Summer Tips : మండు వేసవికి చల్లని చిట్కాలు…!

S R

Summer Tips చిన్నప్పుడు అందరికి వేసవికాలం అంటే చాలా ఇష్టం ఉంటుంది . ఎందుకంటే ఒంటిపూట బళ్ళు, మామిడి పళ్ళు, వేసవి సెలవులు, వచ్చేది అప్పుడే కాబట్టి. కానీ నచ్చని ఒకే ఒక్క విషయం వేడి. ఏప్రిల్ మరియు మే నెలలో ఆ వేడి దాటిని భరించాలంటే చాలా కష్టం. అతి తీవ్రమైన ఎండ వల్ల ఎండ దెబ్బ తగులుతుంది. మన శరీరంలో 80% నీళ్ల శాతం ఉంటుంది, వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువ వల్ల మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది, దీనినే డీహైడ్రేషన్ అని కూడా అంటారు. డీహైడ్రేషన్ వల్ల మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అంటే షుగర్ లెవెల్స్ పడిపోవడం జరుగుతుంది. అలా జరగడం వల్ల కళ్ళు తిరిగినట్టు, నోరు తడి ఆరి పోయినట్లు , చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో ఏదైనా వేడిగా తినే దాని కంటే చల్లగా ఏదైనా తాగాలని అనిపిస్తుంది. ఈ వేసవి కాలంలో ఈ ఎండ దెబ్బ నుంచి మరియు అధికమైన వేడి నుంచి  మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే,కొన్ని చిట్కాలు పాటిస్తే ఎంతో ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా,ఉత్సాహంగా కూడా మన శరీరాన్ని ఉంచుకోవచ్చు.

Best Summer Tips వేసవికాలంలో వేడి నుంచి ఇలా ఉపశమనం పొందవచ్చు….

మంచినీరు

ఇది ఒక్క అద్భుతమైన చిట్కా ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ల బరువును బట్టి, ఒక్క  కేజీకి  70ml వరకు నీటిని తాగ వలసిన అవసరం ఉంటుంది. ఇలా తాగడం వల్ల మనం శారీరకంగా చాలా లాభాలు పొందుతాం, అప్పుడు మన శరీరం ఎంత వేడినైనా తట్టుకోగలదు. అంతే కాదు అధిక బరువు ఉన్నవాళ్లు కూడా బరువు తగ్గే అవకాశం ఉంది. దీనినే వాటర్ థెరపీ అనికూడా అంటారు. ప్రతిసారి ఉట్టి నీళ్లు తాగాలంటే మనకు  అంత బాగా అనిపించకపోవచ్చు అందుకే మనం కొన్ని వేసవి కాలం పానీయాల గురించి తెలుసుకుందాం.

మజ్జిగ

మనం ఈ వేసవికాలంలో టీ, కాఫీ, కి బదులు మజ్జిగా తరచుగా తీసుకుంటే మన శరీరంలో వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.    పుచ్చకాయ, కమలా పండు, చెరుకు  రసం, కర్బూజా రసం,నిమ్మకాయ రసం ఇవన్నీ నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లు.. ఇలాంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల వేడిని తట్టుకోగల పోషకాలన్నీ మనకు ఈ పండ్ల  వల్ల దొరుకుతాయి. అంతేకాకుండా ఇలాంటి రసాలను పడి గడుపుకునే తాగితే మంచి డీటాక్సిఫై డ్రింక్స్ లాగా పనిచేస్తాయి, చర్మకాంతిని పెంచడానికి కూడా ఈ పండ్ల రసాలు చాలా బాగా ఉపయోగపడతాయి.

రాగి జావా

ఈ రాగి జావా ని పాలతో కానీ మజ్జిగ తో కానీ ఎలాగైనా తీసుకోవచ్చు, రాగి పిండిలో జీడిపప్పు,బాదం పప్పు, పిస్తాలు, కొన్ని యాలుకలు అన్నీ వేయించుకుని పొడి చేసుకొని రాగి పిండిలో కలుపుకోవాలి దీనిలో బెల్లం కూడా పొడి చేసి వేసుకోవచ్చు లేదా మాల్ట్ చేసేటప్పుడు తీపి కోసం ఖర్జూర కూడా వేసుకోవచ్చు, ఇలా తీసుకోవడం వల్ల అన్ని పోషక ఆహారాలు మనం పొందగలము. ముఖ్యంగా కాల్షియం ని ఈ మాల్ట్ తాగడం వల్ల మనం పొందుతాము. మన పళ్ళు, ఎముకలు బలంగా ఉండటానికి చాలా అవసరం. పిల్లలు పుట్టాక ఆడవారికి క్యాల్షియం, ఐరన్ బాగా తగ్గిపోతాయి. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈ మాల్ట్ తాగడం వల్ల చాలా మెరుగు పొందుతారు. అంతేకాకుండా వేసవికాలంలో ఈ రాగి జావ తాగడం వల్ల శరీర అవయవాలు అన్నిటికీ చల్లని ఉపశమనం లభిస్తుంది.

చల్లని నీటి స్నానం వల్ల కూడా శరీరానికి వేడి తగ్గి ఇంకా ఒంటిలో అవయవాలన్నీ చురుగ్గా పనిచేస్తాయి. ఎక్కువ శాతం కుండ నీళ్లు తాగటానికి ప్రయత్నించాలి. కూల్ డ్రింక్స్ లాంటి కలర్ డ్రింక్స్ ని తీసుకోకపోవడమే ఉత్తమం.

చాలా మసాలా ఉన్న పదార్థాలు కాకుండా కడుపు త్వరగా ఆరగించే నిరు కాయలు అయిన కూరగాయలను అనగా సొరకాయ, బీరకాయ , దోసకాయ, వంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. దోసకాయ ఎక్కువగా తినడం వల్ల శరీరాన్ని తొందరగా చల్లబరుస్తుంది. ఇలా సులభంగా అరిగె ఈ పదార్థాలు తినడం వల్ల కూడా ఈ వేసవికాలంలో చాలా ఊరటనిస్తుంది.

పండ్లను

కూరగాయలను ఉడికించినవి కాకుండా  జ్యూస్ రూపంలో తీసుకుంటే మరి ఎన్నో ఎక్కువ పోషక ఆహారాలను  మన శరీరం పొందుతుంది. ఒక వారంలో ఐదు రోజులు రోజుకి ఒక గంట చొప్పున వ్యాయామం కానీ, యోగా కాని చేస్తే శరీరానికి మరియు మెదడు కి  చాలా ప్రశాంతత దొరుకుతుంది. ఇలా చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఆహార వ్యవహారాలను సరిచేసుకుంటూ ఈ వేసవి కాలం వేడిని తరిమేయగలము.

చిట్టచివరిగా ఒక ఇన్స్టాంట్ చిట్కా చాలా వేడిగా చికాకుగా అని అనిపిస్తే, ఒక గిన్నెలో ఐస్ గడ్డలు, చల్లని నీళ్లు వేసి దానిలో మన ముఖాన్ని 30 నుండి 60 సెకండ్లు పెడితే తొందరగా వేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది, కాళ్లను కూడా చల్లని నీటిలో ఉంచి ఒక ఐదు నిమిషాలు వరకు పెడితే ఎండ వల్ల కలిగే బెడద మొత్తం తగ్గిపోయి మనస్సు, శరీరం రెండు ప్రశాంతంగా ఉంటాయి.

- Advertisement -