Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: ఫిబ్రవరి 6, 2023 పంచాగం

తేది : 6, ఫిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : పాడ్యమి పూర్తి
నక్షత్రం : ఆశ్లేష మధ్యాహ్నం 3.03ని.
వర్జ్యం : ఉదయం 4.24ని॥ నుంచి 6.11ని॥ వరకు
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12.47ని నుండి 1.38ని. తిరిగి 3.20ని. నుండి 4.11ని.
రాహుకాలం : ఉదయం 7.30ని.ల నుంచి 9.00ని.ల వరకు
యమగండం : ఉదయం 10.38ని.ల నుంచి 12.19ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.50ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.09ని.ల వరకు

మేషరాశి: ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. కొన్ని నిర్ణయాలు ఆలోచించి తీసుకోవటం మంచిది. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చివరి క్షణాల్లో కొన్ని పనులు పూర్తవుతాయి. దూరప్రయాణాలు చేయకపోవడం మంచిది.

వృషభ రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయవలసి వస్తుంది. సంతానం నుండి శుభవార్త వింటారు. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. పనులు సక్రమంగా పూర్తి చేసుకోవాలి.

మిధున రాశి: ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. బంధువులతో వాదనలకు దిగటం వల్ల దూరమయ్యే అవకాశాలున్నాయి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు అంతగా పనికిరావు. పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశి వారి గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. కొత్తగా పనులు ప్రారంభించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.

సింహరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఏ పనులు చేసిన సక్రమంగా పూర్తి చేసుకోవాలి. ఇతరుల సహాయం కోసం బాగా ఎదురు చూస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య రాశి: ఈ రాశి వారు అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయటం వల్ల మనశ్శాంతి కోల్పోతారు. భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు. విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

తుల రాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకూడదు. ప్రయాణాలు చేసే వరకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన పనులలో నిర్లక్ష్యం చేస్తారు. అనుకోకుండా పాత స్నేహితులను కలుస్తారు. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో ఎక్కువగా పంచుకోకండి. తోబుట్టువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు. ప్రారంభించిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. పాత స్నేహితులు కలవడం వల్ల సంతోషంగా ఉంటారు. సమయం అనుకూలంగా ఉంది.

మకరరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి. వాహన కొనుగోలు చేస్తారు. ఒంటరి ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వ్యాపారాలు మొదలు పెట్టుకోవాలనుకునే వాళ్లకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశముంది.

కుంభరాశి: ఈ రాశి వారు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుంది. కొన్ని పనులు పూర్తి చేసేటప్పుడు ఇతరుల సహకారం అందుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీన రాశి: ఈ రాశి వారు గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. తీరిక లేని సమయంతో గడిపే వాళ్లకు విశ్రాంతి దొరుకుతుంది. చేపట్టిన పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. శత్రువులు మిత్రులవటం వల్ల చాలా సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on ఫిబ్రవరి 6, 2023 at 12:00 ఉద.