Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఏప్రిల్ 15, 2023 పంచాగం
తేది : 15, ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్ర మాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : శనివారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : దశమి రాత్రి 08:45ని.
నక్షత్రం : శ్రవణం ఉదయం 07:35ని. ధనిష్ఠ
వర్జ్యం : మధ్యాహ్నం 12.32ని॥ నుంచి 2.01ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 7.41ని నుండి 8.32ని.
రాహుకాలం : ఉదయం 9.00ని.ల నుంచి 10.30ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 2.00ని.ల నుంచి 3.41ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.04ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.28ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం బాగుంటుంది. ఏ పని చేసినా కూడా సక్రమంగా పూర్తవుతుంది. ఊహించకుండానే డబ్బులు అందుకుంటారు. కొన్ని పరిచయాలు మీకు లాభంగా ఉంటాయి. సమాజంలో మీ మాటకు మంచి విలువ పెరుగుతుంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగుతూ ఉంటాయి. సమయం చూసి పెద్దవారితో మాట్లాడాల్సి ఉంటుంది. కొన్ని పట్టింపులకు దూరంగా ఉంటారు. ఉద్యోగస్తులు మంచి వాతావరణం కలిగి ఉంటారు.
మిధున రాశి: ఈ రాశి వారికి ఈ రోజంతా ప్రశాంతంగా గడుస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఈరోజు ఒక శుభవార్త వింటారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అవసరానికి ఇతరుల సహాయం అందుకుంటారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి. స్నేహితులను కలుస్తారు. బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు కొన్ని విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంది.
సింహరాశి: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామి బంధువులతో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.
కన్య రాశి: ఈ రాశి వారు ఈరోజు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. కొందరు నిరుద్యోగులు మంచి శుభవార్త వింటారు. పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్తారు. కొందరు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
తుల రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. ఇతరుల మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. కొత్త పరిచయాలను ఎక్కువగా నమ్మకూడదు. సమయంను కాపాడుకోవాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. బంధువుల కారణంగా కొన్ని ఒత్తిడిలు ఎక్కువవుతాయి. ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యం చేయకూడదు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. స్నేహితులతో కాస్త సమయాన్ని గడుపుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. దీని వల్ల కాస్త కుదుటగా ఉంటారు. మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగస్తులు కాస్తు పట్టుదలగా ఉండటం వల్ల అనుకున్న లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి.
మకరరాశి: ఈ రాశి వారు కొన్ని విషయాలలో పరిష్కారం కోసం వెతుకుతారు. ప్రయాణాలు చేయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొన్ని పనులల్లో కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అందుతుంది. భాగస్వామితో అనవసరంగా వాదనలకు దిగకూడదు. సమయం అనుకూలంగా ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇతరులు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా కొనసాగుతుంది. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు. కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: ఈ రాశి వారికి కొన్ని బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. లాభాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మాటకు మంచి గౌరవం పెరుగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్త వింటారు. వ్యాపారస్తులకు ఇతరుల సహాయం అందుతుంది.