Phool Makhana మఖానా ఔషధ గుణాల ఖజానా…. తామర గింజలు తింటే ఏమి జరుగుతుందో తెలుసా…!

S R

Phool Makhana తామర పూలు గుడి కోనేరులోనో లేదా ఏదైనా నది ముఖం ద్వారంలో కనువిందు చేస్తుంటాయి. ఇక తామర పూలను దేవుడి కోసం సమర్పిస్తాము. అయితే తామర పూలలో ఎన్ని ఔషదా గుణాలు ఉంటాయో తెలుసా. భారతీయ వంటలలో ముఖ్యంగా ఉత్తరాది వాళ్లు విరివిగా వంటల్లో వాడుతారు. ఇక పూల్ మఖనా గా పిలవబడే ఈ తామర విత్తనాలకు ఆయుర్వేదంలోను చాలా ప్రాముఖ్యత ఉంది. చైనీయులు కూడా తామర విత్తనాలు విరివిగా వాడుతారు. మనం సాధారణంగా తినే జీడిపప్పు, బాదాం, వంటి వాటికన్నా మఖానలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.

Phool Makhana సూపర్ ఫుడ్ మఖనా తింటే కలిగే ప్రయోజనాలు….

ప్లీహం, మూత్ర పిండాల పని తీరుకి ఇవి మంచివి.సూపర్ ఫుడ్ మఖానాలో ప్రొటీన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి మరియు కొవ్వు తక్కువగా ఉంటుంది. 100 గ్రాముల మఖానా దాదాపు 347 కేలరీల శక్తిని ఇస్తుంది. మఖనాలో ప్రోటీన్లు అధికంగా ఉండటంవల్ల ఇవి ఉపవాసం చేసే వారికి మంచి ఎంపిక. మఖానాలో 9.7 గ్రాముల ప్రోటీన్లు మరియు 14.5 గ్రాముల ఫైబర్ ఉన్నాయి. ఇక కాల్షియంకి మంచి సోర్స్ మఖనా. మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్పరస్ కూడా మంచి మొత్తంలో ఉంటాయి. మఖానాలో తక్కువ పరిమాణంలో కొన్ని విటమిన్లు కూడా ఉంటాయి. మెగ్నీషియం సాధారణ జీవక్రియకు అవసరం, ఇది కండరాల పనితీరు, నరాల పనితీరు మరియు ప్రోటీన్ల ఉత్పత్తిలో కూడా ప్రతిదానిలో పాల్గొంటుంది. మఖానాలో పుష్కలంగా పిండి పదార్థాలు అలాగే కాల్షియం మరియు ఐరన్ వంటి ఇతర ఖనిజాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాలకు కాల్షియం చాలా ముఖ్యమైనది, అయితే ఆరోగ్యకరమైన రక్తానికి ఇనుము అవసరం. మొత్తంమీద, తామర విత్తనాలు పోషకాహారాన్ని మీ ఆహారంలో చాలా ఎక్కువ అందిస్తుంది, ప్రత్యేకించి ఎవరికైనా ఖనిజాలు మరియు ఫైబర్ లోపిస్తే వారికి మఖనా మంచి ఛాయిస్.

గల్లిక్ యాసిడ్ మరియు క్లోరోజెనిక్ యాసిడ్ అలాగే ఎపికాటెచిన్ మఖానా గింజలలో కనిపించే కొన్ని ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు. గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి పాత్ర పోషిస్తాయి. అంతే కాకుండా వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వవు. షుగర్, గుండె జబ్బులతో బాధపడేవారు మఖానాను తమ ఆహారంలో భాగంగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇవి గ్లూకోజ్ ను నెమ్మదిగా రక్తంలోకి విడుదల చేసేందుకు దోహదపడుతాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది అందువల్ల ఇవి జీర్ణక్రియకు తోడ్పడి మలబద్ధకాన్ని నివారిస్తాయి.

బరువు తగ్గాలనుకునే వారికి మఖనా మంచి ఛాయిస్. ఎందుకంటే వీటిలో అధికశాతం ప్రోటీన్స్, ఫైబర్ ఉండటం వల్ల బరువు అదుపులో ఉండటానికి సహాయం చేస్తాయి. ఇందులో మంచి కొవ్వులు ఉండటం వల్ల బరువు పెరుగుతామనే భయం ఉండదు పైగా కడుపు నిండుగా ఉండి వెంటనే ఆకలి వేయదు. నరాల పనితీరుకి న్యూరో ట్రాన్సమిషన్ చాలా ముఖ్యం, ఇక తామర విత్తనాలు ఎసిటైల్‌కోలిన్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి తద్వారా న్యూరోట్రాన్స్‌మిషన్ ప్రక్రియకు దోహదం చేస్తుంది. ఇక మాఖానా శీఘ్ర స్కలనానికి, వీర్యం నాణ్యతను మెరుగుపరచడానికి మరియు వంధ్యత్వంతో బాధపడుతున్న మహిళలకు సహాయపడతాయి.

ఒత్తిడి మరియు జీవనశైలి మార్పుల వల్ల ఈ రోజుల్లో ఆందోళన, నిరాశ మరియు నిద్రలేమి వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులు సర్వసాధారణం. ఇక వీటినుండి బయట పడటానికి మందులు వాడటం కన్నా ఏంటి చిట్కాలు బెటర్. ఖర్జూరాలు మరియు మఖనాను కొన్ని గంటలపాటు నీటిలో నానబెట్టండి. వాటిని వడకట్టి ఒక గ్లాసు పాలతో కలిపి పడుకునే ముందు ఈ తామర గింజల స్మూతీని తాగాలి. అదనపు తీపి కోసం, మీరు తేనెను కలుపుకోవచ్చు . దీన్ని ప్రతిరోజూ కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మీ నిద్ర నాణ్యతలో మెరుగుదలని మీరే గమనించవచ్చు . ఇలా ఇన్ని పోషక విలువలు ఉన్న మఖనాను ఖచ్చితంగా మీ ఆహారంలో భాగం చేసుకొండి.

- Advertisement -