Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

 

zodiac signs: డిసెంబర్ 4, 2022 పంచాగం

 

తేది : 4, డిసెంబర్ 2022

సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం

ఆయనం : దక్షిణాయనం

మాసం : మార్గశిర మాసం

ఋతువు : హేమంత ఋతువు

వారము : ఆదివారం

పక్షం : శుక్లపక్షం

తిథి : ఏకాదశి ఉదయం 05:34 ని. ద్వాదశి

నక్షత్రం :రేవతి ఉదయం 06:16ని. అశ్విని

వర్జ్యం : ఉదయం 3.05ని॥ నుంచి 4.45ని॥ వరకు

దుర్ముహూర్తం : సాయంత్రం 5.02ని నుండి 5.53ని.

రాహుకాలం : సాయంత్రం 4.30 ని.ల నుంచి 6.00ని.ల వరకు

యమగండం : మధ్యాహ్నం 12.19ని.ల నుంచి 1.59ని.ల వరకు

సూర్యోదయం : ఉదయం 6.34ని.లకు

సూర్యాస్తమయం : సాయంత్రం 5.36ని.ల వరకు

 

మేషరాశి: ఈ రాశి వారు భవిష్యత్ గురించి బాగా ఆలోచిస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వ్యక్తిత్వం గురించి ఇతరులు చెడుగా మాట్లాడుకుంటారు. వాటి గురించి అస్సలు పట్టించుకోకూడదు.

 

వృషభరాశి: ఈ రాశి వారు దైవ కార్యక్రమములో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేస్తారు. స్థల నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఏ పని చేసిన ఆలోచించి చేస్తారు. సమయాన్ని కాపాడుకోవడం మంచిది.

 

మిథునరాశి: ఈ రాశి వారు తీసుకునే నిర్ణయం బట్టి భవిష్యత్తు ఉంటుంది. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశి బంధువుల నుండి శుభవార్త వింటారు.

Zodiac Signs
Zodiac Signs

 

కర్కాటకరాశి: ఈ రాశి వారు అనుకోకుండా ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. వాహన కొనుగోలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. సొంత నిర్ణయాలు తీసుకునే ముందు మీకు అనుకూలంగా ఉంటాయి.

 

సింహరాశి: ఈ సరైన సమయంలో పనులు పూర్తి చేయాలి. కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాన్ని అందుకుంటారు.

 

కన్యరాశి: ఈ రాశి వారు ఏ పని చేసిన వాయిదా పడే అవకాశం ఉంది. అనుకోకుండా ఆర్థిక లాభాలు అందుకుంటారు. భూమికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు ఎదుర కాకుండా చూసుకోవాలి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

 

తులరాశి: ఈ రాశి వారు వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు అనుకూలంగా ఉంటాయి. సంతానం గురించి ఆలోచన చేస్తారు. తోబుట్టువుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

 

వృశ్చికరాశి: ఈ రాశి వారు క్షణం తీరికలేని సమయంతో గడుపుతారు. కొత్త పనులు చేపడతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

 

ధనుస్సురాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

 

మకరరాశి: ఈ రాశి వారు అనారోగ్య సమస్యతో బాధపడతారు. అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగుతారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. ఏ పని చేసిన సక్రమంగా పూర్తవుతుంది.

 

కుంభరాశి: ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తోబుట్టులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో అనవసరంగా తలదూర్చకండి.

 

మీనరాశి: ఈ రాశి వారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఒక వార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించాలి. ఉద్యోగస్తులు పై అధికారం పొందే అవకాశం ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on డిసెంబర్ 4, 2022 at 12:00 ఉద.