Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఏప్రిల్ 16, 2023 పంచాగం
తేది : 16, ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్ర మాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : ఆదివారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : ఏకాదశి సాయంత్రం 06:14 ని.
నక్షత్రం : ధనిష్ఠ ఉదయం 05:51ని. శతభిషం
వర్జ్యం : ఉదయం 10.04ని॥ నుంచి 11.34ని॥ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 5.02ని నుండి 5.53ని.
రాహుకాలం : సాయంత్రం 4.30ని.ల నుంచి 6.00ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 12.19ని.ల నుంచి 1.59ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.03ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.28ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు కొన్ని విషయాల పట్ల బాగా చింత చెందుతారు. దూరపు ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
వృషభ రాశి: ఈ రాశి వారికి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. కొన్ని విషయాలలో ఫలితాలు త్వరలో అందుకుంటారు. దూరపు బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరులకు సహాయం చేస్తారు.
మిధున రాశి: ఈ రాశి వారు ఒక వార్త వినడం వల్ల చాలా బాధపడతారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. పిల్లలను కొన్ని ప్రయాణాలకు పంచకపోవడం మంచిది. అనవసరమైన విషయాల గురించి బాగా బాధపడతారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. కొందరు ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీ జీవితంలోకి కొన్ని కొత్త పరిచయాలు ఎదురవుతాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సహాయం అందుకుంటారు.
సింహరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. తల్లిదండ్రులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు. మీ వ్యాపారం ను మరింత అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొన్ని పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.
కన్య రాశి: ఈ రాశి వారు ఏ పనినైనా కాస్త ఆలస్యంగా చేయడం వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవాలి. కొన్ని విషయాలలో నమ్మకస్తులు మీ వెంట ఉంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.
తుల రాశి: ఈ రాశి వారు కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనుకోకుండా మీ వ్యక్తిగత విషయాలు బయటపడతాయి. తల్లిదండ్రులతో కాస్త ఆలోచించి మాట్లాడాలి. కొందరు స్నేహితులు కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. కొన్ని ప్లాన్స్ వేసే అవకాశాలు ఉన్నాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పాలి. ఏ పనినైనా సక్రమంగా పూర్తి చేస్తారు. దూరపు ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్లకు అనుకూలంగా ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. తోబుట్టువులను ఎక్కువగా నమ్మకూడదు. భూమికి సంబంధించిన విషయంలో వాదనలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. కొన్ని సలహాలు అందుకుంటారు.
మకరరాశి: ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా సక్రమంగా పూర్తవుతుంది. ఆర్థికంగా పొదుపు చేయటం వల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. బంధువులతో సమయాన్ని గడుపుతారు. సమయం ను కాపాడుకోవాలి.
కుంభరాశి: ఈ రాశి వారికి కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. మీ జీవితంలోకి కొన్ని కొత్త పరిచయాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
మీన రాశి: ఈ రాశి వారు కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. ఇతరుల ద్వారా ఆర్థికంగా సహాయం అందుకుంటారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఎక్కువ ఖర్చులు చేయకపోవడం మంచిది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని పనులు ఒత్తిడిగా ఉంటాయి.