Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఏప్రిల్ 5, 2023 పంచాగం
తేది : 5, ఏప్రిల్ 2023
సంవత్సరం : శోభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : చైత్ర మాసం
ఋతువు : వసంత ఋతువు
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చతుర్దశి ఉదయం 09:19ని.
నక్షత్రం : ఉత్తర ఉదయం 11:23ని.
వర్జ్యం : సాయంత్రం 8.14ని॥ నుంచి 9.55ని॥ వరకు
దుర్ముహూర్తం : సాయంత్రం 5.02ని నుండి 5.53ని.
రాహుకాలం : ఉదయం 11.57ని.ల నుంచి 12.48ని.ల వరకు
యమగండం : ఉదయం 7.18ని.ల నుంచి 8.58ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.11ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.26ని.ల వరకు
మేషరాశి: ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఈరోజు కొందరికి ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. ఆర్థికంగా మరింత బలంగా ఉంటారు. రాజకీయ రంగాలలో ప్రత్యేక గౌరవం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు.

వృషభ రాశి: ఈ రాశికి చెందిన విద్యార్థులు తోటి స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల నుండి సంతోషకరమైన వార్త వింటారు. ఈరోజు ఉద్యోగస్తులు బిజీగా ఉంటారు. శత్రువులు మీ పట్ల మర్యాదగా ప్రవర్తిస్తారు. వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది.
మిధున రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దీనివల్ల సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులు సమయం లోపు పూర్తి చేయాలి. ఉద్యోగస్తులకు సీనియర్ల నుండి మద్దతు అందుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
కర్కాటక రాశి: ఈ రాశి వారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంశలు అందుతాయి. ఈరోజు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
సింహరాశి: ఈ రాశి వారు తమ తోబుట్టువుల సలహాలతో కొన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలపట్ల మంచి ఫలితాలు అందుకుంటారు. కొందరు తీరికలేని సమయంతో గడుపుతారు. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించాలి.
కన్య రాశి: ఈ రాశి వారు కొందరి గురించి పట్టించుకోకపోవడం మంచిది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేయాలి. విద్యార్థులు విజయం సాధించడానికి ముందడుగులో ఉన్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి: ఈ రాశి వారు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేయడం మంచిది. లేదంటే భవిష్యత్తులో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో అనవసరంగా గొడవలను పెట్టుకోకూడదు. కొన్ని పనులు పూర్తి చేసేటప్పుడు ఇతరుల సహాయం అందుకోవాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈ రోజు తమ కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని న్యాయపరమైన వివాదాలకు పరిష్కారాన్ని అందిస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. కొందరికి ఒత్తిడి ఎక్కువగా ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు చేస్తారు. కొందరికి ఆస్తికి సంబంధించిన విషయాల్లో సమస్యలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.
మకరరాశి: ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడపాల్సి ఉంటుంది. పిల్లల ఆరోగ్యం అనుకూలంగా ఉంది. బంధువుల నుండి ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.
కుంభరాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఖర్చులు బాగా చేస్తారు. కొన్ని ఖర్చులు పూర్తిగా తగ్గించుకోవాలి. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులు కొన్ని మార్పులు గమనించాలి. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకూడదు.
మీన రాశి: ఈ రాశి వారు అనుకున్న పనులు సమయానికంటే ముందుగా పూర్తి చేయాలి. వ్యాపారాలు కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు తల్లిదండ్రులతో చర్చించాలి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. జీవిత భాగస్వామితో వాదనలకు దిగకూడదు.