Skin Care : బాదం పప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే బాదం నూనె వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.ప్రతి రోజు బాదం నూనె వాడడం వల్ల చర్మం మరియు జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.బాదం నూనె చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది.ఇప్పుడు మనం చర్మం మరియు జుట్టుకు బాదం నూనె వల్ల యొక్క ఉపయోగాల గురించి తెలసుకుందాం.

  • బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మంపై ముడతలను తొలగించడం లో తోడ్పడుతుంది. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి రాసుకోవడం వల్ల మొఖం పై ముడతలు తగ్గుముఖం పడతాయి.
  • బాదం నూనెలో ఉండే ఆమ్లాలు చర్మంపై ఉన్న అదనపు నూనెను తగ్గించడంలో తోడ్పడుతాయి. నూనెలో ఉండే రెటినాయిడ్స్ మొటిమలను తగ్గిస్తాయి.
  • బాదం నూనెలో ఉండే విటమిన్ ఇ, సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తుంది.
  • బాదంనూనె కళ్ల కింద నల్లటి వలయాలను , కళ్ల కింద ఉబ్బడం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ కళ్ల కింద బాదం నూనె తో మర్దన చేయడం వల్ల నల్లటి వలయాలు తొలగిపోతాయి.
  • బాదం నూనె లో ఉండే విటమిన్ ఇ మొఖంపై ఉండే మచ్చలను తొలగించడంతో పాత మృదువుగా మార్చడం లో సహాయపడుతుంది.
  • చర్మం పొడిగా ఉండేవాళ్లు రోజు బాదం నూనె ను ముఖానికి రాసుకోవడం వల్ల పొడితనం పోయి చర్మానికి సరైన తేమ లభిస్తుంది. అంతే కాకుండా చర్మం కాంతివంతంగా కూడా మారుతుంది.
  • శీతాకాలంలో కుదుళ్లు వద్ద చర్మం పొడిగా మారడం వల్ల జుట్టులో చుండ్రు రావడం జరుగుతుంది. చుండ్రు సమస్య ఒక్కసారి వచ్చిందంటే వదిలి వెళ్ళడం కష్టం. బాదం నూనె చుండ్రును నివారించడంలో ఎంత గానో ఉపయోగపడుతుంది.వారానికి ఒక్కసారి బాదం నూనె తలకి మర్దన చెయ్యడం ద్వారా చుండ్రు సమస్య తగ్గు మొఖం పట్టడంతో పాటు జుట్టు బలంగా మారుతుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 17, 2022 at 10:37 ఉద.