Tips For Oily Skin : జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా…! ఈ 7 ఫేస్ ప్యాక్ లతో జిడ్డు చార్మానికి చెక్ పెట్టండి…

S R

Tips For Oily Skin  : ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య ఆయిల్ స్కిన్. ఇది చూడటానికి చాలా చిన్న సమస్య అనిపించినా చాలా చిరాకు తెప్పించే సమస్య. ఆయిల్ స్కిన్ సమస్య వల్ల అదనంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇతర చర్మ సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. స్నానం చేసిన, ముఖం కడుక్కున్న వెంటనే ముఖం మీద వెంటనే జిడ్డు కారి చిరాకు తెప్పిస్తుంది. కొంతమందిలో ఈ ఆయిల్ స్కిన్ సమస్యను ఎదుర్కోవడానికి ప్రధాన కారణం సెబమ్ గ్లాండ్. ఇంగ్లాండ్ ప్రతి ఒక్కరిలోనూ తగినంత ఆయిల్ ని విడుదల చేసి చర్మాన్ని మృదువుగా, మాయిశ్చర్‌గా ఉండేలా చేస్తుంది. కానీ కొంత మందిలో ఈ సెబమ్ గ్లాండ్ అధికంగా ఆయిల్ ను ఉత్పత్తి చేయడం వలన ఆయిల్ స్కిన్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

ముఖ్యంగా వేసవిలో ఆయిల్ స్కిన్ సమస్య తో బాధపడుతున్నవారు ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొనవలసి ఉంటుంది. ఈ సమస్య కలిగినవారు వేసవిలో ఎంత జాగ్రత్తలు తీసుకున్న వెంటనే వృధా అవుతుంది. చాలామంది ఈ సమస్య నుంచి బయటపడటానికి రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ ను ట్రై చేయడం, సెలూన్ లకు వెళ్ళడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల మన సమయం డబ్బు వృధా చేసుకోవడం తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. ఈ సమస్యను ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలతో సులువుగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే సమస్య కు చెక్ పెట్టొచ్చు.

Tips For Oily Skin ఆయిల్ స్కిన్ ను నివారించే ఫేస్ ప్యాక్ లు…

ఆయిల్ స్కిన్ నివారించడానికి మరీ ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య నుంచి బయట పడటానికి మన ఇంట్లోనే చాలా పదార్థాలు మనకు ఉపయోగపడతాయి. అయితే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఇంట్లోనే చర్మానికి తగిన ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు. జుట్టు చర్మం కలవారు మరీ ముఖ్యంగా టీ -జోన్ ఏరియా లో జిడ్డు సమస్యతో బాధపడేవారు ఈ ఫేస్ ప్యాక్ లను వల్ల ఈ సమస్యలకు నివారించవచ్చు.అలోవెరా, దోసకాయ, పెరుగు, తేనె, గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం, పుదీనా, యాపిల్, ఓట్ మీల్, బేకింగ్ సోడా, కాఫీ, అరటిపండు మరియు నీరు ఇవన్నీ మన వంటింట్లో దొరికే పదార్థాలే, ఈ పదార్థాలలో కనీసం రెండు మూడు పదార్ధాలు ఉన్న మనం ఇంట్లోనే జిడ్డు చర్మ(టి -జోన్ )నివారణకు కావలసిన ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు.

ఆపిల్ మరియు తేనె

సగం సుబ్రమణ్యం ఆపిల్ పండును తీసుకొని విత్తనాల ని తొలగించిన తర్వాత పేస్ట్లా చేసుకుని దానికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం అంతా సమానంగా పట్టించి పది నుంచి పదిహేను నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి తో మొదలు పెట్టి, నిదానంగా రెండు నుంచి మూడుసార్లు పెంచుకోవచ్చు. ఇలా చేయడం వలన ఆయిల్ స్కిన్ సమస్య కాస్త నివారించవచ్చు.

ఓట్ మీల్ మరియు వెచ్చని నీరు

ఓట్ మీల్ అధిక ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. , ఇది చర్మం మీది మృత కణాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఫలితంగా, మీ చర్మం కాంతివంతంగా మరియు మృదువుగా కనిపిస్తుంది. ఈ ప్యాక్ కోసం గోరువెచ్చని నీటిలో అర కప్పు ఓట్ మీల్ వేసి కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమంతో మీ ముఖానికి సుమారు మూడు నిమిషాలు మసాజ్ చేయండి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.

అలోవెరా, దోసకాయ, పెరుగు మరియు తేనె

అలోవెరా జెల్, దోసకాయ, టేబుల్ స్పూన్ పెరుగు ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన ముఖానికి ఈ ప్యాక్ ను అప్లై చేసి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకోవచ్చ. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ను ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు వేసుకోవచ్చు. అయితే అధిక జిడ్డు చర్మం కలిగిన వారు మాత్రం అలోవేరా ఇంకా తేనె మిశ్రమాన్ని మాత్రం ప్రయత్నించాలి.

బేకింగ్ సోడా మరియు నీరు

ఒక టేబుల్‌స్పూన్ బేకింగ్ సోడాను రెండు లేదా మూడు టేబుల్‌స్పూన్‌ల నీళ్లతో కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత కడిగేయండి. బేకింగ్ సోడా మీ చర్మాన్ని చికాకుపెడితే మరియు పొడిబారినట్లయితే, నెమ్మదిగా ప్రారంభించండి మరియు అవసరమైతే పెంచాలి . ఇలా వారానికి మూడు సార్లు చేయాలి., ప్రతి సెషన్ మధ్య ఒక రోజు సెలవు తీసుకుంటే బాగుంటుంది.

దోసకాయ, ఎగ్ వైట్, నిమ్మరసం మరియు పుదీనా

ఈ ప్యాక్ కోసం సగం దోసకాయ, ఒక గుడ్డులోని తెల్లసొన, ఒక టీస్పూన్ నిమ్మరసం మరియు తాజాగా తరిగిన పుదీనా ను తీసుకొని పేస్ట్ లా చేసుకోవాలి.మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి, 20 నిమిషాల వరకు విశ్రాంతి తీసుకోండి. గోరువెచ్చని నీటితో కడిగి, ఆపై చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి తో మొదలు పెట్టి మెల్లగా మీ చర్మానికి అనుగునంగా వారానికి మూడు సార్లు పెంచుకోవచ్చు.

తేనె మరియు కాఫీ

దీనికోసం ఒక టేబుల్ స్పూన్ కాఫీని ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి స్క్రబ్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించి వృత్తాకార దశలో రెండు నుంచి మూడు నిమిషాల పాటు సున్నితంగా మర్దన చేసుకోవాలి. తర్వాత ముఖం మీద ఆరిపోయే వరకూ వదిలిపెట్టి గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీనిని మనం ప్రతి రోజూ ఉపయోగించవచ్చు దీని వలన చర్మం సున్నితంగా తయారవుతుంది.

అరటి మరియు తేనె

ఒక పండిన అరటిపండును తీసుకొని దానికి రెండు టీస్పూన్ల తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ని ముఖం పై అప్లై చేయాలి. 10 నుంచి 15 నిమిషాలు తర్వాత ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. మీ చర్మం జుట్టు తత్వాన్ని బట్టి వారానికి రెండు లేదా మూడు సార్లు దీన్ని ట్రై చేయవచ్చు.

ఇవే కాకుండా జిడ్డు చర్మాన్ని తగ్గించుకోవడానికి తేనె మరియు నిమ్మరసం విడివిడిగా కూడా మన ముఖం మీద పట్టించి 10 నుంచి 15 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకున్న ఫలితం కనిపిస్తుంది.

- Advertisement -