signs to know about diabetes health tips telugu
signs to know about diabetes health tips telugu

Diabetes : షుగర్ వ్యాధి.. దాన్నే డయాబెటిస్ అంటాం మనం. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రపంచమంతా పాకింది. ఎక్కడ చూసినా షుగర్ వ్యాధే. వయసుతో సంబంధం లేకుండా.. ఎక్కువగా చూసినా షుగర్ పేషెంట్లు కనిపిస్తున్నారు. ప్రతి పది మందిలో ఇద్దరు ముగ్గురికి షుగర్ వస్తోంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు షుగర్ వ్యాధికి కారణం అవుతున్నాయి. షుగర్ వ్యాధి వస్తే.. దాని వల్ల భవిష్యత్తులో ఇతర జబ్బులు కూడా వచ్చి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. అసలు షుగర్ వ్యాధి ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి? షుగర్ వ్యాధి సోకిందని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

signs to know about diabetes health tips telugu
signs to know about diabetes health tips telugu

షుగర్ వ్యాధి అంటే ఏంటి అసలు.. రక్తంలో గ్లూకోజ్ లేవల్స్ పెరగడమే షుగర్ వ్యాధి. రక్తంలో గ్లూకోజ్ లేవల్స్ ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండాలి. లేవల్స్ తగ్గినా.. పెరిగినా ప్రమాదకరమే. అప్పుడే షుగర్ వ్యాధి వచ్చింది అని నిర్ధారిస్తారు. షుగర్ ఒక్కసారి వస్తే.. ఇక జీవితాంతం మెడిసిన్ వాడుతుంటారు కొందరు. షుగర్ లేవల్స్ ను ఎప్పుడ కంట్రోల్ లో ఉంచుకోవాలి. దాని కోసం తినే తిండిని కూడా మార్చుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు.

Diabetes : మీలో ఈ లక్షణాలు ఉంటే షుగర్ వ్యాధి వచ్చినట్టే

కొందరికి బాగా దాహం వేస్తుంటుంది. పది నిమిషాలకు ఒకసారి దాహం వేస్తుంటుంది. నీళ్లు తాగుతుంటారు. యూరిన్ కు వెళ్తుంటారు. అప్పుడు వాళ్ల శరీరంలో వాటర్ లేవల్స్ తగ్గుతూ ఉంటాయి. దాని వల్ల.. డీహైడ్రేషన్ సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా యూరిన్ కు వెళ్లేవాళ్లకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. డీహైడ్రేషన్ సమస్య ఉన్నవాళ్లకు నోరు ఎండిపోతుంది. దాని వల్ల నోట్లో ఉమ్మి కూడా రాదు. అప్పుడు నోట్లో బ్యాక్టీరియా ఫామ్ అయి నోరు దుర్వాసన వస్తుంటుంది. అలాగే.. డయాబెటిస్ ఉన్నవాళ్ల ఒంట్లో కీటోన్స్ అనే కెమికల్ విడుదల అవుతుంది. దాని వల్ల కూడా నోటి నుంచి చెడు వాసన వస్తుంది. అలా క్రమం తప్పకుండా నోట్లో నుంచి దుర్వాసన వస్తే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఉన్నట్టుండి మీరు బరువు తగ్గిపోతున్నారా? దానికి కారణం ఏంటంటే.. శరీరానికి కావాల్సినంత శక్తి కోసం శరీరం కండరాల్లో ఉన్న కొవ్వును వాడుకోవడం వల్ల బరువు తగ్గుతుంటారు. ఇది కూడా డయాబెటిస్ కు సంకేతమే. కంటి చూపు తక్కువైనా.. షుగర్ లేవల్స్ పెరిగినట్టే అర్థం చేసుకోవాలి. కళ్లలో ద్రవాలు ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వల్ల.. కంటి చూపు తగ్గుతుంది.

షుగర్ ఉన్నవాళ్లకు ఏదైనా పుండు అయితే చాలు.. అది అస్సలు మానదు. అది మానడానికి చాలా సమయం పడుతుంది. మీకు ఏదైనా పుండు అయి.. అది మానడానికి చాలా సమయం పట్టిందంటే.. మీకు షుగర్ లక్షణాలు ఉన్నాయని తెలుసుకోండి. వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి.

మన శరీరానికి కార్బో హైడ్రేట్స్ కూడా అవసరమే. కానీ.. అవసరానికి మించి ఉంటే అవి కొవ్వు రూపంలో నిలువ ఉంటాయి. ఎక్కువగా కార్బో హైడ్రేట్స్ ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకుంటే చాలా ప్రమాదం. అవి కొవ్వుగా మారడమే కాకుండా.. అవి గ్లూకోజ్ లో కలుస్తాయి. దాని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. దాని వల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే.. కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని నిత్యం తీసుకుంటే.. వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి. పైన చెప్పిన లక్షణాలలో ఏది ఉన్నా వెంటనే షుగర్ టెస్ట్ చేయించుకోండి. ఆలస్యం చేస్తే.. షుగర్ వ్యాధి పెరగడమే కాకుండా.. ఇతర జబ్బులకు కూడా కారణం అవుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 2, 2021 at 7:37 సా.