Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: ఏప్రిల్ 12, 2023 పంచాగం

తేది : 12, ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్ర మాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : షష్టి ఉదయం 05:39ని. సప్తమి
నక్షత్రం : మూల ఉదయం 11:59 ని.
వర్జ్యం : రాత్రి 9.04ని॥ నుంచి 10.35ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.57ని నుండి 12.48ని.
రాహుకాలం : మధ్యాహ్నం 12.00ని.ల నుంచి 1.30ని.ల వరకు
యమగండం : ఉదయం 7.18ని.ల నుంచి 8.58ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.06ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.27ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారికి ఇతరుల సహాయం అందుతుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఈరోజు పూర్తి సమయాన్ని కేటాయించాల్సి వస్తుంది. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.

వృషభ రాశి: ఈ రాశి వారికి ఈ రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. కొన్ని పనులు వాయిదా పడతాయి. కొందరు వ్యక్తులు మీ సహాయాన్ని కోరుతారు. తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అయినప్పటికీ సంపాదించే స్తోమత ఎక్కువగా ఉంది.

మిధున రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా పర్వాలేదు. కొన్ని పనులు సునాయాసంగా పూర్తవుతాయి. కొన్ని వ్యక్తిగత విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. పై అధికారులను గౌరవించాలి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. కొత్తగా పనులు ప్రారంభించే వాళ్లకు ఈరోజు బాగుంది.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అనవసరమైన పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంది.

సింహరాశి: ఈ రాశి వారు ఈ రోజు ఒక శుభవార్త వింటారు. మీ పాత స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు మంచి ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

కన్య రాశి: ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా ఎటువంటి సమస్యలు లేవు. ఈరోజు అనుకూలమైన వాతావరణం కూడి ఉంది. ఇతరులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగానే ఉన్నాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయాలి. కొన్ని పనులు ఒత్తిడిగా ఉంటాయి.

తుల రాశి: ఈ రాశి వారు కొన్ని రుణాల సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికంగా కొంత లాభాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాలు పంచుకోవాల్సి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఒక సమస్య వెంటాడుతుంది. దీని పట్ల కాస్త నిరాశ చెందుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వాయిదా పడిన పనులు చేయాల్సి వస్తుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు కుటుంబ బాధ్యతలను మోయాల్సి వస్తుంది. కొన్ని పనులు వాయిదా పడినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఖర్చులు చాలా తగ్గించుకోవాలి. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ఇతరులతో మాట్లాడే ముందు గౌరవంగా ఉండాలి.

మకరరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. దూరపు బంధువులతో కొన్ని విషయాల గురించి మాట్లాడే అవకాశం వస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు కలిగే అవకాశాలున్నాయి.

కుంభరాశి: ఈ రాశి వారు ఏ పని మొదలుపెట్టినా కూడా సక్రమంగా పూర్తి చేయాలి. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఇతరులకు తోచిన సహాయం చేయడం మంచిది. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకునే ప్రయత్నం చేస్తారు.

మీన రాశి: ఈ రాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. కొత్తగా పనులు ప్రారంభించే వాళ్లకు అనుకూలంగా ఉంది. శత్రువులకు దూరంగా ఉండాలి. సమయం అనుకూలంగా ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on ఏప్రిల్ 12, 2023 at 12:00 ఉద.