Stress: ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితం వల్ల మానసిక ఆరోగ్యం ఒక సమస్యగా మారుతుంది. ఒకప్పుడు అంటువ్యాధులు మనుషుల్ని బలితీసుకున్నాయి. ఇప్పుడు మానసిక మనోశారీరక రుగ్మతలు కృంగదీస్తున్నాయి. ఇందులో డిప్రెషన్ అంత్యంత ప్రమాదకారిగా మారుతున్నది. డిప్రెషన్ అనేది ఒక విధమైన మానసిక వ్యాధి.

ఏదో తెలియని బాధ, నిరాశ, ఏ పనీ చేయాలనిపించకపోవటం, నిస్సత్తువ, నిద్రలేమి, ఆకలి మందగించటం, దేనిమీదా ఆసక్తి లేకపోవడం. బరువు విపరీతంగా తగ్గిపోవటం లేదా విపరీతంగా బరువు పెరగటం. తలనొప్పి, జీర్ణసంబంధ వ్యాధులు, చనిపోవాలనే ఆలోచనలు, ఆత్మహత్యా ప్రయత్నాలు చేయటం, సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, భవిష్యత్తులో ఏదో విపరీతమైన మార్పులు సంభవిస్తాయన్న భావన మొదలైనవి దీని లక్షణాలు. సకాలంలో దీనికి సరైన చికిత్స తీసుకోకపోతే తీవ్రంగా మారే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ఇది ఆత్మహత్యకి కూడా దారితీయవచ్చు. దీని లక్షణాలు కొన్ని నెలలు లేదా సంవత్సరాల వరకు ఉండవచ్చు.

1.”స్వీయ అవగాహన”:
జీవితంలోని సంఘటనలను అర్ధంచేసుకోకపోవడం వల్ల, తమపై తాము ఒత్తిడి పెంచుకోవడం వల్ల ప్రజలు సాధారణంగా ఒత్తిడికి గురవుతారు. స్వీయ అవగాహన లోపం వల్ల విపత్కర పరిస్థితులు మనిషిని ఒత్తిడికి గురిచేస్తాయి.
2.”రోజూ వ్యాయామం చేయ౦డి”:
ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం సరైన మార్గం. వ్యాయామం వల్ల సేరోటోనిన్, టెస్టోస్టెరాన్ విడుదల అవడంవల్ల మనసు నిలకడగా ఉండడం, నిరుత్సాహపరిచే ఆలోచనలను పోగొట్టడం జరుగుతాయి.
3.”క్రమ పద్ధతిలో సెలవలు” :
స్థల మార్పు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండడానికి ఎపుడూ సహాయపడుతుంది. జీవితంలో అనుకూలతను తిరిగి తీసుకురావడానికి ఒకరోజు పర్యటనను మించింది ఏదీ లేదు.
4.”సమతుల ఆహరం” :
పండ్లు, కూరగాయలు, మాంసం, చిక్కుళ్ళు, కార్బోహైడ్రేడ్లు వంటి ఆరోగ్యకరమైనవి తీసుకోవడం మనసు చపలత్వాన్ని దూరం చేస్తుంది. సమతుల ఆహరం శారీరక శ్రేయస్సుని పెంపొంది౦చడమే కాకుండా, నిరాశగా ఉన్న మనసుని సాధారణంగా ఉంచుతుంది కూడా.
5.”మంచి స్నేహితులు” :
మంచి స్నేహితులు మీరు మీ జీవితంలో అధిక ఒత్తిడిని ఎదుర్కు౦టున్నపుడు అవసరమైన దయను చూపించడం, వ్యక్తిగత అవహగాహనను ఇవ్వడం వంటి సహాయాలు చేస్తారు. అతేకాకుండా, అవసరమైనపుడు మంచి శ్రోతగా ఉండి, సందేహం, ప్రతికూల సమయాలలో ఎంతో సహాయకారిగా ఉంటాడు.
6.”ఒంటరితనాన్ని దరి చేరనివ్వకండి”:
వ్యాకులతతో ఉన్నపుడు, మిమ్మల్ని మీరు ప్రపంచం నుండి దూరంగా ఉంచుకోవడం సులభం. అలా చేయడం వల్ల, మీరు మెరుగయ్యే అవకాశాలను పోగొట్టుకుంటున్నట్టే. మీ సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోయినా స్నేహితులతో వుంటే కొంతైనా నిరాశా జనకమైన ఆలోచనలకు దూరంగా వుంటారు.
7.”మానసిక వైద్య నిపుణుడితో మాట్లాడండి”:
ఒత్తిడిలోంచి బయటకు రావడానికి అన్నిటికన్నా తేలికైన, ప్రభావవంతమైన మార్గం సైక్రియాటిస్ట్ తో మాట్లాడడం. ఒక మానసిక వైద్యుడితో మాట్లాడడం వల్ల మీ ఒత్తిడికి గల మూల కారణం తెలిసి బాధను తగ్గించుకునే మార్గం దొరుకుతుంది.
8.”బాగా నిద్రపోండి” :
అనుకూల ఆలోచనలు తిరిగి మొదలు అవడానికి ప్రతివారికీ మంచినిద్ర అవసరం. ప్రతిరోజూ 7-8 గంటలు నిద్రపోయే వారిలో ఒత్తిడి సూచనలు తక్కువగా ఉంటాయని అధ్యయనాల వల్ల తెలుస్తుంది.
సంగీతం వినిడం, మంచి పుస్తకాలు చదవడం వంటివి కూడా డిప్రెషన్‌ నుంచి మనల్ని బయటపడేస్తాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 6, 2021 at 12:25 ఉద.