Zodiac Signs
Zodiac Signs

Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.

zodiac signs: ఫిబ్రవరి 7, 2023 పంచాగం

తేది : 7, ఫిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : మంగళవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : పాడ్యమి ఉదయం 02:18ని. విదియ
నక్షత్రం : మఖ సాయంత్రం 05:45 ని.
వర్జ్యం : ఉదయం 2.35ని॥ నుంచి 4.21ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని నుండి 9.23ని. తిరిగి రాత్రి 11.15ని. నుండి 12.00ని.
రాహుకాలం : మధ్యాహ్నం 3.00ని.ల నుంచి 4.30ని.ల వరకు
యమగండం : ఉదయం 8.58ని.ల నుంచి 10.39ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.50ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.10ని.ల వరకు

మేషరాశి: తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆలస్యం చేస్తారు ఈ రాశికి చెందిన వాళ్లు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఇంటి నిర్మాణం చేసే అవకాశం ఉంది. కొందరు దూర ప్రయాణాలు చేస్తారు. మీ జీవితంలోకి కొత్త పరిచయాలు రావటం వల్ల సంతోషంగా ఉంటారు. సమయాన్ని అనుకూలంగా మార్చుకోవాలి.

వృషభ రాశి: కొన్ని రోజుల నుండి తీరికలేని సమయంతో గడుపుతున్న వాళ్ళకి ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది. భూమికి సంబంధించిన విషయంలో బాగా ఆలోచించాలి. కొందరు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు. దూరపు బంధువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించాల్సి వస్తుంది.

మిధున రాశి: అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఏ పని చేసినా కాస్త నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కాస్త నష్టాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

Zodiac Signs
Zodiac Signs

కర్కాటక రాశి: ఈ రాశికి చెందిన వాళ్ళల్లో కొందరికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహరాశి: ఈ రాశి వారికి ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. వాహనాల మీద ప్రయాణించే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇతరులను అనవసరంగా బాధ పెట్టకూడదు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. సమయాన్ని కాపాడుకోవాలి.

కన్య రాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. ఆర్థికంగా లాభాలు అందుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక విషయం పట్ల ఆలోచన చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. బంధువులతో కొన్ని విషయాల గురించి మాట్లాడుతారు.

తుల రాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు. కొన్ని కోర్టు సమస్యలు ఈ రోజుకు తీరిపోతాయి. భూమి కొనుగోలు చేయాలనుకునే వాళ్లకు ఈ రోజు అనుకూలంగా ఉంది. తీర్థయాత్రల వంటి దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు తమ పాత స్నేహితులను కలుస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. కొందరికి మంచి సలహాలు అందుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడకుండా చూసుకోవాలి. ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వీరిలో ఉంటుంది. పనుల ద్వారా ఒత్తిడి చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు.

మకరరాశి: ఈ రాశి వారు ఏ పని చేసినా ఆలోచించాలి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. జీవిత భాగస్వామితో అనవసరంగా వాదనలకు దిగుతారు. ఆస్తుల విషయంలో తొందరపడటం వల్ల చాలా నష్టాలు వస్తాయి. దీనివల్ల మనశాంతి కోల్పోతారు.

కుంభరాశి: ఈ రాశి వారు చేయాల్సిన పనులు నిర్లక్ష్యం చేస్తారు. ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి. ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు. మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

మీన రాశి: దూర ప్రయాణాలు చేయాలనుకున్న వారికి ప్రమాదాలు తప్పవు. ఏ పని చేసిన జాగ్రత్తగా చేయాలి. అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడటం వల్ల కొన్ని పనులు సులువుగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Akashavani

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...