Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఏప్రిల్ 27, 2023 పంచాగం
తేది : 27, ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : సప్తమి మధ్యాహ్నం 01:39ని.
నక్షత్రం : పునర్వసు ఉదయం 06:59ని.
వర్జ్యం : సాయంత్రం 3.57ని॥ నుంచి 5.45ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10.14ని నుండి 11.05ని. తిరిగి 3.21ని. నుండి 4.12ని.
రాహుకాలం : రాత్రి 1.30ని.ల నుంచి 3.00ని.ల వరకు
యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి 7.18ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.56ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.31ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు ఎక్కువగా ప్రయాణాలు చేయడం మానేయాలి. ఇంటి బాధ్యతలను అసలు మర్చిపోకూడదు. మిమ్మల్ని దూరం పెట్టే వ్యక్తులను దూరం ఉంచడం మంచిది. కొన్ని పనులు ఏకాగ్రతతో పూర్తి చేయాలి. భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని బాధ పెడుతుంది.
వృషభ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా తోటి ఉద్యోగస్తులతో వాదనలకు దిగకూడదు. ఇంటికి సంబంధించిన విషయాలను బయటకు పెట్టకూడదు. ఖర్చులు తగ్గించుకోవాలి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.
మిధున రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు పూర్తి చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ మనోధైర్యాన్ని కోల్పోకూడదు. ఇతరులు మీ విషయాలలో జోక్యం తీసుకుంటారు. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యంగా మీ వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. పిల్లలకు ఒక శుభవార్త వినిపించే అవకాశాలున్నాయి.
సింహరాశి: ఈ రాశి వారు దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు. కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు పూర్తి చేస్తారు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగాలలో చేరే వాళ్ళు తొందరపడకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిగత రహస్యాలు బయటికి పెట్టకూడదు.
కన్య రాశి: ఈ రాశి వారు ఖర్చులు తగ్గించుకోవడం వల్ల భవిష్యత్తులో లాభాలు అందుకుంటారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా తల్లిదండ్రుల సలహాలు అందుకోవటం మంచిది.
తుల రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. దూరమైన బంధుత్వాలు కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతోషకరమైన వాతావరణంలో కలిగి ఉంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ కొన్ని ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విదేశ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకోవాలి. సమయంను కాపాడుకోవాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులు మిమ్మల్ని అనవసరమైన విషయాలలో ఇరికించే ప్రయత్నం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యాపారస్తులకు కొన్ని సమస్యలు వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణం ఉంది.
మకరరాశి: ఈ రాశి వారు ఈ రోజు తమ పనులను త్వర త్వరగా పూర్తి చేస్తారు. కొన్ని కోర్టు సమస్యల నుండి బయటపడతారు. ఇంటికి సంబంధించిన కొన్ని విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. స్నేహితులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.
కుంభరాశి: ఈ రాశి వారికి ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ప్రతి విషయాన్ని పెద్దదిగా చేసి ఘర్షణకు దిగకూడదు. రక్తసంబంధికులతో మనసు నొప్పించే మాటలు మాట్లాడకూడదు. ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి: ఈ రాశి వారు ఆర్థికపరమైన లాభాలు ఎక్కువగా అందుకుంటారు. కొన్ని విషయాల గురించి లోతుగా పరిశీలన చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయవలసి వస్తుంది. శత్రువులకు దూరంగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.