Multivitamin Tablets : ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా భయమే. కరోనా సెకండ్ వేవ్ విపరీతంగా ముంచుకొస్తుంది. దీంతో ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఎలా కరోనా వ్యాప్తి చెందుతోందో కూడా అర్థం కావడం లేదు. అందుకే.. చాలామంది కరోనా రాకుండా.. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం రకరకాల పద్ధతులను అవలంభిస్తున్నారు. కొందరు సొంత వైద్యాన్ని నమ్ముకుంటున్నారు. మరికొందరు డాక్టర్లను సంప్రదించి.. మంచి మెడిసిన్ తీసుకుంటున్నారు. ఇంకొందరు.. మెడికల్ షాపుల్లో దొరికే మల్టీవిటమిన్ టాబ్లెట్లు, కాల్షియం టాబ్లెట్లను వాడుతున్నారు. మల్టీ విటమిన్, కాల్షియం టాబ్లెట్లు.. ఫుడ్ సప్లిమెంట్స్. అంటే.. ఫుడ్ ద్వారా కాకుండా.. ఇలా మెడిసిన్ ద్వారా విటమిన్స్ ను పొందడం అన్నమాట. నిజానికి ఏ ఫుడ్ లో ఏ విటమిన్ ఉంటుందో చాలామందికి తెలియదు.. అందుకే ఫుడ్ కన్నా విటమిన్ టాబ్లెట్లను మింగితే సరిపోద్ది కదా అనుకొని.. వాటిని మెడికల్ షాపుల్లో కొనుక్కొని తెగ మింగేస్తున్నారు. కరోనా సమయంలో చాలామంది చేసిన పని ఇదేనట.

అసలు.. మిగితా టైమ్ లో కంటే.. కరోనా టైమ్ లో మల్టీ విటమిన్ టాబ్లెట్ల సేల్స్ ఒక్కసారిగా పెరిగాయట. అంటే.. చాలామంది అవసరం ఉన్నా లేకున్నా.. కరోనా వస్తుందన్న భయంతో మల్టీ విటమిన్ టాబ్లెట్లను కొనుక్కొని మింగేస్తున్నారు. ఇలా చేయడం మంచిదేనా? ఫుడ్ ద్వారా కాకుండా.. ఇలా సప్లిమెంట్లతో విటమిన్స్ వస్తే ఏం కాదా? శరీరానికి ఆ విటమిన్లు ఉపయోగపడతాయా? అసలు.. ఇలా.. వైద్యులను సంప్రదించకుండా.. అవసరం లేకపోయినా మల్టీ విటమిన్ టాబ్లెట్లను వాడొచ్చా? అనేదే ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సమాధానం తెలియక చాలామంది సతమతమవుతున్నారు.
Multivitamin Tablets : మల్టీ విటమిన్ టాబ్లెట్లు ప్రాణాంతకం అంటున్న వైద్యులు
మనకు శరీరానికి కావాల్సిన ఏ విటమిన్స్, మినరల్స్ అయినా ఫుడ్ ద్వారానే అందాలి. ఫుడ్ తీసుకున్నా కూడా శరీరం ఆ ఆహారం నుంచి విటమిన్స్, మినరల్స్ ను గ్రహించకపోతే అప్పుడు డాక్టర్లు కొన్ని మల్టీ విటమిన్ టాబ్లెట్లను సూచిస్తారు. అవి ఫుడ్ సప్లిమెంట్స్. కాకపోతే అందరికీ కాదు.. శరీర పరిస్థితిని బట్టి కొందరికే డాక్టర్లు మల్టీ విటమిన్ టాబ్లెట్లను వేసుకోవాలంటూ సూచిస్తారు. కానీ.. చాలామంది డాక్టర్లను సంప్రదించకుండా.. అవసరం ఉన్నా లేకున్నా.. వాటిని వాడటం ప్రాణాంతకం అంటున్నారు డాక్టర్లు.
ఎందుకంటే.. శరీరానికి కావాల్సిన విటమిన్స్, కాల్షియం.. మనం తినే ఆహారం ద్వారా అందుతాయి. అలా కాదని.. ఫుడ్ సప్లిమెంట్స్ ను తీసుకుంటే.. ఎక్కువ మోతాదులో కాల్షియం శరీరానికి అందుతుంది. విటమిన్స్ కూడా కావాల్సిన దాని కన్నా.. ఎక్కువగా శరీరానికి అందుతాయి. దీని వల్ల.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇలా నిత్యం మల్టీ విటమిన్ టాబ్లెట్లను తీసుకోవడం వల్ల.. శరీరంలో కాల్షియం నిల్వలు పెరిగి.. దీర్ఘ కాలిక వ్యాధులు రావడంతో పాటు గుండె జబ్బులు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అసలు.. నిత్యం పౌష్ఠికాహారం తీసుకుంటే.. మల్టీ మిటమిన్, కాల్షియం టాబ్లెట్లతో అవసరమే లేదని.. ఎప్పుడూ మంచి ఆహారం, విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి కానీ.. ఇలా ఫుడ్ సప్లిమెంట్స్ మీద ఎల్లప్పుడూ ఆధారపడితే.. లేనిపోని రోగాలను కొని తెచ్చుకున్నట్టే అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.