Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఫిబ్రవరి 2, 2023 పంచాగం
తేది : 2, ఫిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ద్వాదశి సాయంత్రం 4.26ని.
నక్షత్రం : మృగశిర ఉదయం 3.23ని. ఆరుద్ర
వర్జ్యం : రాత్రి 7.47ని॥ నుంచి 9.35ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 10.14ని నుండి 11.05ని. తిరిగి మధ్యాహ్నం 3.21ని. నుండి 4.12
రాహుకాలం : మధ్యాహ్నం 1.30ని.ల నుంచి 3.00ని.ల వరకు
యమగండం : ఉదయం 5.37ని.ల నుంచి 7.18ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.51ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.07ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు వచ్చిన అతిధులను అవమానిస్తారు. దీనివల్ల వీరు మనశ్శాంతి కోల్పోతారు. కొందరు మంచి ఫలితాలు అందుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆదాయం ఎక్కువగా అందుకునే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేస్తారు.
వృషభ రాశి: ఈ రాశి వారు ఒత్తిడి ఎక్కువగా అందుకుంటారు. జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు. కొన్ని ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. ఉద్యోగస్తులకు మంచి పేరు అందుతుంది. కొంత ఆస్తిని సంపాదించుకుంటారు.
మిధున రాశి: ఈ రాశి వారు కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కొత్త వారితో పరిచయం పెరుగుతుంది. తక్కువ దూరాలు ప్రయాణించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలోకి ఒకరు వస్తారు. పనిచేసే చోటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. శత్రువులు మీపై నింద వేస్తారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు తమ పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు చదువులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఆదాయం పరంగా బాగానే ఉంది. కొందరు కోపం తగ్గించుకోవడం వల్ల బాగుంటుంది. లేదంటే విచారంగా ఉంటారు. ఒత్తిడిలకు దూరంగా ఉండాలి.
సింహరాశి: రాశి వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్లో ఉన్న కోర్టు సమస్యలు తీరుతాయి. దీనివల్ల సంతోషంగా ఉంటారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈరోజు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇతరుల సహాయం అందుకుంటారు.
కన్య రాశి: ఈ రాశి వారు పిల్లల గురించి బాగా ఆలోచిస్తూ ఉంటారు. పెద్దలతో కొన్ని విషయాలు చర్చలు చేస్తారు. సమయాన్ని వృధా చేయకుండా ఉండాలి. దూర ప్రయాణాలు చేసే వాళ్లకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పాలి.
తుల రాశి: ఈ రాశి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. తమ వైవాహిక జీవితంలో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు తమ వ్యాపారం పెరుగుతూ ఉంటుంది. ఇతరులకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. సొంత నిర్ణయాలు తీసుకోకండి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సమస్యలు మిమ్మల్ని వెంటాడుతాయి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల నుండి శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు తొందర్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. చేయాల్సిన పనులు పూర్తి చేయటానికి ఆసక్తి చూపించాలి. కొందరు వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. పాత స్నేహితులను కలుస్తారు.
మకరరాశి: ఈ రాశి వారు పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. కొన్ని విషయాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుండి కొన్ని మద్దతులు అందుకుంటారు. విలువైన వస్తువులు కాపాడుకోవడం మంచిది.
కుంభరాశి: ఈ రాశి వారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో పాత జ్ఞాపకాలు పంచుకుంటారు. మీ వ్యక్తిగత జీవితాలు ఇతరులతో పంచుకుంటారు. ఒక శుభవార్త మిమ్మల్ని సంతోష పెడుతుంది. రక్తసంబంధీకుల నుండి పూర్తి మద్దతు ఉంటుంది.
మీన రాశి: ఈ రాశి వారు తమ కుటుంబం గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. దూరప్రాంతపు బంధువుల నుండి ఒక వార్త వింటారు. మీ మనసులో మాటలు ఇతరులతో పంచుకోకండి. సమయాన్ని కాలక్షేపం చేయకూడదు.