Pregnancy Care : ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు….

S R

Pregnancy Care Tips : మాతృత్వం అనేది ప్రతి మహిళ జీవితంలో అది ఒక అపురూపమైన ఘట్టం. అయితే ఈ ప్రెగ్నెన్సీ ని ఆరోగ్యాకరంగా ఆస్వాదించాలి అంటే వయస్సు అనేది చాలా ముఖ్యం. అతి చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకోవడం పిల్లలని కనడం వలన తల్లి ఆరోగ్యానికి అలాగే బిడ్డ ఆరోగ్యానికి కూడా ముప్పు ఉండవచ్చు. ప్రస్తుత యువత కెరియర్ మీద ఎక్కువగా దృష్టి సారించడం వలన మూడు పదుల వయసు మీద పడినప్పుడు కాని పెళ్లి చేసుకోవడం లేదు. ఆడవాళ్ళలో 35 ఏళ్ళు దాటినా తరువాత ఫర్టిలిటీ రేటు తగ్గడం వలన పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ ప్రెగ్నన్సీ పొందినా వారిలో డయబేటీస్, రక్త పోటు వంటివి రావొచ్చు.

అయితే ప్రతి మహిళ ప్రెగ్నెన్సీ సమయంలో వారి శరీరంలో కలిగే మార్పుల వలన, ఇంకా హార్మోన్లలో మార్పుల వలన మానసికంగాను, శారీరకంగాను చాలా ఒత్తిడికి లోనవుతారు. ప్రెగ్నెన్సీ సమయంలోనూ, మరియు బిడ్డ పుట్టిన తర్వాత కూడా కొన్ని ఆహారపు అలవాట్లు మరియు శారీరక శ్రమ వలన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదించవచ్చు. ఇలాంటి కొత్త అలవాట్ల వల్ల కొత్త జీవనశైలికి శ్రీకారం చుట్టిన వారవుతారు. అంతేకాకుండా రాబోయే బిడ్డకు జీవితంలో ఉత్తమమైన ప్రారంభాన్ని అందించగలుగుతారు.

ప్రెగ్నెన్సీ సమయంలో ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైన బరువు పెరగటం చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీ సమయంలో కడుపులో ఒక బిడ్డ కూడా ఉంటారు ఇద్దరికి కావాల్సినంత తినాలి అనుకోవడం పాత పోకడ. తినే ఆహారం లో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవడం, ఆరోగ్యకరమైన బరువు పెరగడం అనేది ముఖ్యం.

Pregnancy Care ఆరోగ్యకరమైన బరువు పెరగడం ఎందుకు ముఖ్యం?

గర్భధారణ సమయంలో తగిన మొత్తంలో బరువు పెరగడం వల్ల మీ బిడ్డ ఆరోగ్యకరమైన పరిమాణానికి ఎదగడానికి సహాయపడుతుంది. కానీ చాలా ఎక్కువ లేదా చాలా తక్కువ బరువు పెరగడం వలన మీకు మరియు మీ బిడ్డకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.గర్భధారణ సమయంలో అధిక బరువు పెరగడం వల్ల గర్భధారణ మధుమేహం (గర్భధారణ సమయంలో మధుమేహం) మరియు గర్భధారణ సమయంలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది జీవితంలో తర్వాత టైప్ 2 మధుమేహం మరియు అధిక రక్తపోటుకు మీ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీరు అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటే, ఆరోగ్య సమస్యలకు మీ అవకాశాలు మరింత ఎక్కువగా ఉండవచ్చు. అంతేకాకుండా సహజ కాన్పు కాకుండా సి – సెక్షన్ జరిగే అవకాశాలు ఎక్కువ అవుతాయి.

ఆరోగ్యకరమైన బరువును పొందడం వలన మీరు సులభంగా గర్భం మరియు ప్రసవానికి సహాయపడుతుంది. డెలివరీ తర్వాత మీరు మీ సాధారణ బరువుకు తిరిగి రావడాన్ని సులభతరం చేయడంలో కూడా ఇది సహాయపడవచ్చు. గర్భధారణ సమయంలో సిఫార్సు చేయబడిన బరువు పెరగడం వలన మీరు లేదా మీ పిల్లల జీవితంలో తర్వాత ఊబకాయం మరియు బరువు సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలను కూడా తగ్గించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.మీరు ఎంత బరువు పెరగాలి అనేది గర్భధారణకు ముందు మీ బాడీ మాస్ ఇండెక్స్ (BMI) మీద ఆధారపడి ఉంటుంది. BMI అనేది మీ ఎత్తుకు సంబంధించి మీ బరువును కొలవడం.

మీరు గర్భవతి అయితే బరువు తగ్గడానికి ప్రయత్నించవద్దు. మీ శిశువు సరిగ్గా ఎదగడానికి ఆరోగ్యకరమైన ఆహారాలు మరియు తక్కువ కేలరీల పానీయాలు (ముఖ్యంగా నీరు)కి గురికావలసి ఉంటుంది. కొంతమంది మహిళలు గర్భం ప్రారంభంలో కొద్దిపాటి బరువును కోల్పోవచ్చు. ఇది మీకు జరిగితే మీ ఆరోగ్య సంరక్షణ నిపుణులతో మాట్లాడండి.

ఆరోగ్యకరమైన భోజనం ఎంత తినాలి మరియు త్రాగాలి?

ఆరోగ్యకరమైన ఆహారాలు మరియు తక్కువ కేలరీల పానీయాలు, ముఖ్యంగా నీరు మరియు తగిన సంఖ్యలో కేలరీలు తీసుకోవడం వల్ల మీరు మరియు మీ బిడ్డ సరైన బరువును పొందడంలో సహాయపడవచ్చు. మీకు ఎంత ఆహారం మరియు ఎన్ని కేలరీలు అవసరం అనేది గర్భధారణకు ముందు మీ బరువు, మీ వయస్సు మరియు మీరు ఎంత త్వరగా బరువు పెరగడం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.

ప్రెగ్నన్సీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాలి. రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి. ప్రెగ్నన్సీ సమయం లో స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. సరైన పోషకాహారంతో పాటు సరైన విశ్రాంతి తీసుకోవాలి. (పగలు కనీసం 2 గంటలు, రాత్రి 8 గంటలు).

ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆనందంగానూ, ఆరోగ్యంగానూ ఉంచుకోవడానికి యోగా….

ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువగా ఏమి పని చేయకూడదు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అనేది ఒక అపోహ మాత్రమే. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరానికి కావల్సినంత శారీరక శ్రమ లేకపోతే కాన్పు సమయంలో సహజ కాన్పు అవ్వక ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ సమయంలో సి – సెక్షన్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అయితే నిపుణుల పర్యవేక్షణలో ప్రెగ్నెన్సీ సమయంలో యోగా చేయడం ఒక ఉత్తమమైన అలవాటు. ప్రత్యేకమైన వ్యాయామాలు, ప్రాణాయామాలు, వజ్రాసనం వంటి సులభమైన ఆసనాలు వేయడం ద్వారా సుఖప్రసవం పొందడంతోపాటు, ఆరోగ్యకరమైన, చురుకైనా బిడ్డకు జన్మ ని ఇవ్వవచ్చు. అంతే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో యోగా చేయడం ద్వారా ప్రెగ్నెన్సీ లో ఎదురయ్యే చాలా రకాల ఆరోగ్య సమస్యలను దీని ద్వారా అధిగమించవచ్చు.

  • తల తిప్పడం మరియు మలబద్ధకం
  • హార్మోనలలో తేడాలను సమత్తూల్యం చేస్తుంది
  • కాండరాలను ధ్రుడంగా చేస్తుంది
  • సహజ కాన్పునకు దోహద పడుతుంది
  • కడుపులోని శిశువు ఆరోగ్యాంగా పెరగడం లో సహాయపడుతుంది.
  • జీర్ణక్రియ సజావుగా జరిగేలా సహాయపడుతుంది.

అయితే ప్రెగ్నెన్సీ సమయంలో యోగా చేయాలి అని అనుకుంటే వైద్యుని సంప్రదించి నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే యోగా మొదలు పెట్టడం మంచిది.

- Advertisement -