Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఏప్రిల్ 19, 2023 పంచాగం
తేది : 19, ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్ర మాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : చతుర్దశి ఉదయం 11.24ని.
నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 1.01ని. రేవతి 11.53ని.
వర్జ్యం : సాయంత్రం 7.17ని॥ నుంచి 8.51ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.57ని నుండి 12.48ని.
రాహుకాలం : మధ్యాహ్నం 12.00ని.ల నుంచి 1.30ని.ల వరకు
యమగండం : ఉదయం 7.18ని.ల నుంచి 8.58ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.01ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.29ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు నూతన వాహన కొనుగోలు చేయడం వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని ట్రిప్స్ ప్లాన్ చేస్తారు. ఇతరుల దృష్టి మీపై ఎక్కువగా ఉంటుంది. తొందరపడి ఎటువంటి పనులు చేయకపోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృషభ రాశి: ఈ రాశి వారు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు. దీనివల్ల ఇతరులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యుల బాధ్యతల గురించి జాగ్రత్త వహించాలి.
మిధున రాశి: ఈ రాశి వారు కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకున్నప్పటికీ కూడా చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి:ఈ రాశి వారు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవడం మంచిది. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచనలు చేయాలి. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.
సింహరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు. బంధువుల రాకతో కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కొన్ని వ్యసనాలను దూరం చేసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కన్య రాశి: ఈ రాశి వారు ఏ పనులు చేసినా కూడా కాస్త ఆలోచించి చేయాలి. లేదంటే భవిష్యత్తులో సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంది. కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల రాశి: ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా పొదుపు చేయటం వల్ల భవిష్యత్తులో లాభాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల నుండి శుభవార్త వింటారు. అనుకోకుండా పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఏ పనులు ప్రారంభించినా కూడా త్వరగా పూర్తవుతాయి. కొద్దిపాటి సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. కొన్ని ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు తమ తల్లిదండ్రులతో అనవసరంగా వాదనలకు దిగుతారు. ఇంటికి సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కొందరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమయాన్ని బాగా కాపాడుకోవాలి.
మకరరాశి: ఈ రాశి వారికి ఈ రోజు కొన్ని పనులు వాయిదా పడతాయి. దీనివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు. కొన్ని ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మీ జీవితంలోకి కొత్త పరిచయాలు వస్తాయి.
కుంభరాశి: ఈ రాశి వారు ఏ విషయంలోనైనా ఓపికగా ఉండటం మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇతరుల వ్యక్తిగత విషయాలు జోలికి పోకూడదు. సమయం సందర్భం చూసి కొన్ని పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: ఈ రాశి వారు అనుకోకుండా ఇతరులతో కలిసి కొన్ని పనులు ప్రారంభిస్తారు. కానీ దానివల్ల నిరుస్తాహం చేయాల్సి వస్తుంది. అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి. కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.