Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఏప్రిల్ 18, 2023 పంచాగం
తేది : 18 ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్ర మాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : మంగళవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : త్రయోదశి మధ్యాహ్నం 01:27ని.
నక్షత్రం : పూర్వాభాద్ర ఉదయం 02:28ని. ఉత్తరాభాద్ర
వర్జ్యం : మధ్యాహ్నం 12.27ని॥ నుంచి 1.58ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి 11.15ని. నుండి 12.00ని.
రాహుకాలం : మధ్యాహ్నం 3.00ని.ల నుంచి 4.30ని.ల వరకు
యమగండం : ఉదయం 8.58ని.ల నుంచి 10.39ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.02ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.29ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు చేసే పనిలో లీనమవుతారు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల గురించి ఆందోళన చెందుతారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి బాగా చిరాకు పడతారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకపోవడం మంచిది.
వృషభ రాశి: ఈ రాశి వారు కొన్ని ఇబ్బందుల నుండి బయట పడుతారు. విద్యార్థులకు కొన్ని అడ్డకుంలు వస్తాయి. డబ్బులు అవసరానికి మించి ఖర్చులు చేస్తారు. కొన్ని పనులలో చిరాకు పడుతారు. బయట విషయాలు కొన్ని నెత్తిన పెట్టుకుంటారు. సమయాన్ని వృధా చేయకండి.
మిధున రాశి: ఈ రాశి వారికి కొన్ని విబేధాలు వస్తాయి. బయట వ్యక్తుల విషయాలలో తల దూర్చకూడదు. పిల్లల ఆరోగ్యం గురించి బాగా ఆలోచించాలి. చేసే పనులన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని విషయాల పట్ల ఇబ్బందుల్లో పడతారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్తగా పెట్టుబడి పెట్టేవాళ్ళు కాస్త ఆలోచనలు చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు జరుగుతాయి. పిల్లల భవిష్యత్తు గురించి అనవసరంగా ఆందోళన చెందకూడదు.
సింహరాశి: ఈ రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వస్తుంది. తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు. ఇతరులకు సహాయం చేస్తారు. బంధువులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. ఒక వార్త మిమ్మల్ని మరింత సంతోష పెడుతుంది. సమయం అనుకూలంగా ఉంది.
కన్య రాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేయటానికి ఆసక్తి చూపించాలి. సోమరితనాన్ని దూరంగా ఉంచాలి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
తుల రాశి: ఈ రాశి వారు ఈ రోజు ఇతరులకు సహాయం చేస్తారు. మంచి పేరును సంపాదించుకుంటారు. కొత్త పరిచయాలు మీ జీవితంలోకి వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. చేపట్టిన పనులలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. ఉద్యోగస్తులకు గౌరవం పెరుగుతుంది. కొన్ని డబ్బులు ఖర్చు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇతరులకు సహాయం చేస్తారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈ రోజు వ్యాపారంలో లాభాలు ఎక్కువగా అందుకుంటారు. తీరికలేని సమయంతో గడిపే వాళ్లకు ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది. కొన్ని పనులు విజయవంతం కావడం వల్ల మీలో మరింత ధైర్యం పెరుగుతుంది. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.
మకరరాశి: ఈ రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. దీనివల్ల చాలా బాధపడతారు. కుటుంబ సభ్యుల మద్దతు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. విద్యార్థులు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. సమయాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.
కుంభరాశి: ఈ రాశి వారు ఒక శుభవార్త వినడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు కొన్ని మార్పులు కలుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు.
మీన రాశి: ఈ రాశి వారు చేసే పనులలో ఏకాగ్రత చూపాలి. వాయిదా పడిన పనులు కూడా పూర్తి చేయడం వల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది. పాత స్నేహితులను కలుస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం వస్తుంది. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.