Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఏప్రిల్ 23, 2023 పంచాగం
తేది : 23, ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : తదియ ఉదయం 07:47ని.
నక్షత్రం : రోహిణి పూర్తి
వర్జ్యం : ఉదయం 6.26ని॥ నుంచి 8.09ని॥ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 7.41ని నుండి 8.32ని.
రాహుకాలం : సాయంత్రం 5.02ని.ల నుంచి 5.53ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 12.19ని.ల నుంచి 1.59ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.58ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.30ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని తీర్థయాత్రల వంటి ప్రయాణాలు చేస్తారు. సమయం చూసి కొన్ని పనులు ప్రారంభించాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి. వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.
వృషభ రాశి: ఈ రాశి వారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఇతరుల ద్వారా ఆర్థిక సహాయం అందుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో బయటపెట్టకూడదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిధున రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. ఇతరులు మీ దగ్గర నుండి డబ్బులను అప్పుగా తీసుకున్న ప్రయత్నం చేస్తారు. తొందరపడి ఇతరులకు మీరు లొంగకూడదు. చేసే పనిలో క్రమశిక్షణ ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆర్థికంగా ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచనలు చేయాలి. ఈ రోజు కొందరు భూమి కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
సింహరాశి: ఈ రాశి వారు చేయాల్సిన ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరపు బంధువుల రాకతో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కనికరం లేకుండా ప్రవర్తిస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది.
కన్య రాశి: ఈ రాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. తిరిగి సంపాదించే స్తోమత కూడా ఉంది. పిల్లల ఆరోగ్యం పట్ల ఆలోచనలు చేయాలి. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా లేవు. ఇతరులతో కొత్త పనుల గురించి చర్చలు చేస్తారు. ఉద్యోగం కోసం తిరిగేవాళ్లు మరికొన్ని రోజులు ఓపిక పట్టుకోవాల్సి ఉంటుంది.
తుల రాశి: ఈ రాశి వారు తమకు తోచిన విధంగా సహాయం చేసుకుంటూ పోతారు. కొన్ని విషయాల గురించి అసలు పట్టించుకోరు. వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు. ఇతరులతో అనవసరంగా వాదనలకు దిగకూడదు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Zodiac Signs….
వృశ్చిక రాశి: ఈ రాశి వారు తమ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. పనులు త్వరగా పూర్తి చేసుకోవడం వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలి. లేదంటే అవతలి వ్యక్తులు అపార్ధాలు చేసుకుంటారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. వాహన కొనుగోలు చేసేవాళ్లు కాస్త ఆలోచనలు చేయాలి. కొన్ని నిర్ణయాల పట్ల శత్రువులకు దారి ఇచ్చినట్లు అవుతుంది. వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దూరపు ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి.
మకరరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పనులు పూర్తయ్యేసరికి మరికొన్ని పనులు ప్రారంభించాల్సి వస్తుంది. ఈరోజు కొన్ని విషయాల పట్ల ఒత్తిడి చెందుతారు. కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారస్తులకు పనులు వేగంగా అవుతాయి.
కుంభరాశి: ఈ రాశి వారు కొత్తగా ప్రారంభించే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. దానికి తగ్గట్టు మంచి ప్రతిఫలం కూడా అందుకుంటారు. స్నేహితులకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. పాత విషయాలను అనవసరంగా గుర్తుకు చేసుకొని బాధపడతారు.
మీన రాశి: ఈ రోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండే రోజు. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. శత్రువులు మంచిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని విషయాలలో కాస్త ఆలోచనలు చేయాలి. కొత్త సమస్యలను దరి చేరనివ్వకండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.