Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: ఫిబ్రవరి 4, 2023 పంచాగం

తేది : 4, ఫిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : శనివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : చతుర్దశి రాత్రి 09:30ని.
నక్షత్రం : పునర్వసు ఉదయం 09:16ని.
వర్జ్యం : సాయంత్రం 6.15ని॥ నుంచి 8.03ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 7.41ని నుండి 8.32ని.
రాహుకాలం : ఉదయం 9.00ని.ల నుంచి 10.30ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 2.00ని.ల నుంచి 3.41ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.51ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.08ని.ల వరకు

మేషరాశి: ఈ రాశికి చెందిన వాళ్లకు ఇతర నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అనుకోకుండాముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది. శత్రువులను నమ్మి మోసపోయే అవకాశం ఉంది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిధున రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఎదురుకుంటారు. అయినప్పటికీ కూడా కాస్త ధైర్యంగా ఉంటారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారు తీరిక లేని సమయంతో గడుపుతూ ఉంటారు. తొందర్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు పూర్తయ్యేలా చూసుకోవాలి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని విషయాలలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహరాశి: ఈ రాశి వారు తాము పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులతో అనవసరంగా గొడవలకు దిగుతారు. దీనివల్ల సంతోషం లేకుండా పోతుంది. వ్యక్తిగతంగా ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది.

కన్య రాశి: ఈ రాశి వారికి ఇతరుల సహాయం అందుకోవటం కోసం ఈరోజు అనుకూలంగా ఉంది. కొత్త పనులు పూర్తి చేసేటప్పుడు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి. వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొంటారు. పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

తుల రాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పనులు చేయడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అంతగా సహకరించరు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది. సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులకు సంతోషంగా ఉంటారు.

ధనుస్సు రాశి: తిరికలేని సమయంతో గడిపిన వారికి ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది. సంతానం నుండి శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు. పాత స్నేహితులతో జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ లాభాలు అందుకుంటారు.

మకరరాశి: ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు. వ్యాపారస్తులు అనుభవం మీద వ్యక్తుల సలహాలు తీసుకోవాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

కుంభరాశి: ఈ రాశి వారు ఏ విషయంలోనైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. మీ స్నేహితులతో అనవసరంగా గొడవలకు దిగుతారు. జీవిత భాగస్వామితో వ్యాపారంకు సంబంధించిన విషయాల గురించి చర్చలు చేయాలి. సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

మీన రాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఇతరుల సహాయంతో కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు బాగా అనుకూలంగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on ఫిబ్రవరి 4, 2023 at 12:00 ఉద.