what are the symptoms of corona second wave
what are the symptoms of corona second wave

Corona Second Wave : కరోనా వైరస్… గత సంవత్సరం నుంచి ఈ కరోనా వైరస్ తో కలిసి మనం జీవిస్తున్నాం. పొద్దున లేస్తే కరోనా వైరస్.. రాత్రి నిద్రపోతే కరోనా వైరస్.. బయటికి వెళ్తే కరోనా వైరస్. నిజంగా కరోనా వైరస్ మన జీవితంలో ఇంత ముఖ్య పాత్ర పోషిస్తుందని మనం ఎప్పుడూ కలలో కూడా ఊహించి ఉండం. రెండు మూడు నెలల కింద అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారో లేదో… అంతే వెంటనే కరోనా సెకండ్ వేవ్ అంటూ మళ్లీ దూసుకువచ్చింది. గత సంవత్సరం కరోనా నుంచి తప్పించుకున్న వాళ్లందరిపై ఇప్పుడు తన ప్రతాపం చూపిస్తోంది కరోనా సెకండ్ వేవ్.

what are the symptoms of corona second wave
what are the symptoms of corona second wave

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా సెకండ్ వేవ్. అసలు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరికే పరిస్థితి లేదు. ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్ దొరికినా… లక్షలు కట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి. కరోనా సెకండ్ వేవ్ తో రోజూ వేల సంఖ్యలో దేశ వ్యాప్తంగా కేసులు ఎక్కువవుతున్నాయి. రాబోయే మరో నెల రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని… మాస్కులు విధిగా దరించాలని… అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. అయితే… చాలా మందికి కరోనా లక్షణాలు తెలుసు.. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కరోనాను ఎదుర్కొన్నాం కాబట్టి.. కానీ.. కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు ఏంటి? అనేది చాలామందికి తెలియదు. కరోనా వైరస్ కొన్ని మార్పులు చెంది.. దాన్నే మ్యుటేషన్ అంటారు.. అంటే దానికదే మార్పులు చెంది కొత్త రకం వైరస్ లా మళ్లీ పుట్టుకొచ్చిందన్నమాట. దాన్నే మనం కరోనా సెకండ్ వేవ్ అంటున్నాం.

Corona Second Wave : వైరస్ బారిన పడుతున్న యువత

మరి.. ఈ కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు ఏంటి? ఈ వైరస్ శరీరంలో ప్రవేశిస్తే… ఎటువంటి లక్షణాలు బయటపడతాయి. అయితే.. ఈసారి నమోదవుతున్న కరోనా కేసులు చూస్తే.. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన లక్షణాలు వెలుగు చూస్తున్నాయట. కొత్తగా మార్పులు చెందిన ఈ వైరస్ ఎక్కువగా లంగ్స్ మీద దాడి చేస్తోందట. అలాగే పొత్తి కడుపులో నొప్పి రావడం, వాంతులు అవడం, వికారంగా అనిపించడం లాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఊపిరితిత్తులపై ప్రభావం చూపించడంతో పాటు.. శ్వాసకు సంబంధించిన సమస్యలను ఈ కొత్త మ్యుటేషన్ వైరస్ సృష్టిస్తోంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా వస్తున్నట్టు డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

అయితే… గత సంవత్సరం కరోనా వచ్చినప్పుడు యూత్ తప్పించుకోగలిగారు. కరోనా వైరస్ యూత్ పై ఎక్కువగా అంత ప్రభావం చూపించలేదు. ఒకవేళ యూత్ కు కరోనా సోకినా.. వాళ్లు దాన్ని తట్టుకోగలిగారు. కానీ… కరోనా సెకండ్ వేవ్ మాత్రం యూత్ పైనే ఎక్కువ ప్రభావం చూపిస్తోందట. ఇప్పుడు వస్తున్న కేసులను చూస్తే… ఎక్కువ శాతం యూతే కరోనా సెకండ్ వేవ్ బారిన పడుతున్నారట.

ప్రస్తుతం కరోనా వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ… కొత్త మ్యుటేషన్ వైరస్ పై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతోంది. అందుకే… కరోనా సెకండ్ వేవ్ విషయంలో యూత్ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటూ ఆరోగ్య  నిపుణులు సూచిస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 9, 2021 at 3:31 సా.