Zodiac Signs: ప్రతి ఒక్కరి జీవితంలో రాశులు చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం, ఎవరికీ శుభం జరుగుతుంది.. ఎవరికి అశుభం జరుగుతుంది తెలుసుకోవటంలో బాగా ఆసక్తి చూపిస్తారు. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.
zodiac signs: జనవరి 13, 2023 పంచాగం
తేది : 13, జనవరి 2023
సంవత్సరం : శుభకృతునామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయనం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
వారము : శుక్రవారం
పక్షం : కృష్ణపక్షం
తిథి : షష్ఠి సాయంత్రం 6.17ని.
నక్షత్రం : ఉత్తర సాయంత్రం 4.35ని.
వర్జ్యం : ఉదయం 1.34ని॥ నుంచి 3.16ని॥ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 8.32ని. నుండి 9.23ని. తిరిగి
12.48ని నుండి 1.39ని.
రాహుకాలం : ఉదయం 10.30 ని.ల నుంచి 12.00ని.ల వరకు
యమగండం : మధ్యాహ్నం 3.41ని.ల నుంచి 5.21ని.ల వరకు
సూర్యోదయం : ఉదయం 6.53ని.లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5.56ని.ల వరకు
మేషరాశి: ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. నూతన వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈరోజు కొందరికి బాగా కలిసి వస్తుంది. పనులు సక్రమంగా పూర్తవుతాయి.
వృషభరాశి: ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా. ఈరోజు చేసే కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్నేహితుల ద్వారా కొన్ని సలహాలు అందుకుంటారు. తల్లిదండ్రులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. సమయాన్ని కాలక్షేపం చేస్తారు.
మిథునరాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేయటానికి ఈరోజు అనుకూలంగా ఉంది. మీ వ్యక్తిగత విషయాలు అనవసరంగా ఇతరులతో పంచుకోకూడదు. శత్రువులకు దూరంగా ఉండాలి. కొన్ని పనులు చేసేటప్పుడు ఇతరుల సహాయం అందుకోవాల్సి ఉంటుంది.

కర్కాటకరాశి: ఈ రాశి వారు గతంలో కొన్ని పనులను వాయిదా వేయడం వల్ల ఇప్పుడు పూర్తి చేయటానికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచించాలి. ఇతరులకు సహాయం చేస్తారు.
సింహరాశి: ఈ రాశి వారు ఏ పని చేసిన నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ఈరోజు మీ స్నేహితులతో కలిసి సమయాన్ని కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు లాభాలు ఉన్నాయి.
కన్యరాశి: ఈ రాశి వారు ఏ పనులైనా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి. శత్రువులకు దూరంగా ఉండటం మంచిది. పాత స్నేహితులను కలుస్తారు. కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.
తులరాశి: ఈ రాశి వారు ఏ పని చేసిన ఇతరుల సహాయం అందుకుంటారు. దీనివల్ల సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాల పట్ల అనవసరంగా ఒత్తిడికి గురవుతారు. దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. వ్యాపారస్తులు పెట్టుబడి కంటే ఎక్కువ లాభాలు అందుకుంటారు.
వృశ్చికరాశి: ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయటం మంచిది. భాగస్వామితో అనవసరంగా వాదనలకు దిగకూడదు.
ధనుస్సురాశి: ఈ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరుల సహాయం అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు కలిసి రావు. మీ వ్యక్తిగత విషయాలలో ఇతరులు చులకన చేస్తారు. దీనిపట్ల చింత చెందకూడదు. మీరు పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.
మకరరాశి: ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులల్లో నిర్లక్ష్యం చేస్తారు. తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాలను పక్కకు పెట్టాలి. మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.
కుంభరాశి: ఈ రాశి వారు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులు చేయటానికి ఆసక్తి చూపిస్తారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. ఇతరులకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. విద్యార్థులు చదువు పట్ల మంచి ఫలితాలు అందుకుంటారు.
మీనరాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితులతో కొన్ని విషయాల గురించి మాట్లాడుతారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడంతో ఖర్చులు ఎక్కువ అవుతాయి. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి. సమయాన్ని వృధా చేయకూడదు.