Weight Loss Foods : అధిక బరువు,ఊబకాయం చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యలు.ఊబకాయం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు సరైన ఆహారం తీసుకోవడం వల్ల శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.మీ ఆహారంలో ఈ ఆహారాలను జోడించడం వల్ల కాలక్రమేణా కొవ్వును తగ్గించడానికి మీకు సహాయపడుతుందని నిపుణుల అభిప్రాయం

కోడి గుడ్లు

ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్లు బరువు తగ్గడంలో ఎంతో సాయపడతాయి. అల్పాహారంలో గుడ్లను తీసుకోవడం వల్ల ప్రొటీన్ ఎక్కువగా లభిస్తుంది. గుడ్డులో తక్కువ కేలరీలు ఉండడం వలన బరువు పెరగకుండా ఉంటారు.

పిస్తా

అతి తక్కువ క్యాలరీలు శాతం ఉన్న ఆహారాలలో పిస్తా ఒకటి. అందువల్ల శరీర బరువును నియంత్రణలో ఉంచడంలో పిస్తా ఎంతగానో సహాయపడుతుంది. రోజుకి గుప్పెడు పిస్తా లు తినడం వల్ల శరీర బలం పెరగడం తో పాటు , బరువు నియంత్రణలో ఉంటుంది.

ఆకుకూరలు

ఆకుకూరల్లో కేలరీలు పీచు పదార్థాలు తక్కువగా ఉంటాయి. మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నట్లు అయితే ఆకుకూరలను తప్పకుండా మీ ఆహారంలో చేర్చాలి.

చేపలు

గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరచడంతో పాటు, చేపలలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీర కొవ్వును తగ్గించడానికి సహాయపడవచ్చు. వారానికి కనీసం ఒక్కసారైనా చేపలు తీసుకోవడం వల్ల ఫలితాలు ఉంటాయి.

డార్క్ చాక్లెట్

చాక్లెట్ అనేది సాధారణంగా ఆరోగ్యానికి మంచిది కాదు , కానీ బరువు తగ్గడం లో డార్క్ చాక్లెట్ బాగా సహాయపడుతుంది.70 శాతం కాకో కంటెంట్ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న డార్క్ చాక్లెట్ ను తినండి. అది కూడా రోజుకు రెండు ముక్కల కు మించి. తినకూడదు.

గమనిక : పైన పేర్కొన్న వివరాలు కేవలం పాఠకులలో అవగాహన పెంచడానికి మాత్రమే. వైద్య సంబంధిత సమస్యలపై మరియు ఆరోగ్యం పై ఖచ్చితమైన సమాచారం కొరకు వైద్యులను సంప్రదించండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 19, 2022 at 2:36 సా.