Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఏప్రిల్ 28, 2023 పంచాగం
తేది : 28, ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : అష్టమి సాయంత్రం 04:01ని.
నక్షత్రం : పుష్యమి ఉదయం 09:53ని.
వర్జ్యం : ఉదయం 12.14ని॥ నుంచి 2.01ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని.తిరిగి 12.48ని. నుండి 1.39ని.
రాహుకాలం : ఉదయం 10.30ని.ల నుంచి 12.00ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 3.41ని.ల నుంచి 5.21ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 5.55ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.31ని.ల వరకు
మేషరాశి: చేసే పనులల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరులు నమ్మించి మోసం చేయటానికి ప్రయత్నిస్తారు. తొందరపడి కొందరికి మాట ఇవ్వకపోవడం మంచిది. ప్రేమకు సంబంధించిన వ్యవహారాలలో దూరంగా ఉండాలి. లేదంటే సమస్యలు తప్పవు.
వృషభ రాశి: కొన్ని ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలి. కొందరు మీ సలహాలను వాడుకుంటారు. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పెట్టుబడి విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి. సమయం అనుకూలంగా ఉంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తారు.
మిధున రాశి: ఇతరులకు సేవ చేయటానికి మీకు అనుకూలంగా ఉంది. కొన్ని విషయాల గురించి చింత చెందుతారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ తిరిగి సంపాదించే స్తోమత ఎక్కువగా ఉంది. పిల్లలపై బాగా శ్రద్ధ పెట్టాలి. ఇతరుల ద్వారా మోసపోకుండా ఉండాలి.

కర్కాటక రాశి: కొందరు మీ వ్యక్తిగత విషయాల పట్ల బాగా హేళన చేస్తూ ఉంటారు. వాటిని పట్టించుకోకుండా ఉండటం మంచిది. కొన్ని పనులల్లో తొందరపడకపోవడం మంచిది. తల్లిదండ్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి.
సింహరాశి: ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. అనవసరమైన విషయాల గురించి బాగా పట్టించుకుంటారు. కొత్త వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీ ప్రేమ జీవితం ఇకపై సాఫీగా సాగుతుంది. కొన్ని బంధాలకు విలువ ఇవ్వాలి. ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు.
కన్య రాశి: కొందరు మిమ్మల్ని దూరం పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ మళ్లీ తిరిగి మీ దగ్గరికి వస్తారు. ఆర్థికంగా బాగా సంపాదిస్తారు. కొన్ని పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. కొన్ని రోజుల నుండి బాధపడుతున్న కొన్ని సమస్యల నుండి బయటపడతారు.
తుల రాశి: ఆర్థికంగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రారంభించిన పనులు త్వరగా పూర్తి చేయాలి. బంధువుల నుండి ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
వృశ్చిక రాశి: కొన్ని పనులు త్వరగా పూర్తి చేయటం వల్ల కొత్త పనుల గురించి ఆలోచించవచ్చు. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. గతంలో కోల్పోయిన వస్తువులు తిరిగి అందుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
ధనుస్సు రాశి: ఎట్టి పరిస్థితుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొన్ని విషయాల గురించి ఆలస్యం చేసిన పర్వాలేదు. ఆర్థికంగా ఖర్చులు తగ్గించుకోవాలి. పిల్లల గురించి ఆలోచించాలి. కొందరు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తుంటారు. వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
మకరరాశి: ఈరోజు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. కొన్ని ఖర్చులు కూడా చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు. భాగస్వామి బంధువులతో ముఖ్యమైన విషయాలు గురించి చర్చిస్తారు. సమయం అనుకూలంగా ఉంది.
కుంభరాశి: ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. లేదంటే అపార్ధాలు తలెత్తుతాయి. కొన్ని పనులల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. పిల్లల నుండి శుభవార్త వింటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని పనులు ఒత్తిడిగా ఉంటాయి.
మీన రాశి: ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు. కొన్ని ప్రయాణాలకు దూరంగా ఉండాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది. ఇతరులకు సరైన సమయంలో సహాయం చేస్తారు.