vomit sensation in journey: కొంతమంది ప్రయాణమంటేనే బెంబేలెత్తిపోతుంటారు. ఎందుకంటే వారు ప్రయాణంలో వికారంగాను, వాంతులు మరియు కళ్ళు తిరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా మంది వాంతులు చేసుకోవడం చూస్తుంటాము. ఈ విధమైన సమస్య ప్రతి ముగ్గురిలో ఒకరు తరచు ఎదుర్కొంటూనే ఉంటారు. కారు, బస్సు, రైలు ఏ ప్రయాణమైన కొందరికి వాంతులు అవుతూ ఉంటాయి. అయితే ఈ విధంగా ప్రయాణాల్లో వాంతులు కావడానికి కారణమేంటో తెలుసుకుందాం.!

చాలామందికి ప్రయాణం పడకపోవడం వల్ల వాంతులవుతాయి. మరి కొందరికి ఆ వాహనంలోని వాసన వల్ల  వాంతులు కాగా, మరికొన్ని సార్లు రోడ్డు ఎగుడుదిగుడులు ఉన్న కారణంగా వాంతులు అవుతుంటాయి. ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలియక కొందరు ప్రయాణాలు కూడా మానుకుంటుంటారు.
అయితే ఈ విధంగా ప్రయాణాల్లో తల తిరగడం, వాంతులు కావడానికి గల కారణం చెవిలో ఉండే ‘లాబ్రింథైస్‘ అనే భాగమేనని నిపుణులు తెలియజేస్తున్నారు. మన చెవిలో ఉన్నటువంటి లాబ్రింథైస్ ఉన్న స్థితిలో ఏ చిన్న మార్పులు చోటు చేసుకున్న మనకు వాంతి కలుగుతుంది. ప్రయాణాల్లో మహిళలు, చిన్న పిల్లలు వాంతులు ఎక్కువగా చేసుకుంటారు. ఈ విధంగా ప్రయాణాల్లో వాంతులు చేసుకోవడాన్ని”మోషన్ సిక్ నెస్” అని పిలుస్తారు.

మనం రోజూ స్నానం చేయకపోయినా, మన చెవిని శుభ్రపరచకపోయినా, లేదా చెవిలో మాటమాటికీ శుభ్రపరుస్తూ ఉన్న చెవిలో ఉన్నటువంటి లాబ్రింథైస్ తన సమతాస్థితిని కోల్పోయి మెదడుకు అందవలసిన సంకేతాలను సరిగా పంపించదు. దీంతో మనకు తల తిరగడం, వాంతి వచ్చినట్లు అనిపించడం జరుగుతుందని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ప్రయాణం చేసేటప్పుడు ఒకే విధమైన వేగంతో ప్రయాణం చేయలేము కనుక ఈ ప్రభావం మన చెవిలోని కోక్లియా లాబ్రింథైస్ వ్యవస్థపై పడుతుంది. దాంతో వాంతులు అవుతాయి.

చెవులు ఎందుకు మూస్తారు…?

“వాంతులు సమయంలో చెవులు మూయడం వలన బయట నుంచి చెవుల్లోపలికి గాలి వెళ్లనీయకుండా చేసి… చెవిలోపలి వ్యవస్థపై మరింత ఒత్తిడి పెరగకుండా చూడవచ్చు.

ఇది మానసిక సమస్య కూడా…
ప్రయాణం చేస్తే వాంతులవుతాయి అనేది ఒక రకమైన మానసిక వ్యాధి అంటున్నారు నిపుణులు. చాలా మంది మాకు వాంతులైపోతాయి అని మానసికంగా ముందుగానే ఒక నిర్ణయంతో ఉండటంతో మెదడు దాన్నే తీసుకుంటుంది. ఇది కూడా ప్రయాణంలో వాంతులయ్యేందుకు ప్రధాన కారణాల్లో ఒకటని ఏయూ సైకాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ మధు చెప్పారు.

1. అల్లం: ప్రయాణానికి ముందు అల్లం రసం సేవించాలి. లేదా మార్గమధ్యలో ఉన్నా అల్లం టీ తాగాలి. అల్లం వల్ల ప్రయాణంలో వికారం రాకుండా ఉంటుంది. దీంతో వాంతులు రాకుండా ఆపవచ్చు.

2. పుదీనా: ఆకులను నమిలినా, పుదీనా టీ తాగినా ప్రయాణంలో వాంతులు రాకుండా ఆపవచ్చు.

3. ఆపిల్ సైడర్ వెనిగర్: ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక కప్పు నీటిలో మిక్స్ చేయాలి. ప్రయాణానికి ముందు ఈ నీటితో నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాంతులు మరియు వికారం తగ్గించుకోవచ్చు.

4. లవంగాలు: ప్రయాణంలో వాంతులు మరియు వికారం తగ్గించుకోవడానికి కొన్ని లవంగాలను నోట్లో వేసుకొని నమలాలి . రుచికరంగా ఉండటం కోసం కొద్దిగా తేనెతో కలిపి తీసుకుంటే మంచి జీర్ణశక్తి కూడా ఇలా అనేక రకాల ఇంటి చిట్కాలతో ప్రయాణాల్లో వాంతులు వికారం రావడాన్ని నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 16, 2021 at 11:48 సా.