Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: డిసెంబర్ 28, 2022 పంచాగం
తేది : 28, డిసెంబర్ 2022
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయనం
మాసం : మార్గశిర మాసం
ఋతువు : హేమంత ఋతువు
వారము : బుధవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : షష్టి రాత్రి 08:44ని.
నక్షత్రం : శతభిషం మధ్యాహ్నం 12:46ని.
వర్జ్యం : సాయంత్రం 6.53ని॥ నుంచి 8.25ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.57ని నుండి 12.48ని.
రాహుకాలం : మధ్యాహ్నం 12.00 ని.ల నుంచి 1.30ని.ల వరకు
యమగండం : ఉదయం 7.18ని.ల నుంచి 8.58ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.46ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5.43ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాగా నిర్లక్ష్యం చేస్తారు. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు. కొన్ని విషయాల గురించి అనవసరంగా చింత చెందుతారు.
వృషభరాశి: ఈ రాశి వారు తమ పనుల పట్ల నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థికంగా చాలా ఖర్చులు చేస్తారు. అయినప్పటికీ సంపాదించే స్తోమత మీలో ఉంది. ఇతరుల మాటలు ఎక్కువగా నమ్మకూడదు. విదేశ ప్రయాణాలు చేసే ఆలోచనలు ఉంటారు. సమయాన్ని కాపాడుకోవాలి.
మిథునరాశి: ఈ రాశి వారు స్నేహితులతో కలిసి సమయాన్ని బాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు పని చేసే చోట పై అధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని విషయాలలో ఒత్తిడిగా ఫీల్ అవుతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కర్కాటకరాశి:ఈ రాశి వారు అనవసరంగా తమ తల్లిదండ్రులతో వాదనలకు దిగుతారు. సొంతంగా ఆలోచించే ప్రయత్నం చేయరు. పిల్లల భవిష్యత్తు గురించి నిర్లక్ష్యం చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
సింహరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. సేవా రంగాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడేవాళ్లు నిర్లక్ష్యం చేయకూడదు. తల్లితండ్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
కన్యరాశి: ఈ రాశి వారు ఏ పని చేసిన తొందరపడతారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థికంగా చాలా నష్టాలు ఎదుర్కొంటారు. కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.
తులరాశి: ఈ రాశి వారు కొన్ని పనులను ఆలస్యంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం అంతగా సహకరించదు. వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వాళ్ళు పెట్టుబడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. అనవసరంగా మీ తోబుట్టువులతో వాదనలకు దిగకూడదు. సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.
వృశ్చికరాశి: ఈరాశి వారు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించాలి. వ్యాపారస్తులు ఏ పని మొదలుపెట్టిన సక్రమంగా పూర్తవుతుంది. సమయం అనుకూలంగా ఉంది.
ధనుస్సురాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పూర్తి చేయటంలో నిర్లక్ష్యం చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. వ్యాపారస్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
మకరరాశి: ఈ రాశి వారు ఏ పని చేసిన ఇతరుల సహాయం అందుకునే అవకాశం ఉంది. ఒక వార్త మిమ్మల్ని బాగా సంతోష పెడుతుంది. ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. గతంలో మీరు ఇతరులకు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.
కుంభరాశి: ఈ రాశి వారు అనవసరమైన విషయాల పట్ల చింత చెందుతారు. వ్యాపారస్తులు ఏ పని చేసిన ఆలోచించాలి. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి. స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది. సమయాన్ని వృధా చేస్తారు.
మీనరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఒక సమస్య మిమ్మల్ని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. మీ బంధుమిత్రులతో సరైన సమయాన్ని గడపటానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.