Pumpkin : పంప్ కిన్.. దీన్నే మనం గుమ్మడికాయ అంటాం మన భాషలో. గుమ్మడికాయను ఎక్కువగా మనం గుమ్మాల ముందు కడుతుంటాం. దిష్టి పోయేందుకు గుమ్మడికాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే.. గుమ్మడికాయల్లోనూ కొన్ని రకాలు ఉంటాయి. బూడిద కలర్ లో ఉండే గుమ్మడి కాయలు వేరే రకం. వాటినే మనం గుమ్మాల ముందు వాడుతుంటాం. మరో రకం గుమ్మడికాయ.. దీన్ని కూడా ఎక్కువగా ఇంటి ముందు దిష్టిపోయేందుకు.. కొత్తింటి ముందు కొడుతుంటారు. ముఖ్యంగా నూతన గృహ ప్రవేశం రోజున ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటారు.

అయితే.. కొత్త ఇంటి ముందు దిష్టి తీయడం కోసమో.. లేక గుమ్మాలకు వేలాడదీయడానికి మాత్రము గుమ్మడికాయను ఉపయోగిస్తే వేస్ట్. ఎందుకంటే.. గుమ్మడికాయలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుమ్మడికాయను చాలా ఆరోగ్య సమస్యల కోసం వాడొచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.
Pumpkin : ఐరన్ లోపం ఉన్నవాళ్లు గుమ్మడికాయను ఎక్కువగా తీసుకోవాల్సిందే
మీకు ఐరన్ లోపం ఉందా? విటమిన్స్ లోపం ఉందా? మినరల్స్ లోపం ఉందా? ఏ లోపం ఉన్నా.. గుమ్మడికాయను లాగించేయండి. గుమ్మడి కాయలో శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెంచుతుంది. శరీరంలో హిమోగ్లోబిన్ ఎంత ఎక్కువగా ఉంటే.. రక్తం అంత ఎర్రగా ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువైతే రక్తంలో ఎరుపు రంగు తక్కువవుతూ వస్తుంది. చాలామందికి ఐరన్ లోపం వల్ల రక్త హీనత సమస్య వస్తుంటుంది. దీని వల్ల.. ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అందుకే.. ఐరన్ లోపం ఉన్నవాళ్లు.. గుమ్మడికాయను ఎక్కువగా తీసుకుంటే.. ఐరన్ పుష్కలంగా లభించి.. ఐరన్ లోపం తగ్గుతుంది.
అలాగే.. గుమ్మడికాయలోనే కాదు.. గుమ్మడికాయ గింజలు కూడా ఔషధమే. వాటిలోనూ విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా బీటా కెరోటిన్ ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచేందుకు దోహద పడుతుంది. గుమ్మడికాయలో ఫైబర్ కూడా ఎక్కువే. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే.. బరువు త్వరగా తగ్గుతారు. అందుకే.. గుమ్మడికాయను ఎక్కువగా తీసుకుంటే బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
ఇక.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ జబ్బులు అయిన జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఇతర వైరస్ లు, ఫ్లూలు తగ్గాలంటే.. గుమ్మడికాయను ప్రతి వర్షాకాలం సీజన్ లో తీసుకోవాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే.. శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు గుమ్మడికాయలో పుష్కలంగా లభిస్తాయి. అందుకే.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే మార్కెట్ కు వెళ్లి గుమ్మడికాయను కొనుక్కొని ఏం చక్కా వండుకొని తినేయండి.