Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: ఫిబ్రవరి 8, 2023 పంచాగం
తేది : 8, ఫిబ్రవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : మాఘ మాసం
ఋతువు : శిశిర ఋతువు
వారము : బుధవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : విదియ ఉదయం 4.28ని. తదియ
నక్షత్రం : పుబ్బ రాత్రి 8.14ని.
వర్జ్యం : ఉదయం 4.06ని॥ నుంచి 5.51ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 11.57ని నుండి 12.48ని.
రాహుకాలం : మధ్యాహ్నం 12.00ని.ల నుంచి 1.30ని.ల వరకు
యమగండం : ఉదయం 7.18ని.ల నుంచి 8.58ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.49ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6.10ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా మంచి లాభాలు అందుకుంటారు. ఇతరులను ఎక్కువగా ఇబ్బంది పెట్టకపోవడం మంచిది. చేయాల్సిన పనులు సమయానికి పూర్తి చేయటం మంచిది. కొన్ని సంతోషకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
వృషభ రాశి: ఈ రాశి వారు తమ పనులను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. సుదీర్ఘ ప్రయాణానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యా రంగాలలో మీ వంతు సహాయం చేస్తుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది.
మిధున రాశి: ఈ రాశి వారు తమ దగ్గర బంధువులతో భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు. మీ మానసిక ఉద్రిక్తత స్థాయి కొంతవరకు పెరిగే అవకాశం ఉంది. శారీరక సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు లాభాలున్నాయి.

కర్కాటక రాశి: ఈ రాశి వారు ఏ విషయంలో నేను ఓపికగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కాస్త కుదుటపడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల ప్రశంసలు అందుతాయి.
సింహరాశి: ఈ రాశి వారికి చదువులో కొంత ఆటంకం కలుగుతుంది. కొందరు అంతర్జాతీయ పర్యటనలకు వెళ్తారు. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. ఇంతకుముందున్న సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. కొందరు మోసం చేసే వ్యక్తులు మీ వెంటే ఉంటారు. సమయాన్ని కాపాడుకోవాలి.
కన్య రాశి: ఈ రాశి వారు తమ వ్యక్తిగత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అకస్మాత్తుగా రాజయోగం వంటి ఫలితాలు. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఒక విషయంలో అదృష్టం వెంట ఉంటుంది. సొంత నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.
తుల రాశి: ఈ రాశి వారు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. గత కొన్ని రోజుల నుండి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య ఈరోజు బయటపడుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల భారీ నుండి తప్పించుకోవటం మంచిది. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి అనవసరమైన విషయాలలో దూకుడు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు అనుకోకుండా కొన్ని విషయాలలో నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది. పై అధికారుల సలహాలతో కొన్ని పనులు పూర్తి చేయటం మంచిది. సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మకరరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఇతరులు మీ సోమ్మును తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఈరోజు సంతోషంగా ఉంటారు.
కుంభరాశి: ఈ రాశి వారు తీరికలేని సమయంతో గడుపుతారు. కొత్త పనులు ప్రారంభించే వాళ్ళు తొందరపడకూడదు. దూర ప్రయాణాలు చేసే వాళ్లకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి. పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంది.
మీన రాశి: ఈ రాశి వారు శత్రువులని నమ్మడం వల్ల మోసపోతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. దూరపు బంధువుల నుండి శుభవార్త వింటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా జాగ్రత్తగా పూర్తి చేయాలి. వ్యాపారస్తులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.