Karthika Masam: కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది గా చెప్పబడుతుంది. కార్తీక మాసంలో ఆర్చనలు, అభిషేకాలతోపాటు, స్నాన దానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు.
అయితే కార్తీక మాసం నెల రోజులూ పండగ వాతావరణమే ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసం లో భక్తులు జపం, దానం. అయితే కార్తీక మాసానికే ‘ఊర్జమాసమ’ అని పేరు ఉంది. ఊర్జము అంటే పుణ్యం అని అర్థం. హరిహరులకు ప్రీతికరమైన కారీకాన్ని సూక్ష్మధర్మ ప్రబోధితమైనదిగా అభివర్ణిస్తారు.
కార్తీక మాస ప్రాశస్త్యం పద్మ, స్కాంద పురాణాల్లో విశేషంగా పేర్కొన్నారు. ఇది సద్గతికి నూతన మోక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం వెలిగించడం, అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు ఉసిరి చెట్టుకు పూజలు చేయడం ఈ మాసపు ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేస్తాయి అని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు పూజలు చేయాలి అలాగే సిరి చెట్టు దగ్గర దీపం పెట్టాలి అదేవిధంగా ఉసిరి చెట్టు దగ్గర వనభోజనాలు కూడా చేయించాలి అయితే అసలు ఉసిరి చెట్టుకు పూజలు ఎందుకు చేస్తారంటే ఉసిరి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు.
అందుకే విష్ణువుని పూజించటం కోసం ఈ ఉసిరి చెట్టుకు పూజాదికాలు నిర్వహిస్తారు. అలాగే విష్ణు స్వరూపంగా భావించే ఉసిరి చెట్టు నుండి వచ్చిన ఫలాల పై దీపాలను పెట్టింగాటిని దానం ఇవ్వడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని.. అలాగే విష్ణుమూర్తి కరుణ తమ పై ఉంటుందని భక్తులు భావిస్తారు.
కాబట్టి కార్తీక మాసం లో ఉసిరిక దీపాలను పెడుతూ ఉంటారు. అంతే కాకుండా ఉసిరి చెట్టు ఉన్న ప్రాంతాలలో వనభోజనాలను చేస్తారు. అలాగే కార్తీక మాసం లో రోజు ఉసిరిని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ చలికాలం లో అనారోగ్యాలు ఎక్కువగా వస్తాయి.
Karthika Masam: రోజు ఉసిరిని తినడం తో ఎంతో ఆరోగ్యం..
అంతే కాకుండా చలికాలాన్ని యమ దంష్ట్ర లు బయటకు వచ్చే కాలంగా మన పెద్దలు చెబుతారు. కాబట్టి అనారోగ్యాల బారి నుండి బయటపడి, యముడి కోరల నుండి కాపాడుకోవడం కోసం ఉసిరి ఎంతో ప్రధానమైనదిగా చెబుతారు. అలాగే ఉసిరి చెట్టును ధాత్రీ చెట్టు అని కూడా అంటారు. ఇక ఇవన్నీ చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు.