Yoga For Fat Burning పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు లక్ష్యంగా చేసుకుంటూ, కొన్ని యోగా ఆసనాలు కేలరీలను బర్న్ చేయడానికి, కండరాల బలాన్ని పెంచడానికి మరియు జీవక్రియను పెంచడానికి ఉపయోగపడుతాయి. వయస్సు, వంశపారంపర్యత, జీవనశైలి, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం మరియు ఒత్తిడి వంటివి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోపోడానికి దోహదం చేస్తాయి. ఇది మీ శరీరం గురించి మీకు అభద్రతా భావాన్ని కలిగించడం ద్వారా మరింత ఒత్తిడిని కూడా పెంచుతుంది. బరువు తగ్గడం లేదా పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే వ్యాయామం మరియు ఆహారం, అలాగే స్వీయ-క్రమశిక్షణల కలయిక అవసరం. యోగాలో ఇవన్నీ ఉంటాయి, కనుక ఇది పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడంలో సరైన మార్గం. జిమ్ లో చేసే ఎక్సర్ సైజు లకు భిన్నంగా, యోగా కండరాలపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది మరియు సహజంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
How Yoga Helps in Fat Burning ఈ యోగాసనాలను రోజూ సాధన చేయడం ద్వారా అనుకున్న ఫలితాలను పొందవచ్చు…..
వృక్షాసనం…
- పాదాలను ఒకదానితో ఒకటి ఉంచి, చేతులను పక్కకు సడలించాలి.
- రెండు పాదాలను నేలపై గట్టిగా ఉంచి , తద్వారా శరీర బరువు సమానంగా బ్యాలెన్స్ చేయబడుతుంది.
- తలపై చేతులు పైకెత్తి, వేళ్లను ఇంటర్‌లాక్ చేసి, అరచేతులను పైకి చూపి నమస్కార ముద్ర ఉంచాలి .
- ఊపిరి పీల్చుకుంటూ, రెండు అర చేతులను పైకి చాచి ఉంచాలి. శ్వాస పీల్చుకుని , మొత్తం శరీరాన్ని పై నుండి క్రిందికి స్ట్రెచ్ చేయాలి , బ్యాలెన్స్ కోల్పోకుండా చూసుకోవాలి.
- ఉచ్ఛ్వాసము లో పాదాలను క్రిందికి ఉంచి మరొకసారి గాలి పీల్చినప్పుడు, మళ్ళీ కాలి మీద పైకి లేపాలి . బ్యాలెన్స్ కోసం మళ్లీ సర్దుబాటు చేయడానికి ఈ దశను ఉపయోగపడుతుంది .
వీరభద్ర ఆసనం….
- పాదాలను 3-4 అడుగుల దూరంలో ఉంచి చాప మీద నిలబడి చేతులను పైకి లేపాలి , తద్వారా అవి నేలకి లంబంగా మరియు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి.
- ఎడమ కాలు నిటారుగా ఉంచి, కుడి మోకాలిని భూమికి సమాంతరంగా ఉండేలా వంచాలి .
- శ్వాస పీల్చుకుంటూ, చేతులతో పైకి వెళ్ళాలి , ఛాతీని విస్తరిస్తూ మరియు వెనుకకు వంపు చేయాలి . ప్రతి ఉచ్ఛ్వాసంతో ఆకాశం వైపు ఎత్తుకు చేరాలి మరియు ప్రతి నిచ్ఛ్వాసంతో తుంటితో భంగిమలో లోతుగా ఉండాలి .
- ఇలాగే ఎడమ వైపుకూడా పునరావృతం చేయాలి.
బాలసనం….
మడమల కూర్చొని మోకరిల్లుతున్న భంగిమలో మొదలుపెట్టాలి . లోతుగా ఊపిరి పీల్చుకుంటూ, నుదిటిని నేలపైకి తీసుకురావాలి. చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచాలి. లోతుగా ఊపిరి పీల్చుకోవాలి. కుడి చేతిని ఎడమ భుజం క్రిందకు తీసుకువచ్చి మరియు కుడి వేళ్ల వైపు చూడాలి. ఇలానే మరోవైపు పునరావృతం చేయాలి.
బద్ధ కోణ ఆసనం (బటర్ ఫ్లై ఎక్సర్ సైజ్ )…..
ముందు కాళ్లను చాచి కూర్చోవాలి . రెండు మోకాళ్లను వంచి, రెండు పాదాల అరికాళ్లను ఒకచోటకు చేర్చి, బొటనవేళ్లను పట్టుకోవాలి . సీతాకోకచిలుక రెక్కలను ఆడించే లాగా వెనుకభాగాన్ని నిటారుగా ఉంచి , తొడలను పైకి క్రిందికి తిప్పాలి. గాలి పీలుస్తున్నపుడు మరియు వదులుతున్నప్పుడు, పాదాలను శరీరం వైపుకు దగ్గరగా లాగి, భంగిమలో లోతుగా విశ్రాంతి తీసుకోవాలి.
జాను శీర్ష ఆసనం (తల నుండి మోకాలి భంగిమ)…
కుడి కాలు ముందుకు చాచి నేలపై కూర్చోవాలి. ఎడమ మోకాలిని మీ వైపుకు వంచి, ఎడమ పాదం కుడి తొడలోకి నొక్కినట్లు చేయాలి . లోతుగా గాలి పీల్చి చేతులను పైకి లేపాలి . ఊపిరి పీల్చుకున్నప్పుడు, తుంటి వద్ద వంగి, కుడి కాలు వైపు ముందుకు మడవాలి. చాచిన కుడి పాదాన్ని చేతులతో పట్టుకోడానికి ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఈ భంగిమను కొన్ని సెకన్లపాటు ఉంచి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి. ఇక ఇదే భంగిమను ఎడమ కాలుతో పునరావృతం చేయాలి.
హలాసనం….
చేతులను వెనుకభాగంలో ఉండేలా పడుకోవాలి. కాళ్ళు నేలకి లంబంగా ఉండేలా ఎత్తి మోచేతులను వంచి, అరచేతులను నడుము క్రింద ఉంచాలి. చేతులకు వ్యతిరేక దిశలో కాళ్ళను వంచాలి. చేతులతో, కాళ్లను 180° కోణంలో ఉండే వరకు తలపైకి నెట్టాలి, కాలి వేళ్లను నేలకు తాకడానికి ప్రయత్నించాలి. ఈ స్థితిలో కొన్ని సెకన్లపాటు ఉంచి, ఆపై విశ్రాంతి తీసుకోవాలి.
అధోముఖ స్వనాసన…..
చేతులు మోకాళ్లపై ఉంచి మోకాళ్ళను నేరుగా తుంటికి దిగువన మరియు చేతులను భుజాల ముందు కొద్దిగా ఉంచాలి .
నేల నుండి మోకాళ్ళను పైకి లేపి , కాళ్ళను నిటారుగా ఉంచి తుంటిని పైకి మరియు వెనుకకు నిటారుగా వంగినట్టుగా ఉండాలి . అరచేతులు నేలపై ఫ్లాట్‌గా ఉండేలా చేతులను నిటారుగా ఉంచండి. తల చేతుల మధ్య ఉండేలా చూసుకోవాలి. శరీరం తలక్రిందులుగా ఉన్న V ఆకారాన్ని ఏర్పరచాలి. లోతుగా శ్వాస తీసుకొంటూ చేయాలి ఈ భంగిమ అనంతరం విశ్రాంతి తీసుకోవాలి.
భుజంగ ఆసనం….
ముందుగా కడుపుపై చదునుగా, ముఖం పైకి ఉండాలి అరచేతులు నేలపై చదునుగా పక్కటెముక పక్కన చేతులను ఉంచాలి. తల, మెడ, భుజాలు మరియు ఛాతీ పైభాగం నేల నుండి పైకి ఎత్తేటప్పుడు లోతుగా పీల్చుతూ, అరచేతులను నేలపైకి నొక్కతూ ఉండాలి. శ్వాసను సాధారణంగా మరియు స్థిరంగా ఉంచడానికి ప్రయత్నించాలి 30 సెకన్ల పాటు ఈ ఆసనం చేయాలి .
సేతు బంధ సర్వాంగ ఆసనం…
వెనుక పడుకోని, మోకాళ్లను వంచి మొండెం పైకి ఎత్తేటప్పుడు పాదాలను నేలపై ఉంచాలి. అరచేతులు నేలపై చదునుగా ఉండి , తుంటి లేదా తొడ క్రింద మరియు తల మరియు మెడ కూడా నేలపై ఉండాలి. ఈ స్థితిలో కొన్ని సెకన్లపాటు ఉంచి విశ్రాంతి తీసుకోవాలి. బ్రిడ్జి షేప్ లో శరీరాన్ని ఉంచడం వల్ల పొట్ట దగ్గర కొవ్వు కరుగుతుంది.
ధనురాసనం…
పడుకుని ముఖం మాత్రమే ఆకాశం వైపు ఉండేలా చూసుకోవాలి, మోకాళ్ళను వంచి రెండు చీలమండలను పాదాలను చేతులతో పట్టుకోగలగాలి. మోకాలు తుంటి వెడల్పు వేరుగా ఉండేల చూసుకోవాలి. లోతుగా గాలి పీల్చుకొంటూ ఛాతీ మరియు తొడలను నేల నుండి ఎత్తాలి . ఈ భంగిమలో 20 సెకన్లపాటు ఉండి శ్వాసను గమనించాలి . ఆ తరువాత విశ్రాంతి తీసుకోవాలి.
ఈ ఆసనాలను రోజూ ప్రాక్టీస్ చేయడం మరియు సురక్షితమైన మార్గంలో పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడానికి కొన్ని ప్రాథమిక జీవనశైలి మార్పులను చేర్చడంతో పాటు ఆరోగ్యకరమైన, చక్కటి సమతుల్య ఆహారాన్ని అనుసరించడం ద్వారా మార్పును గమనించవచ్చు. యోగా, ఇతర వ్యాయామాల మాదిరిగానే, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. యోగాభ్యాసం చేయడం మానేసినప్పుడు, వ్యాయామం లేకపోవడం వల్ల ఆహారం నుండి పొందే కేలరీలు ఖర్చు కావు . ఇది కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోతుంది. పైన పేర్కొన్న ఆసనాలు పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడంలో సహాయపడతూ శరీరానికి పూర్తి వ్యాయామం ఇస్తాయి . కండరాలను బలోపేతం చేస్తాయి.