Yawning: సాధారణంగా ఏ వ్యక్తికైనా ఆవలింపులు రావడం సర్వసాధారణమే. సాధారణంగా ఒక వ్యక్తి ఎంతో అలసిపోయినప్పుడు, తన శరీరానికి విశ్రాంతి కావాలనే సంకేతాన్ని ఆవలింపు రూపంలో మనిషికి తెలియజేస్తుంది. అయితే నిద్రపోతున్న సమయంలో కూడా ఆవలింపులు వస్తే అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఆవలింపు ఎక్కువగా వస్తే గుండె సమస్యల బారిన పడతారని నిపుణులు తెలియజేస్తున్నారు.

సాధారణంగా ఒక వ్యక్తికి గుండె సమస్యలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. వారి ఆహార విషయంలో కానీ, అధిక శరీర బరువు పెరగడం వల్ల, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా తరచూ చాతిలో నొప్పి రావడం సర్వసాధారణం. అయితే ఈ లక్షణాలలో ఆవలింపు కూడా ఒకటి. ఒక వ్యక్తికి ఎక్కువగా ఆవులింతలు వస్తున్నాయంటే అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మన శరీరంలో మెదడు నుంచి ఉదరం వరకు వేగస్ నాడి ఉంటుంది. మనం తరచూ ఆవలించడం వల్ల ఆ ప్రభావం వేగస్ నాడిపై పడుతుంది. ఆ సమయంలో గుండె చుట్టూ రక్తప్రవాహం అధికంగా ఉంటే ఛాతిలో నొప్పి కలిగి హార్ట్ స్ట్రోక్ రావడానికి ఆవులింత కారణమవుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఎక్కువగా ఆవలింతలు స్ట్రోక్‌కి ముందు లేదా తరువాత జరగవచ్చని తెలిపాయి. దానితో పాటు ఇతర లక్షణాలైన తిమ్మిరి, బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది వంటివి కూడా వస్తాయన్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాయామం చేసేటప్పుడు, ముఖ్యంగా వేడి రోజులలో ఎక్కువగా ఆవలింతలు వస్తే గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. గుండెపోటు వచ్చినప్పుడు గుండెకు రక్త ప్రవాహం నిరోధించబడుతుంది. ఇది ఆక్సిజన్ రవాణాలో అంతరాయం కలిగిస్తుంది. అలాంటప్పుడు మనిషి అక్కడిక్కడే కుప్పకూలిపోతాడు.

ఆవలింపు ఎంత సమయం ఉంటుంది..?

సగటున ఒక్కో ఆవలింత 6 సెకన్ల వరకూ ఉంటుందని నిపుణులు అంటున్నారు. సగటున మనిషి జీవిత కాలంలో 400 గంటలు ఆవలించడానికి ఉపయోగిస్తాడు. ఇది జోక్ కాదు సుమా.

గర్భస్త దశ నుంచే..

11 వారాల వయసున్న గర్భస్థ శిశువు కూడా ఆవలిస్తుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే మనం గర్భంలోంచి బయటకి రాక మునుపే ఆవలించామన్నమాట. అసలు ఆవలింత మానవ జీవితంలో ఒక విడదీయరాని భాగం కదా.

మితిమీరిన ఆవలింతల వల్ల అనేక రోగాలు…

ఆవలింత గుండెపోటు లేదా స్ట్రోక్‌తో మాత్రమే సంబంధం కలిగి ఉండదు. అనేక ఇతర ఆరోగ్య పరిస్థితులకు కూడా కారణమవుతాయి. బ్రెయిన్ ట్యూమర్, మూర్ఛ, మల్టిపుల్ స్క్లేరోసిస్, కాలేయ వైఫల్యానికి కూడా ఆవలింత కారణం అవుతుంది. శరీరం దాని ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోతుంది. ఇంతకు ముందుకంటే ఆవలింతలు అధికంగా రావడం మీరు గమనించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 15, 2021 at 11:22 సా.