా జ్వరం ఉన్నా.. రోజు దాటి జ్వరం ఉన్నా, వాంతులు అవుతున్నా, డయేరియా, కడుపునొప్పి, చర్మంపై రాపిడి జరిగినా, అలసట వచ్చినా, హార్ట్ బీట్ పెరిగినా, శ్వాసలో సమస్యలు ఉన్నా, కళ్లు ఎర్రబడినా, నాలుక, పెదాలు ఎర్రబడినా, వాపు వచ్చినా, తలనొప్పి ఎక్కువగా ఉన్నా ఎంఐఎస్ సీ లక్షణాలు ఉన్నట్టే. ఒకవేళ.. తీవ్రంగా కడుపునొప్పి ఉంటే.. శ్వాస సమస్యలు ఎక్కువగా ఉంటే, చర్మం రంగులు మారడం, తీవ్రంగా నీరసం ఉన్నా కూడా ఈ సిండ్రోమ్ సమస్య తీవ్రం అయినట్టుగా భావించాలి. అప్పుడు వెంటనే సిండ్రోమ్ బారిన పడిన వాళ్లను హాస్పిటల్ కు తీసుకెళ్లాలి.

అయితే.. పిల్లలను ఈ సిండ్రోమ్ బారిన పడకుండా ఆపడం చాలా బెటర్. ఒక్కసారి ఈ సిండ్రోమ్ వస్తే.. పిల్లలకు చాలా సమస్యలు వస్తాయి. అందుకే.. పిల్లల చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎవరైనా జబ్బు పడినా.. వాళ్ల దగ్గరగా పిల్లలను లేకుండా చూసుకోవాలి. బయటికెళ్తే ఖచ్చితంగా ఫేస్ మాస్క్ ధరించాలి. ఎక్కువగా చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకకూడదు. దగ్గినప్పుడు కానీ.. తుమ్మినప్పుడు కానీ.. ఖచ్చితంగా ఏదైనా నోటికి అడ్డంగా పెట్టుకోవాలి.

MIS – C : ఈ సిండ్రోమ్ కు ఎటువంటి చికిత్స ఉంటుంది?

ఈ సిండ్రోమ్ తో పిల్లలు బాధపడితే మాత్రం ఖచ్చితంగా వాళ్లను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందే. ఐసీయూలో ఉంచి ఈ సిండ్రోమ్ తో బాధపడే పిల్లలకు చికిత్స అందించాల్సి ఉంటుంది. ముందుగా.. శరీరంలోని ఏదైనా అవయవం దెబ్బతిన్నదా.. అనేది స్కాన్ చేసి చెక్ చేసి.. దానికి అనుగుణంగా చికిత్సను అందిస్తారు డాక్టర్లు. అవి ఇంకా తీవ్రంగా దెబ్బతినకుండా.. డాక్టర్లు మెడిసిన్ అందిస్తారు. దాని కోసం.. యాంటీ బయాటిక్స్, స్టెరాయిడ్ థెరపీని చేస్తారు. ఇంకా.. సిండ్రోమ్ తీవ్రతను బట్టి.. దానికి సంబంధించిన చికిత్సను అందించి.. ఈ సిండ్రోమ్ బారి నుంచి రక్షిస్తారు. అయితే.. ప్రస్తుతం ఈ సిండ్రోమ్ ఎక్కువగా అమెరికాలో పిల్లల్లో కనిపిస్తోంది. మన ఇండియాలో అయితే.. ఇప్పటి వరకు ఇటువంటి కేసులు నమోదు కాలేదు కానీ.. భవిష్యత్తులో ఇటువంటి కేసులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి.. ఇప్పటి నుంచే మన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటే మేలు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 16, 2021 at 8:09 సా.