sugacane juice health benefits in summer
sugacane juice health benefits in summer

Sugarcane Juice : చెరుకు జ్యూస్ అంటే ఇష్టం లేనివాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి. పిల్లలయితే ఎంతో ఇష్టంతో చెరుకు రసాన్ని తాగేస్తారు. తియ్యగా ఉంటుంది కాబట్టి… చెరుకు రసం అందరికీ ఇష్టమే. అందులోనూ వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా చెరుకు బండ్లు కనిపిస్తుంటాయి. చెరుకు బండిని చూడగానే ఇక మనసు ఆగదు. అసలే ఎండాకాలం.. ఆ వేడిని తట్టుకోలేక…. చెరుకు బండి దగ్గరికి వెళ్లి లటక్కున ఓ గ్లాస్ చెరుకు రసం తాగేస్తాం. అప్పుడు కానీ కడుపులో కాస్త చల్లగా ఉండదు. చెరుకు రసంలో ఉన్న గొప్పదనం ఏంటంటే.. ఎంత తాగినా… ఇంకా తాగాలనే అనిపిస్తుంది. ఎండ వేడి వల్ల బాగా దాహం వేసినా… వేసవి తాపాన్ని తీర్చుకోవాలన్నా… వడదెబ్బ నుంచి బయటపడాలన్నా చాలామంది చెరుకురసాన్నే తాగేస్తుంటారు. అదంతా ఓకే కానీ.. అసలు చెరుకు రసాన్ని తాగొచ్చా? అది ఎండాకాలంలో? తాగితే ఏమౌతుంది… అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

sugacane juice health benefits in summer
sugacane juice health benefits in summer

మీకు ఒక విషయం తెలుసో… తెలియదో కానీ… చెరుకు రసం ఉత్త రసం ఏమీ కాదు. చెరుకులో ఉండే పోషకాలు మరే దాంట్లో ఉండవు. అసలు చెరుకు రసం అనేది జీరో కొలెస్టరాల్. అస్సలే కొలెస్టరాల్ ఉండదు. కాబట్టి ఎంత తాగినా శక్తి వస్తుంది.. పోషకాలు అందుతాయి తప్పితే.. తియ్యగా ఉన్నంత మాత్రాన చెరుకు రసం తాగడం వల్ల ఎటువంటి సమస్యలు రావు. షుగర్ అంతకన్నా రాదు. ఇది నూటికి నూరు శాతం స్వచ్ఛమైన, సహజసిద్ధమైన డ్రింక్. కాబట్టి.. వేసవితో దీన్ని తాగితే వచ్చే నష్టాలు ఏమీ లేవు. కానీ లాభాలు మాత్రం బోలెడు ఉన్నాయి.

Sugarcane Juice : వడదెబ్బ, డీహైడ్రేషన్ సమస్యకు చెరుకు రసం ద్వారా చెక్

చాలామంది ఎండాకాలంలో బయట అడుగుపెడితే చాలు… వడదెబ్బ తగులుతుందేమోనని భయపడుతుంటారు. డీహైడ్రేషన్ సమస్య వస్తుందని ఆందోళన చెందుతుంటారు. అటువంటి వాళ్లు.. ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే చాలు.. వడ దెబ్బ తగలదు. డీహైడ్రేషన్ సమస్యా రాదు. చెరుకు రసంలో చాలా మినరల్స్ ఉంటాయి. ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగితే… సుమారు 250 క్యాలరీల శక్తి లభిస్తుంది. అంటే.. ఎండ వల్ల నీరసం వచ్చినా.. చేతగాకపోయినా ఒక్క గ్లాస్ చెరుకు రసం తాగారంటే… వెంటనే లేచి పరిగెడతారు.

ఎండ వేడిని తట్టుకోవడంతో పాటు… చెరుకు రసంలో ఉండే కాల్షియం, పాస్ఫరస్ వల్ల దంతాలకు ఎంతో ఉపయోగం ఉంటుంది. దంతాలు గట్టిగా తయారవుతాయి. అలాగే.. చెరుకు రసంలో ఉండే ఫ్లేవనాయిడ్స్ వల్ల క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు. చెరుకు రసం వల్ల జీర్ణ సంబంధ వ్యాధులు కూడా నయం అవుతాయి. చెరుకు రసంలో ఉంటే ఆల్కలైన్ పవర్.. శరీరంలోని యాసిడ్ లేవల్స్ ను తగ్గిస్తుంది. దీని వల్ల.. చాలా రోగాలు నయమవుతాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 10, 2021 at 4:32 సా.