sapota or chiku health benefits telugu
sapota or chiku health benefits telugu

Sapota : సపోటా తెలుసు కదా. దాన్ని చూస్తేనే నోరూరుతుంది. సపోటాను చూశాక దాన్ని కొనుక్కొని తినేయాలనిపిస్తుంది. నోట్లో వేసుకోగానే సపోట పండు ఎంతో మధురంగా ఉంటుంది. అందుకే.. సపోట పండును ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. అయితే.. సపోట పండు తియ్యగా ఉంటుందని మాత్రమే తినకండి. ఎందుకంటే.. అందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. సపోటాను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

sapota or chiku health benefits telugu
sapota or chiku health benefits telugu

గర్భిణీలు, బాలింతలు ఎక్కువగా తినాల్సింది సపోటా. సపోటాను గర్భిణీలు, బాలింతలు ఎక్కువగా తీసుకుంటే.. వాళ్లకు కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ఊబకాయం సమస్యతో బాధపడేవాళ్లు కూడా సపోటా పండ్లను తీసుకోవచ్చు. స్థూలకాయానికి కూడా సపోటా చెక్ పెడుతుంది. ఊబకాయంతో బాధపడేవాళ్లు.. సపోటా పండును తింటే.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు కరిగిపోతుంది. దీంతో బరువు తగ్గుతారు.

Sapota : జుట్టు రాలే సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు

చాలామందిని జుట్టు రాలే సమస్య వేధిస్తుంటుంది. అటువంటి వాళ్లు.. సపోటాలను ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యలకు సపోటా చెక్ పెడుతుంది. అలాగే.. సపోటాలో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అందుకే.. సపోటా పండ్లను సీజన్ ను బట్టి మార్కెట్ లోకి రాగానే వెంటనే కొనుక్కొని తినేయండి. సపోటాలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే.. సపోటా పండ్లను తినగానే శరీరానికి ఎనర్జీ వస్తుంది. అందుకే.. నీరసంగా ఉన్నా.. అలసటగా ఉన్నా ఒక్క సపోట పండు తిన్నా చాలు.. వెంటనే లేచి పరిగెత్తుతారు. వెంటనే శరీరానికి శక్తినిచ్చే పండ్లలో సపోటా మొదటి ప్లేస్ లో ఉంటుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 2, 2021 at 10:50 ఉద.