Asthma Patient: అలసే ఆస్తమాతో ఊపిరాడకుండా ఇబ్బంది పడుతున్నవారికి ప్రస్తుతం కరోనా కలవరం పట్టిపీడిస్తుంది. సాధారణంగా మనం ఊపిరి పీల్చకుండా ఎంత సేపు ఉండగలం? మహా అంటే ఓ నిమిషం. అలాంటిది… ఆస్తమా బాధితులు… ప్రతి నిమిషం ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఒక్కోసారి… నరాలన్నీ పట్టేసినట్లు అయిపోయి… ప్రాణం పోతోందా అనేంతలా ఇబ్బంది తలెత్తుతుంది. ఊపిరితిత్తుల్లో ఏర్పడే ప్రమాదకరమైన అనారోగ్య సమస్య ఆస్తమా. ప్రపంచప్యాప్తంగా దాదాపు 2 కోట్ల మందికి ఇది ఉంది. కాగా ఇప్పుడు వారికి కరోనా భయం చుట్టిముట్టింది. అసలు ఆస్తమా పేషంట్లకు కరోనా సోకితే ఏమైవుతుంది. ఎంతశాతం మంది కరోనా బారిన పడుతున్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందామా?

ఇదివరకే ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిపై కరోనా మరింత ప్రభావం చూపిస్తోంది. ఈ సమయంలో ఆస్తమా రోగులు కరోనా వైరస్‌ బారినపడే అవకాశాలు తక్కువేనని తాజా అధ్యయనం పేర్కొంది. తాజాగా ది జర్నల్‌ ఆఫ్‌ అలెర్జీ, క్లినికల్‌ ఇమ్యూనాలజీలో తాజా పరిశోధన పత్రం ప్రచురితమైంది. అయితే అమెరికాలో జరిగిన మరో పరిశోధన ఇలాంటి ఫలితాన్నే ప్రకటించింది. ఆస్తమా లేని కరోనా రోగులతో పోలిస్తే, ఆస్తమా ఉన్న వారిలో వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. వీరికి ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించే అవసరం కూడా రాలేదని పేర్కొంది. అంతేకాకుండా కరోనా వల్ల చనిపోయే ప్రమాదం కూడా ఆస్తమా రోగుల్లో తక్కువేనని స్పష్టంచేసింది. బోస్టన్‌ హెల్త్‌కేర్‌ సిస్టమ్‌కు చెందిన పరిశోధకులు ఆస్తమా రోగులపై జరిపిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది.

ఇన్‌హెలర్ల పాత్ర ఎంత?
ముఖ్యంగా ఆస్తమా రోగులు వాడే ఇన్‌హెలర్లు కూడా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించడం లేదా వైరస్‌ బారిన పడకుండా కాపాడుతున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
ఇన్‌హేలర్స్‌ మానొద్దు?
ఆస్తమా చికిత్సలో భాగంగా వాడుతున్న ఇన్‌హేలర్ల వినియోగాన్ని రోగులు ఆపొద్దు. వీటిని ఆపేసి ఆందోళనలతో ఆసుపత్రులకు వెళ్లి స్టెరాయిడ్స్‌ డోస్‌ పెంచడం వల్ల సమస్యలు ఎదురుకావొచ్చు.
టెలి మెడిసిన్‌కు ప్రాధాన్యతనివ్వాలి…?
ప్రస్తుత పరిస్థితుల్లో వీడియో, టెలి మెడిసిన్‌ కన్సల్టేషన్‌ ద్వారా మందులు తీసుకోవడం మంచిది. ఆసుపత్రులకు వెళ్లడం వల్ల ఇతర సమస్యలు తలెత్తే అవకాశముంది. ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం సంబంధిత డాక్టర్‌ని నేరుగా కలవాలి. తమకు తాము ఇన్‌హేలర్‌ డోస్‌ తగ్గించుకోవడం సరికాదు. ఆస్తమా రోగులు అక్యూట్‌ అటాక్‌ రాకుండా జాగ్రత్త పడాలి.
అలర్జీలతో జాగ్రత్త పడాలి…?
ప్రస్తుత సమయంలో ఆస్తమా రోగులు అలర్జీల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. కార్పెట్‌తో వచ్చే అలర్జీలు, దుమ్ము, కొన్నిరకాల ఫాబ్రిక్స్, వాసనలు, వృత్తిరీత్యా వచ్చేసమస్యలతో అలర్జీలు వస్తాయి. అలర్జెక్‌ రునటిక్స్‌ ఉంటే తుమ్ములు, జలుబు వంటివి వస్తాయి. ప్రాణాయామం చేయగలిగితే మంచి ఫలితాలుంటాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 19, 2021 at 8:39 సా.